అంతరిక్ష సూక్ష్మజీవికి అబ్దుల్ కలాం పేరు
లాస్ ఏంజిలస్: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను గౌరవిస్తూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ కొత్త జీవికి ఆయన పేరుతో నామకరణం చేసింది. ఇది ఒక రకం సూక్ష్మజీవి.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ ఎస్)లో తప్ప ఇది ఇంతవరకు ఎప్పుడూ భూమిపై కనిపిం చలేదు. కొత్త జీవికి శాస్త్రవేత్తలు సొలిబెసిల్లస్ కలామీ అని పేరు పెట్టారు. నాసాలో సీనియర్ శాస్త్ర్రవేత్త అయిన కస్తూరీ వెంకటేశ్వరన్ ఈ విషయం వెల్లడించారు. 1963లో కలాం నాసాలో శిక్షణ తీసుకున్నారు.