MGR birth anniversary
-
కల నెరవేరింది
తమిళ ప్రఖ్యాత నవల ‘పొన్నియిన్ సెల్వన్’ని సినిమాగా తీసుకురావాలన్నది దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి యంజీఆర్ (యంజీ రామచంద్రన్) కల. ఈ నవలను సినిమాగా తీయాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. ఇప్పుడు యంజీఆర్‌ను యానిమేషన్ రూపంలో ‘పొన్నియిన్ సెల్వన్’ రూపొందిస్తోంది చెన్నైకు సంబంధించిన శనీశ్వరన్ యానిమేషన్ స్టూడియో ఇంటర్నేషనల్. ఈ సంస్థే నిర్మాణాన్ని కూడా చూసుకుంటోంది. ‘వందియదేవన్: పొన్నియిన్ సెల్వన్ 1’ పేరుతో ఈ భారీ బడ్జెట్ యానిమేషన్ చిత్రాన్ని దర్శకుడు దవచెల్వాన్ తెరకెక్కిస్తున్నారు. నాలుగేళ్లుగా ఈ సినిమాపై వర్క్ చేస్తోందట ఈ యానిమేషన్ స్టూడియో. ఇటీవల యంజీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్గా జయలలిత పాత్ర ఉండబోతోందట. ఆమె పాత్ర కూడా యానిమేషన్లోనే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంగతి అలా ఉంచితే ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
దినకరన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొత్తపార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం పుదుచెర్రిలో మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంజీఆర్ జయంతి వేడుకల నేపథ్యంలో దినకరన్ కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నీమధ్యే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర్యగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. మూడు నెలలో ప్రభుత్వం కూలిపోతుందని.. అన్నాడీఎంకే నుంచి బయటకు రావాలంటూ ఆ సందర్భంలో దినకరన్ నేతలకు పిలుపునిచ్చాడు. శశికళ జైలుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని సామి.. పన్నీర్‌సెల్వంతో కలిసి అన్నాడీఎంకే పార్టీపై పట్టుసాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శశికళ-దినకరన్ వర్గంపై వేటు వేసి, వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయిన నేపథ్యంలోనే దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు స్పష్టమౌతోంది. -
అన్నాడీఎంకేలో ఇక ఆ రెండు వర్గాలేనా?
చెన్నై: జయలలిత మరణం తరువాత మూడు ముక్కలైన అన్నాడీఎంకే రెండుగా మారనుందా? ఇక ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు మాత్రమే మిగలనున్నాయా? అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు నిన్నమదురైలో ఘనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పాండికోయిల్ సమీపంలోని అమ్మ మైదానంలో భారీ వేదికను నిర్మించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శుక్రవారం మదురైకు వచ్చారు. అయితే పార్టీపరంగా జరపాల్సిన ఈ కార్యక్రమాలకు ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను ఎడపాడి దూరంగా పెట్టారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీకి డబ్బును ఎరవేసి దినకరన్ జైలు పాలైనప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేశారు. అయితే బెయిల్‌పై బైటకు వచ్చిన తరువాత పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని దినకరన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభం కాగా దినకరన్‌ను దూరం పెట్టారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇందుకు తీవ్రంగా ఆగ్రహించారు. అంతేగాక మదురైలోనే పోటీగా మరో భారీ ఎత్తున ఎంజీఆర్ శతజయంతి సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఎంజీఆర్ శత జయంతికి హాజరు కాకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందనే భయంతో దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు తంగ తమిళ్‌సెల్వన్, బోస్ సభకు హాజరయ్యారు. దినకరన్ వర్గం ఎడపాడికి దాసోహమైందని కొందరు వ్యాఖ్యానించగా, ప్రభుత్వ కార్యక్రయం కావడంతో వచ్చామని వారు సమర్థించుకున్నారు. దినకరన్ పేరుతో పేరవై మరోవైపు దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించారు. 54 జిల్లాల నిర్వాహకులను నియమించి వారిని ఆయన స్వయంగా కలిశారు. 50 లక్షల మందిని పేరవైలో చేర్పించాలనేదే తమ లక్ష్యంగా భావిస్తున్నట్లు దినకరన్ తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లే ముందు దినకరన్, వెంకటేశ్‌లను పార్టీలో చేర్పించిన విషయం తెలిసిందే. దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. అయితే దినకరన్‌కు, ఎడపాడి వర్గాలకు ఘర్షణ ఏర్పడడంతో ఆయన పార్టీ నుంచి కొంత దూరమయ్యారు. హఠాత్తుగా దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించడం దానికి ఒకే రోజు 54 మంది జిల్లా నిర్వాహక కార్యదర్శులను నియమించిన సంఘటన అన్నాడీఎంకేలో సంచలనం కలిగించింది.