మహిళా డెరైక్టర్ల ఎంపికకు మరింత గడువు
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్‌హోమ్ గేమింగ్ సంస్థ మోజంగ్కు చెందిన మైన్క్రాఫ్ట్ను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.5 బిలియన్ డాలర్లను(రూ. 15,000 కోట్లు) వెచ్చించనుంది. 2009లో విడుదలైన మైన్‌క్రాఫ్ట్ గేమ్‌ను దీర్ఘకాలంగా కంప్యూటర్స్‌లో డౌన్లోడ్ చేసుకుంటూనే ఉండటం విశేషం.
ఎక్స్‌బాక్స్‌లో ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన గేమ్కాగా, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్, గూగుల్ ఆండ్రాయిడ్‌లోనూ టాప్ యాప్‌గా నిలుస్తోంది. మైన్‌క్రాఫ్ట్ అత్యంత విజయవంత మైన గేమింగ్ ఫ్రాంచైజీ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గేమింగ్ కమ్యూనిటీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొత్త అవకాశాలకు తెరలేపనున్నట్లు చెప్పారు. 2014 చివర్లో డీల్ పూర్తికాగలదని అంచనా. కాగా, 2015కల్లా మైన్‌క్రాఫ్ట్ లాభాలు ఆర్జించే స్థితికి(బ్రేక్ ఈవెన్) చేరుతుందని మైక్రోసాఫ్ట్ అంచనా వేస్తోంది.