the Milky Way
-
సూపర్ సెల్ఫీ..
ప్రస్తుతమంతా సెల్ఫీల రాజ్యం. రకరకాల సెల్ఫీలు మనం చూస్తున్నాం.. అయితే.. అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ షేన్ బ్లాక్ తీసుకున్న సెల్ఫీ ముందు ఇవన్నీ దిగదుడుపే.. ఎందుకంటే.. కుడివైపు చంద్రుడు.. ఎడమవైపు అగ్నిపర్వతం.. ఆకాశంలో పాలపుంత.. వీటన్నిటి ముందు నిల్చుని.. ఇతడు ఈ సూపర్ సెల్ఫీని తీయించుకున్నాడు. హవాయి దీవుల్లో 13,800 అడుగుల ఎత్తుండే మౌనా కియా శిఖరాగ్రంపైన నిల్చుని ఇతడీ సెల్ఫీని తీసుకున్నాడు. మొత్తం 23 వేర్వేరు ఫ్రేమ్‌లను కూర్చి.. ఈ ఫొటోను సృష్టించాడు. కెమెరాను రిమోట్‌తో ఆపరేట్ చేశాడు. -
పాలపుంతలో ఏం జరుగుతోంది?
మన పాలపుంత గెలాక్సీ కేంద్రంలోని ధనూరాశి ప్రాంతంలో ఉన్న అతిపెద్ద కృష్ణబిలం(బ్లాక్‌హోల్) నుంచి ఇంతకుముందెన్నడూ చూడనంతటి స్థాయిలో భారీ ఎక్స్-రే విస్ఫోటం వెలువడిందట. చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ ద్వారా నాసా శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. కొన్నేళ్లుగా మామూలుగా ఉన్న ఎక్స్-రే ప్రకాశం ఒక్కసారిగా భారీ జ్వాలలా మారడం అనేది ఈ కృష్ణబిలం ప్రవర్తన, పరిసరాలపై కొత్త ప్రశ్నల్ని రేకెత్తిస్తోందని చెబుతున్నారు. మన సూర్యుడి కన్నా 45 లక్షల రెట్లు పెద్దగా ఉన్న ఈ బ్లాక్‌హోల్ తన సమీపంలోని ఓ ధూళిమేఘాన్ని మింగేసేటప్పుడు ఎంత వెలుతురు వెలువడుతుందన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టగా.. ఆ ప్రక్రియతో వెలుతురు వెలువడకపోగా ఇలా అనూహ్యంగా అప్పటికే ఉన్న ఎక్స్-రే ప్రకాశం 400 రెట్లు అధికంగా వెలిగిపోయిందట. ధూళి మేఘాలు కాకుండా ఏదైనా పెద్ద గ్రహశకలం బ్లాక్‌హోల్‌ను సమీపించడంతో ఇలాంటి విస్ఫోటం జరిగి ఉంటుందని కొందరు.. బ్లాక్‌హోల్‌లోకి వెళుతున్న వాయువులు కలగాపులగమై దిశలను మార్చుకోవడం వల్ల జరిగి ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.