'మా ఆయనను చూపించడం నాకు చాలా ఇష్టం'
లండన్: తన భర్తను బయటి ప్రపంచానికి చూపించడం అంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ హాలీవుడ్ సింగర్ క్యారీ అండర్ వుడ్ చెప్పింది. అందుకే తాను బహిరంగంగా జరిగే కార్యక్రమాలకు తనను తీసుకెళ్తుంటానని వెల్లడించింది.
ఈ నెల 8న టెన్నిస్సేలోని నేష్ విల్లీలో జరిగిన సీఎంటీ అవార్డుల కార్యక్రమంలో పింక్ కార్పేట్పై హొయలు వలికిస్తూ తన భర్త, హాకీ ప్లేయర్ మైక్ ఫిషర్ తో కలిసి నడిచిన ఆమె తన భర్త అంటే ఎంత ఇష్టమో చెప్పారు. హాకీ ప్లేయర్ అయిన తన భర్త మైక్ ఫిషర్ తనతో కలిసి ఫంక్షన్లకు హాజరుకావడం చాలా అరుదు అని, అందుకే తాను సమయం చిక్కినప్పుడల్లా తనను వెంటపెట్టుకొని తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంటానని చెప్పింది. అతడితో ఉండే ఏ సందర్భం అయినా తనకు చాలా ఇష్టమని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.