Military Families
-
మాజీ సైనికోద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్ : మాజీ సైనికులు, వారి కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో మాజీ సైనికోద్యోగుల సంక్షేమంపై కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సైనికులకు వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసే మాజీ సైనికులకు డబుల్ పెన్షన్, ఒకవేళ మాజీ సైనికోద్యోగి మరణిస్తే అతడి భార్యకు కూడా పెన్షన్ వర్తింపచేస్తామని కేసీఆర్ తెలిపారు. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న బోర్డులతో పాటు నూతనంగా ఏర్పాటైన 21 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా ఇక్కడి మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సైనిక కుటుంబాల సంక్షేమానికి చర్యలు
సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సైనిక కుటుం బాల సంక్షేమానికి మరి న్ని చర్యలు తీసుకుంటా మని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. వీర సైనిక కుటుంబాలకు ఇచ్చే నెల వారి పింఛను పెంచడంతో పాటు రాష్ట్రానికి చెందిన సైనికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ప్రగతి భవన్లో సీఎంను దక్షిణ భారత సైనిక బ్రిగేడియర్ జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ ఆర్కే ఆనంద్, కల్నల్ అతుల్ రాజ్పుట్ కలిశారు. సైనిక సంక్షేమనిధికి కొన్ని ఎన్జీవోలు విరాళం ఇస్తున్నాయని, ఇకపై ముఖ్యమంత్రి నుంచి, అన్ని స్థాయిల ఉద్యోగులు విరాళం ఇచ్చే విధానాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా సీఎం వారికి హామీనిచ్చారు.