ఉపాధి పనుల్లో రూ.45,451 అవినీతి
నర్సింహులపేట : మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీల్లో రూ.45,451 అవినీతి జరిగినట్లు వెల్లడైంది. దీంతో డ్వామా ములుగు ఏపీడీ టి.రాజారావు త్వరితగతిన ఈ నిధుల రికవరీకి ఆదేశిం చారు. కాగా, శనివారం అర్థరాత్రి వరకు జరిగిన ఉపాధి హామీ బహిరంగ ప్రజావేదికలో ఈ విష యం వెల్లడైంది. ప్రధానంగా ఆగాపేట, ముంగి మడుగు, పెద్దముప్పారం, రామన్నగూడెం, దాట్ల గ్రామాల్లో పనుల అవకతవకలపై రభస జరిగింది. 21 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు రూ. 24,756, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు రూ.1400, నలుగురు టీఏలు రూ.19,295 స్వాహా చేసినట్లు సామాజిక తనిఖీలో బయటపడింది.కార్యక్రమంలో ఎంపీపీ సంపెట సుజాత, జెడ్పీటీసీ సభ్యుడు వేణు, విజిలెన్స్ అధికారి సత్యనారాయణ, ఎంపీడీఓ ఉపేందర్, ఎస్ఆర్పీ రాఘవులు పాల్గొన్నారు.