బడి భోజనం...బేజారు
బడి భోజనం...బేజారు
Published Fri, Oct 14 2016 8:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
–మధ్యాహ్నాం భోజన పధకంలో తగ్గుతున్న భూజిస్తున్న విద్యార్ధుల సంఖ్య
–ఇళ్ల నుంచే క్యారేజీలు తెచ్చుకుంటున్న విద్యార్ధులు
–అమలుకి నోచుకోని పెంచిన మోనో చార్జీలు
–ఉన్నత పాఠశాలల్లో మూఫై ఐదు శాతం మందికి పైగా భోజనానికి దూరం
కొవ్వూరు:
బడి మానివేస్తున్న విద్యార్ధుల సంఖ్యను తగ్గించాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 2005లో మధ్యాహ్నా భోజన పధకాన్ని ప్రవేశపెట్టారు.పేద విద్యార్ధులకు ఆహారం అందించడంతో ద్వారా బడిలో విద్యార్ధుల సంఖ్యను పెంచాలన్నదీ ఈ పధకం ముఖ్య ఉద్ధేశ్యం. మోనో చార్జీలు ఎప్పటికప్పుడు పెంచకపోవడంతో ఆçహారంలో నాణ్యత కొరవడుతుంది.గత ఏడాది అమలు చేసిన మోనోచార్జీలే ప్రస్తుతం చెల్లిస్తున్నారు.ఈ ఏడాది చార్జీలు పెంచినట్టు ఆదేశాలందినా నేటికీ అమలుకి నోచుకోలేదు. నెలల తరబడి బిల్లులు అందకపోవడంతో నిర్వాహాక ఏజన్సీ మహిళలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోంటు న్నారు.ఫలితంగా పాఠశాలల్లో మధ్యాహ్నాం భోజనం చేసే విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.వారానికి రెండు గుడ్లు నుంచి మూడు గుడ్లుకి పెంచినా మోనో పెరగకపోవడంతో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ఐటీడీఎ పరిధిలో అన్నీ పాఠశాలలు కలిపి 3,257 పాఠశాలలున్నాయి. వీటిలో 3,02,271 మంది విద్యార్ధులు చదువులు సాగిస్తున్నారు. వీరిలో మధ్యాహ్నాం భోజనం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ తగ్గుతుంది. ముఖ్యం గా కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఆరవై నుంచి ఆరవై ఐదుశాతం మంది మాత్రమే భోజనం చేస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ప్రాధమిక పాఠశాలల్లో కాస్తా పరిస్ధితి మెరుగ్గా ఉంది. ఐదు నుంచి పదిశాతం మందిలోపు మాత్రం పిల్లలు భోజనాలు చేయడం లేదు.యూపీ పాఠశాలల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది పిల్లలు భోజనాలు చేయడం లేదు.అన్నీ రకాల పాఠశాలల్లో కలిపి సరాసరిన 12 శాతం మంది భోజనం చేయడం లేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ప్రభుత్వం ఇందుకు కారణాలు వెతకకుండా ఇప్పుడు వారానికి విద్యార్ధులకు ఈనెల 1వ తేదీ నంచి మూడు కోడి గుడ్లు అందించాలంటూ ఆదేశించింది.అయినప్పటికీ తగిన ఫలితం కనిపించకపోవడం గమనర్హం.
అందని పెరిగిన మోనో చార్జీలు...?
గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్ధులకు ఒక్కోక్కరికి రూ.4.86 పైసలు, 9,10 తరగతుల విద్యార్ధులకు రూ.6.78 పైసలు చోప్పున అందిస్తున్నారు.దీనిలో 9,10 తరగతి విద్యార్ధులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా, 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్ధులకు కేంద్రం ప్రభుత్వం ఆరవై శాతం, రాష్ట్రం నలభై శాతం వాటా చోప్పున చెల్లిస్తున్నాయి.ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి మోనో చార్జీలు దేశవ్యాప్తంగా పెంచుతున్నట్టు ఆదేశాలు అందినప్పటికీ బడ్జెట్ మాత్రం విడుదల కాలేదు.ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పెంచిన ధరలను అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం కొత్త మోనో ప్రకారం చెల్లించకపోవడం భోజన ప««దlకానికి ఆధరణ తగ్గుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
తగ్గుతున్న విద్యార్ధుల సంఖ్య:
ఈ విద్యా సంవత్సరం గడిచిన మూడు నెలలు నుంచి జిల్లాలో మధ్యాహ్నాం భోజనం పధకంలో భోజనాలు చేస్తున్న విద్యార్ధుల సంఖ్యను పరిశీలిస్తే ఇప్పటి వరకు 81,528 మంది విద్యార్ధులు పాఠశాలలకు వచ్చి కుడా భోజనాలు చేయలేదు.వారంతా ఇళ్ల వద్ద నుంచే భోజనాలు తెచ్చుకుంటున్నారు.జూలైలో జిల్లాలో 16,488 మంది, ఆగష్టులో 32,673, సెప్టెంబర్‌లో 32,367 మంది భోజనాలు చేయలేదని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.దిగువ పట్టికను పరిశీలిస్తే అర్ధమవుతుంది.
..........................................................................................
నెల మొత్తం హజరైన వారి భోజనం చేసిన భోజనం చేయని
విద్యార్ధుల సంఖ్య విద్యార్ధుల సంఖ్య విద్యార్ధుల సంఖ్య
సంఖ్య/
..........................................................................................
జూలై– 2,87,699 2,71,610 2,55,122 16,488
ఆగష్టు– 3,02,271 2,85,828 2,53,155 32,673
సెప్టెంబర్–3,02,271 2,82,516 2,50,149 32,367
......................................................................................
మొత్తం మూడునెలల్లో భోజనం చేయని విద్యార్ధుల సంఖ్య–81,528
..........................................................................................
బిల్లులు అందక అవస్ధలు:
జిల్లా వ్యాప్తంగా మ«ధ్యాహ్నాం భోజన పధకం అమలుకి నెలకి రూ.3.51 కోట్లు ఖర్చువుతుంది.ఈ విద్యాసంవత్సరం మొదటి త్రై మాసికానికి (ఆగష్టు వరకు) రూ.11,40,66,000 నిధులు విడుదలయ్యాయి. సెప్టెంబర్ నెలకి ఇప్పటి వరకు బిల్లులు అందలేదు. అక్టోబర్ నెల అప్పుడే పక్షం రోజులు గడిచింది.ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జూన్ నెలలో మిగిలిన బడ్జెట్ గత విద్యా సంవత్సరంలో మిలిగిన సోమ్ములతో సెప్టెంబర్ నెల బిల్లులకు సర్ధుబాటు చేస్తున్నామన్నారు.నెల వారీగా బిల్లులు అందకపోవడం ఏజన్సీ నిర్వాహాక మహిళలు ఆర్ధికంగా తీవ్ర ఒడిదుడులు ఎదుర్కోంటున్నారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి వరకు సుమారు రూ.5కోట్లు మేరకు మధ్యాహ్నాం భోజన పధకం బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.ఈనెల 20 వ తేదీ దాటిన తర్వత కొంత మేరకు బకాయిలు సర్ధుబాటు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబతున్నారు.బిల్లులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,545 నిర్వాహాక ఏజన్సీ మహిళలకు గౌరవ వేతనం సైతం అందలేదు.
Advertisement
Advertisement