మాజీ సైనికోద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు
Published Sat, Dec 24 2016 8:37 PM | Last Updated on Sat, Aug 11 2018 7:06 PM
హైదరాబాద్ : మాజీ సైనికులు, వారి కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో మాజీ సైనికోద్యోగుల సంక్షేమంపై కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సైనికులకు వరాల జల్లు కురిపించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసే మాజీ సైనికులకు డబుల్ పెన్షన్, ఒకవేళ మాజీ సైనికోద్యోగి మరణిస్తే అతడి భార్యకు కూడా పెన్షన్ వర్తింపచేస్తామని కేసీఆర్ తెలిపారు. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న బోర్డులతో పాటు నూతనంగా ఏర్పాటైన 21 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా ఇక్కడి మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement