సూపర్ సెల్ఫీ..
ప్రస్తుతమంతా సెల్ఫీల రాజ్యం. రకరకాల సెల్ఫీలు మనం చూస్తున్నాం.. అయితే.. అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ షేన్ బ్లాక్ తీసుకున్న సెల్ఫీ ముందు ఇవన్నీ దిగదుడుపే.. ఎందుకంటే.. కుడివైపు చంద్రుడు.. ఎడమవైపు అగ్నిపర్వతం.. ఆకాశంలో పాలపుంత.. వీటన్నిటి ముందు నిల్చుని.. ఇతడు ఈ సూపర్ సెల్ఫీని తీయించుకున్నాడు. హవాయి దీవుల్లో 13,800 అడుగుల ఎత్తుండే మౌనా కియా శిఖరాగ్రంపైన నిల్చుని ఇతడీ సెల్ఫీని తీసుకున్నాడు. మొత్తం 23 వేర్వేరు ఫ్రేమ్‌లను కూర్చి.. ఈ ఫొటోను సృష్టించాడు. కెమెరాను రిమోట్‌తో ఆపరేట్ చేశాడు.