middle seats
-
విమానయాన సంస్థలకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ , లాక్డౌన్ కాలంలో సంక్షోభంలో పడిన దేశీయ విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది. కరోనా కట్టడి, సోషల్ డిస్టెన్సింగ్ కోసం విమాన ప్రయాణాల్లో విధించిన మధ్యసీటు ఖాళీ నిబంధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన సుప్రీం మధ్య సీటు ఖాళీగా ఉంచాల్సిన అవసరం లేదని శుక్రవారం స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన ఎయిరిండియా పైలట్ దేవెన్ కానన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ భూషణ్ గవైలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అభ్యర్ధనను తిరస్కరించింది. తద్వారా ఎయిరిండియాతో పాటు ఇతర దేశీయ విమానయాన సంస్థలకు మధ్య సీటును భర్తి చేసుకునేందుకు అనుమతించింది. (అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు) దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన ప్రయాణాలు రెండు నెలల తర్వాత మే 25న సేవలను తిరిగి ప్రారంభించాయి. అయితే ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పౌర విమానయాన శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా విమాన ప్రయాణంలో ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకే ప్రమాదం లేకుండా మిడిల్ సీటును ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించిన సంగతి తెలిసిందే. -
విమానాల్లో ఆ సీట్లు ఖాళీగా ఉంచండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం విమానయానంపై కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు నడుస్తున్న అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీట్లను తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. వాణిజ్య విమానయాన సంస్థల కన్నా పౌరుల ఆరోగ్యం గురిచి ప్రభుత్వాలు ఆందోళన చెందితే బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మే 7న ప్రారంభమైన వందే భారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఎయిర్ ఇండియా వెనక్కి రప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మధ్య సీట్లను భర్తీ చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బహిరంగ ప్రదేశాల్లో ఆరు అడుగుల దూరం పాటించాలంటున్నారు. మరి విమానం లోపల ఏం చేస్తున్నారు?' అని ప్రశ్నించారు. (ఆ కుటుంబానికి రూ.7.64 కోట్లివ్వండి) దీనిపై కేంద్రం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. సీట్లు వదిలేయడం కాన్నా టెస్టింగ్, క్వారంటైన్ అత్యుత్తమ విధానాలని, నిపుణుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు వివరించారు. ఆయన వ్యాఖ్యలతో విభేదించిన కోర్టు విమాన ప్రయాణికులకు వైరస్ సోకదని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది. జూన్ 6 వరకు బుకింగ్స్ జరిగాయని తుషార్ పేర్కొనగా.. ఆ తర్వాతి నుంచి మధ్య సీట్లు బుకింగ్ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. కావాలనుకుంటే దేశీయ విమానాల్లోనూ ఈ సమస్య గురిచి హైకోర్టులు జూన్ 2న విచారించవచ్చని న్యాయస్థానం సూచించింది. కాగా నేటి నుంచి దేశీయ విమానయానం పునఃప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సర్వీసులను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున అవి మరింత విజృంభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి. (నేటి నుంచి టేకాఫ్..) -
మధ్య సీట్లే అనుకూలం!
వాటి బుకింగే బంగారం స్మగ్లింగ్‌కు అనువు నిఘా ముమ్మరం చేసిన కస్టమ్స్ అధికారులు సాక్షి, హైదరాబాద్: దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నానికి బంగారం అక్రమ రవాణా చేస్తూ బుధవారం చిక్కిన అబ్దుల్ కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానంలో ఉండే ‘మధ్య సీట్లే’ స్మగ్లర్లకు అనుకూలమని అధికారుల విచారణలో వెల్లడైంది. ఎయిర్‌లైన్స్ టిక్కెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సమయంలో కల్పిస్తున్న సౌకర్యం స్మగ్లర్లకు కలిసి వస్తోందని అధికారులు గుర్తించారు. బుధవారం చెన్నైకి చెందిన అబ్దుల్ 2.4 కేజీల బంగారంతో దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా (ఏఐ 952) విమానంలో హైదరాబాద్ వచ్చా డు. బంగారం ఉన్న బ్యాగ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమా నం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. నేరుగా డిపాచర్ లాంజ్‌కు వెళ్లి అదే విమానంలో విశాఖపట్టణం వెళ్లిపోవడానికి ముందే బుక్ చేసుకున్న టికెట్ ఆధారంగా దేశవాళీ ప్రయాణికుడిగా ఎక్కి అంతకు ముందు కూర్చున్న సీటులోనే కూర్చున్నాడు. ఈలోపు శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అప్రమతత్తతో చిక్కాడు. ఈ కేసును కస్టమ్స్ పలు కోణాల్లో దర్యాప్తు జరిపింది. అంతర్జాతీయ ప్రయాణికుడిగా వచ్చిన ఇతడికి విమానం దేశవాళీ సర్వీసుగా మారిన తరవాత మళ్లీ అదే సీటు ఎలా దొరికిందనే అంశంపై లోతుగా ఆరా తీసింది. ఎయిర్ ఇండియా సంస్థ విమాన టికెట్లను ప్రయాణికుడు ఆన్లైన్లో బుక్ చేసుకునేప్పుడు తమకు అనువైన సీటును ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీన్నే అబ్దుల్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖపట్టణాలకు ఇతడు నిర్ణీత సమయం ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకుంటూ... 2 సర్వీసుల్లోనూ ఒకే సీటును ఎంచుకున్నాడు. మధ్యలో ఉండే సీట్లనే ఎంచుకుని ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేయాలని భావించి చిక్కాడు. ఇదే విధంగా మరికొందరు స్మగ్లర్స్ ఈ తరహాలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న కస్టమ్స్ అధికారులు ‘ఎస్కార్ట్స్ ఆఫీసర్స్’ సంఖ్యను పెంచి నిఘా ముమ్మరం చేశారు.