middaymeals
-
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
సాక్షి, చౌడేపల్లె: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచికరంగా అందించాలని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త అన్నారు. పుంగనూరు పర్యటన ముగించుకుని చిత్తూరు వెళుతున్న కలెక్టర్ చౌడేపల్లె మండలం పుదిపట్ల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. భోజనం నాణ్యతపై దృష్టి పెట్టాలని వంట నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని హెచ్ఎం వేదవతికి సూచించారు. విద్యార్థుల జీవితాలకు మార్గం చూపేలా బోధన సాగాలని తెలిపారు. గత ఏడాది పుదిపట్లలో 98 శాతం ఉత్తీర్ణత సాధిం చామని హెచ్ఎం కలెక్టర్‌కు వివరించారు. ఈ ఏడాది ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలో అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వాచ్మెన్ కావాలని పాఠశాల సిబ్బంది కోరారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పరిశ్రమల స్థాపనతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 21 ఎంఓయూలు చేయడం ద్వారా 7,911 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 2018–19 సంవత్సరాల్లో 1,363 యూనిట్లు స్థాపించినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 175 యూనిట్లు స్థాపించినట్లు తెలిపారు. 2014–15 నుంచి 2019–20 వరకు 3,289 యూనిట్ల ద్వారా 92,697 మందికి ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. 2018–19లో మెగా పరిశ్రమల స్థాపనలో భాగంగా 9 పెద్ద పరిశ్రమలను స్థాపించామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు ప్రతినెలా 5న అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సింగిల్ డెస్క్ హోటల్ ద్వారా మూడు నెలల కాలంలో 352 దరఖాస్తులు అందగా 331 దరఖాస్తులను ఆమోదించామన్నారు. 129 పెద్ద పరిశ్రమలకుగాను 78 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మార్కండేయులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంఓయూలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కమలకుమారి, పరిశ్రమల శాఖ జీఎం అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపీఐఐసీ జెడ్ఎం ఐఎల్.రామ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రైవేటు నిర్ణయం తగదంటూ ఆందోళన..
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా కాకినాడ సిటీ : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని డిమాండ్ చేస్తూ ఆ పథకం కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. 25 వేల మంది పిల్లలకు ఒకేచోట వండి పంపిణీ చేయించాలంటూ ప్రభుత్వం మెమో విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ మల్లికార్జునకు ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల జిల్లాలోని ఎనిమిది వేల మంది ఈ çపథకం కార్మికులకు ముఖ్యంగా మహిళలకు ఉపాధి పోతుందన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏర్పాటుకు సదుపాయాలు మెరుగుపర్చాలని, వారానికి మూడు గుడ్ల సరఫరా, బిల్లులు, వేతనాలు ప్రతి నెలా 5వ తేదీలోపు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యరీత్యా, కార్మికుల ఉపాధిపరంగా చూస్తే పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల నష్టమేనన్నారు. మెనూ బడ్జెట్‌ను పెంచి పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసే చర్యలు తీసుకోవాలని ఈ పథక కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. -
బడి భోజనం...బేజారు
–మధ్యాహ్నాం భోజన పధకంలో తగ్గుతున్న భూజిస్తున్న విద్యార్ధుల సంఖ్య –ఇళ్ల నుంచే క్యారేజీలు తెచ్చుకుంటున్న విద్యార్ధులు –అమలుకి నోచుకోని పెంచిన మోనో చార్జీలు –ఉన్నత పాఠశాలల్లో మూఫై ఐదు శాతం మందికి పైగా భోజనానికి దూరం కొవ్వూరు: బడి మానివేస్తున్న విద్యార్ధుల సంఖ్యను తగ్గించాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 2005లో మధ్యాహ్నా భోజన పధకాన్ని ప్రవేశపెట్టారు.పేద విద్యార్ధులకు ఆహారం అందించడంతో ద్వారా బడిలో విద్యార్ధుల సంఖ్యను పెంచాలన్నదీ ఈ పధకం ముఖ్య ఉద్ధేశ్యం. మోనో చార్జీలు ఎప్పటికప్పుడు పెంచకపోవడంతో ఆçహారంలో నాణ్యత కొరవడుతుంది.గత ఏడాది అమలు చేసిన మోనోచార్జీలే ప్రస్తుతం చెల్లిస్తున్నారు.ఈ ఏడాది చార్జీలు పెంచినట్టు ఆదేశాలందినా నేటికీ అమలుకి నోచుకోలేదు. నెలల తరబడి బిల్లులు అందకపోవడంతో నిర్వాహాక ఏజన్సీ మహిళలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోంటు న్నారు.ఫలితంగా పాఠశాలల్లో మధ్యాహ్నాం భోజనం చేసే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.వారానికి రెండు గుడ్లు నుంచి మూడు గుడ్లుకి పెంచినా మోనో పెరగకపోవడంతో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ఐటీడీఎ పరిధిలో అన్నీ పాఠశాలలు కలిపి 3,257 పాఠశాలలున్నాయి. వీటిలో 3,02,271 మంది విద్యార్ధులు చదువులు సాగిస్తున్నారు. వీరిలో మధ్యాహ్నాం భోజనం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ తగ్గుతుంది. ముఖ్యం గా కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఆరవై నుంచి ఆరవై ఐదుశాతం మంది మాత్రమే భోజనం చేస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ప్రాధమిక పాఠశాలల్లో కాస్తా పరిస్ధితి మెరుగ్గా ఉంది. ఐదు నుంచి పదిశాతం మందిలోపు మాత్రం పిల్లలు భోజనాలు చేయడం లేదు.యూపీ పాఠశాలల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది పిల్లలు భోజనాలు చేయడం లేదు.అన్నీ రకాల పాఠశాలల్లో కలిపి సరాసరిన 12 శాతం మంది భోజనం చేయడం లేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ప్రభుత్వం ఇందుకు కారణాలు వెతకకుండా ఇప్పుడు వారానికి విద్యార్ధులకు ఈనెల 1వ తేదీ నంచి మూడు కోడి గుడ్లు అందించాలంటూ ఆదేశించింది.అయినప్పటికీ తగిన ఫలితం కనిపించకపోవడం గమనర్హం. అందని పెరిగిన మోనో చార్జీలు...? గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్ధులకు ఒక్కోక్కరికి రూ.4.86 పైసలు, 9,10 తరగతుల విద్యార్ధులకు రూ.6.78 పైసలు చోప్పున అందిస్తున్నారు.దీనిలో 9,10 తరగతి విద్యార్ధులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా, 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్ధులకు కేంద్రం ప్రభుత్వం ఆరవై శాతం, రాష్ట్రం నలభై శాతం వాటా చోప్పున చెల్లిస్తున్నాయి.ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి మోనో చార్జీలు దేశవ్యాప్తంగా పెంచుతున్నట్టు ఆదేశాలు అందినప్పటికీ బడ్జెట్ మాత్రం విడుదల కాలేదు.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పెంచిన ధరలను అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం కొత్త మోనో ప్రకారం చెల్లించకపోవడం భోజన ప««దlకానికి ఆధరణ తగ్గుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తగ్గుతున్న విద్యార్ధుల సంఖ్య: ఈ విద్యా సంవత్సరం గడిచిన మూడు నెలలు నుంచి జిల్లాలో మధ్యాహ్నాం భోజనం పధకంలో భోజనాలు చేస్తున్న విద్యార్ధుల సంఖ్యను పరిశీలిస్తే ఇప్పటి వరకు 81,528 మంది విద్యార్ధులు పాఠశాలలకు వచ్చి కుడా భోజనాలు చేయలేదు.వారంతా ఇళ్ల వద్ద నుంచే భోజనాలు తెచ్చుకుంటున్నారు.జూలైలో జిల్లాలో 16,488 మంది, ఆగష్టులో 32,673, సెప్టెంబర్‌లో 32,367 మంది భోజనాలు చేయలేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.దిగువ పట్టికను పరిశీలిస్తే అర్ధమవుతుంది. .......................................................................................... నెల మొత్తం హజరైన వారి భోజనం చేసిన భోజనం చేయని విద్యార్ధుల సంఖ్య విద్యార్ధుల సంఖ్య విద్యార్ధుల సంఖ్య సంఖ్య/ .......................................................................................... జూలై– 2,87,699 2,71,610 2,55,122 16,488 ఆగష్టు– 3,02,271 2,85,828 2,53,155 32,673 సెప్టెంబర్–3,02,271 2,82,516 2,50,149 32,367 ...................................................................................... మొత్తం మూడునెలల్లో భోజనం చేయని విద్యార్ధుల సంఖ్య–81,528 .......................................................................................... బిల్లులు అందక అవస్ధలు: జిల్లా వ్యాప్తంగా మ«ధ్యాహ్నాం భోజన పధకం అమలుకి నెలకి రూ.3.51 కోట్లు ఖర్చువుతుంది.ఈ విద్యాసంవత్సరం మొదటి త్రై మాసికానికి (ఆగష్టు వరకు) రూ.11,40,66,000 నిధులు విడుదలయ్యాయి. సెప్టెంబర్ నెలకి ఇప్పటి వరకు బిల్లులు అందలేదు. అక్టోబర్ నెల అప్పుడే పక్షం రోజులు గడిచింది.ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జూన్ నెలలో మిగిలిన బడ్జెట్ గత విద్యా సంవత్సరంలో మిలిగిన సోమ్ములతో సెప్టెంబర్ నెల బిల్లులకు సర్ధుబాటు చేస్తున్నామన్నారు.నెల వారీగా బిల్లులు అందకపోవడం ఏజన్సీ నిర్వాహాక మహిళలు ఆర్ధికంగా తీవ్ర ఒడిదుడులు ఎదుర్కోంటున్నారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి వరకు సుమారు రూ.5కోట్లు మేరకు మధ్యాహ్నాం భోజన పధకం బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.ఈనెల 20 వ తేదీ దాటిన తర్వత కొంత మేరకు బకాయిలు సర్ధుబాటు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబతున్నారు.బిల్లులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,545 నిర్వాహాక ఏజన్సీ మహిళలకు గౌరవ వేతనం సైతం అందలేదు. -
మధ్యాహ్నం.. అధ్వానం
మెనూ మచ్చుకైనా పాటించరు రోజూ నాణ్యత లేని భోజనమే తినలేకపోతున్న విద్యార్థులు కానరాని సౌకర్యాలు పట్టించుకోని అధికారులు గోదావరిఖనిటౌన్/రామగుండం : నియోజకవర్గంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటోంది. ప్రభుత్వ మెనూ పత్తాలేకుండా పోయింది. వేసవి సెలవుత తర్వాత పాఠశాలలు ప్రారంభించినప్పటి నుంచి మధ్యాహ్న బోజన నిర్వాహకులు ఒకే రకమైన కూర వండుతున్నారు. అది కూడా సరిగా ఉండడంలేదు. రోజూ ఒకే కూర తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తురన్నారు. ప్రాథమిక స్థాయి ఒక్కో విద్యార్థికి రూ.4.25పైసలు, హైస్కూల్ విద్యార్థికి రూ.6.65పై భోజనం కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం పప్పులు, కూరగాయలు, కోడిగుడ్ల ధరలు పెరుగడం, నిర్వాహకులకు నెలనెలా బిల్లులు సక్రమంగా రాకపోవడంతో మధ్యాహ్నం భోజనం నాణ్యత లోపిస్తోందని పలువురు అంటున్నారు. ప్రభుత్వ మెను ప్రకారం కిచిడి, లెమన్ రైస్, గ్రుడ్డు ఇతర ఏదైన అందించాలి. అది మచ్చుకైన కానరావడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం గుడ్డును అందిస్తునారు. గోదావరిఖని విఠల్‌నగర్, కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామం, అశోక్గనర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాల, గాంధీ పార్క్, గాంధీనగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, రామగుండం పట్టణంలోని పాఠశాలల్లో నిత్యం సుమారు 1500 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. రోజు ఒకే విధంగా పులుసును వడ్డిస్తుండడంతో ముద్ద దిగడం లేదని విద్యార్థులు అంటున్నారు. జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల, అన్నపూర్ణకాలనీలోని దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం బాగుందని విద్యార్థులు వెల్లడించారు. గతంలో కన్నా ప్రస్తుతం సన్నబియ్యం అన్నం చాలాబాగుందని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారని అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు బసంత్‌నగర్ : క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బసంత్‌నగర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడంలేదు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వాహకులు భోజనం వండడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలు సగం కడుపుకే భోజనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో వంటలు రుచికరంగా ఉండకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్తున్నారు. ధరలు పెరిగాయని విద్యార్థులకు ప్రస్తుతం వారిని ఒకరోజు మాత్రమే గుడ్డు ఇస్తున్నారు. రుచిగా ఉండడం లేదు – అనిల్, ఏడో తరగతి, బసంత్‌నగర్ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగానే సరిపోతోంది. ఎక్కువ రోజులు సాంబారు, ఆలుగడ్డ కూరనే పెడుతున్నరు. అవి కూడా అంతగా రుచిగా ఉండటం లేదు. రుచికరమైన భోజనం అందించాలి. -
పిల్లల బియ్యం..పెద్దల భోజ్యం
– పక్కదారి పడుతున్న ‘మధ్యాహ్న’ బియ్యం – అంగన్వాడీల్లోనూ అదే తంతు – ప్యాకెట్‌పై 2 నుంచి 3 కేజీల తరుగు – ఎంఎల్‌ఎస్‌లో అధికారుల చేతివాటం – బోగస్ హాజరుతో సరిచేస్తున్న హెచ్ఎంలు – చిన్నారుల కడుపుమాడుస్తున్న వైనం కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు/అర్బన్): మధ్యాహ్నం భోజనం..మంచి లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న పథకం. పేదరికం కారణంగా చిన్నారులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దీనిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అయితే పిల్లల బియ్యాన్ని పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. విద్యార్థుల కడుపు మాడుస్తూ..తమ స్వలాభం చూసుకుంటున్నారు. మండల లెవల్ స్టాక్ పాయింట్(ఎంఎల్ఎస్)లలో ఏటా 300 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమవుతుందంటే అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవచ్చు. జిల్లాలో 2,929 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే 3,93,866 మంది పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ప్రాథమిక పాఠశాలలో చదివే ఒక్కో విద్యార్థికి 100 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 150 గ్రాముల చొప్పున బియ్యం సరఫరా అవుతోంది. అయితే ఆయా పాఠశాలలకు సరఫరా అయ్యే బియ్యం బస్తాలో రెండు నుంచి మూడు కేజీల వరకు తరుగు ఉంటోంది. ఇది కొన్ని బస్తాల్లో ఐదారు కేజీల వరకు ఉంటుందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. కొన్ని సమయాల్లో దాదాపు సగం బస్తా వచ్చిన సందర్భాలు ఉన్నాయని, అయినా ఎవరినీ అడగలేని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. నెలకు 32 నుంచి 35 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం.. జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలిపి నెలకు దాదాపుగా 819.187 మెట్రిక్ టన్నుల బియాన్ని పౌర సరఫరాల ద్వారా అందజేస్తారు. ఇందులో బియ్యం బస్తాపై వచ్చే తరుగును రెండు కేజీలు సరాసరిగా తీసుకున్నా దాదాపుగా దాదాపుగా 32 మెట్రిక్ టన్నుల బియ్యం మండల లెవల్ స్టాక్ పాయింట్(ఎంఎల్ఎస్)లలో మాయ మవుతోంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సరాసరిగా నెలకు 32 మెట్రిక్ టన్నుల ప్రకారం 256 ఎంఎల్ఎస్ పాయింట్లలో తరుగుదల అయి పాఠశాలలకు వస్తోంది. జూన్, ఆక్టోబర్, ఏప్రిల్ మాసాల్లో 16 మెటిక్ టన్నుల ప్రకారం 48 మెట్రిక్ టన్నుల బియ్యం తరుగుదల వస్తోంది. మొత్తం మీద ఒక్క మే నెల తప్ప.. ఏడాదిలో 300 మెట్రిక్ టన్నుల బియ్యం తరుగుదలగా మిగులుతోంది. బోగస్ హాజరు బియ్యం తరుగుదలను పూడ్చుకునేందుకు ప్రధానోపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. కొందరు బోగస్ హాజరు వేసి నష్టాన్ని పూడ్చుకుంటుండగా..కొన్ని పాఠశాలల్లో పిల్లలకు అన్నం తక్కువగా వడ్డించి కడుపు మాడుస్తున్నారు. ఇది ఏమని అడిగితే తామేమి చేయాలని ప్రధానోపాధ్యాయులు బదులు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లినా∙పట్టించుకోవడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. బోగస్ హాజరు వేయక తప్పదు : రమేష్, హెచ్ఎం, ఎంపీపీ(న్యూ) స్కూల్, చెరుకుచెర్ల బస్తాపై మూడు, నాలుగు కేజీల బియ్యం తక్కువగా వస్తోంది. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా విద్యాశాఖాధికారుల దష్టికి తీసుకెళ్లాం. అయినా వారు ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నష్టాన్ని పూడ్చుకునేందుకు బోగస్ హాజరు వేయక తప్పడంలేదు. ఇంతకన్నా మాకు మరో దారి లేదు. పిల్లలను ఆకలితో కడపు మాడ్చలేము కదా? జగమెరిగిన సత్యం: అతూల్ రహమాన్‌ఖాన్, ఐజీఎం ఉన్నత పాఠశాల, కర్నూలు బస్తాపై ఐదారు కేజీల బియ్యం తక్కువగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోరు. బియ్యం తక్కువగా వచ్చినా పిల్లలకు మాత్రం కడుపునిండా భోజనం పెట్టాలంటారు. దీన్ని మాత్రం పట్టించుకోరు. ఇటీవల బియ్యం సరఫరా చేసే డీలర్లు ఆర్ఓలు ఇవ్వడం లేదు. అంగన్వాడీల్లో ఇలా... చిన్నారుల నోటికాడి కూడును కూడా బియ్యం దొంగలు వదిలిపెట్టడం లేదు. తరుగు పేరుతో ప్రతి 50 కేజీల బస్తా నుంచి నెలకు నాలుగు నుంచి 5 కేజీలను దోచుకుంటూనే ఉన్నారు. చూసేందుకు నాలుగైదు కేజీలే అయినా నెలకు లెక్క కడితే వామ్మో... అనాల్సిందే. జిల్లాలోని 16 అంగన్వాడీ ప్రాజెక్టుల పరిధిలో 3486 అంగన్వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 0 నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 3,58, 234 మంది ఉన్నారు. అలాగే ఆయా కేంద్రాల పరిధిలో 42,084 మంది గర్భవతులు, 39,738 మంది బాలింతలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరికి నెలకు మూడు కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ప్రతీ కేంద్రం పరిధిలో ఉన్న చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు లెక్క గట్టి సమీపంలోని చౌకధరల దుకాణం నుంచి బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే సరఫరా అయ్యే బియ్యంలో 50 కేజీల బస్తాకు నాలుగు నుంచి ఐదు కేజీల వరకు తరుగు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. బాలింతలు, గర్భవతులు, చిన్నారులకు కలిపి ప్రతి నెలా 13,20,168 కేజీల బియ్యం సరఫరా అవుతుండగా తరుగు రూపంలో 13,201 కేజీలు పక్కదారి పడుతోంది. ఇంత మేర బియ్యం పక్కదారి పడుతున్నా ఆయా కేంద్రాల పరిధిలోని లబ్ధిదారులకు ఎలా ఇస్తున్నారంటే తూకాల బదులు డబ్బాలను ఉపయోగిస్తున్నారు.