ఎంఐ ఇంజినీరు పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
బీచ్‌రోడ్ : ఆంధ్రప్రదేశ్ మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టు విశాఖపట్నంలో ఔట్సోర్సింగ్ పద్ధతిపై ఎంఐ ఇంజినీరు పోస్టు కోసం బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీ–ఎ, లేని ఎడల బీసీ–బి గ్రూపులకు చెందిన 45 ఏళ్ల వయసు గల స్థానిక అభ్యర్థులు వచ్చే నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తాటిచెట్లపాలెం, ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఉద్యాన కార్యాలయ కాంప్లెక్స్‌లో ఉన్న ఏపీ మైక్రో ఇరిగేషన్ పథక సంచాలకునికి అందినట్లు పంపించాలని సూచించారు. దరఖాస్తుతోపాటు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన సర్టిఫికెట్లు (అర్హత డిగ్రీ మార్కుల జాబితా, పదో తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం) జతచేయాలని కోరారు. ఈ పోస్టుకు కేవలం డిగ్రీ మార్కులు మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటామని పేర్కొన్నారు.