Million worth
-
3.8 బిలియన్ డాలర్ల వస్తువులు కొట్టేసి..
మనిషికి డబ్బు ఆశ ఉండడం సహజం. అది ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో బయటికి వస్తుంది. కొందరు కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటే.. మరికొంతమంది అడ్డదారుల్లో సంపాదించాలని చూస్తారు. దీంట్లో కొంతమంది సక్సెస్ చూస్తారు.. ఓటములు చూస్తారు. కానీ అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 63 ఏళ్ల కిమ్ రిచర్డ్సన్ మాత్రం 19 ఏళ్లుగా సక్సెస్‌ను మాత్రమే చూస్తు వచ్చింది. ఆమె కేవలం కొట్టేసిన వస్తువులను ఆన్లైన్లో అమ్మేయడం ద్వారా కోట్లను కొల్లగొట్టింది. ఇంతకీ ఆమె కొట్టేసిన వస్తువుల విలువ ఎంతో తెలుసా.. అక్షరాల 3.8 బిలియన్ డాలర్లు. (చదవండి : వామ్మో ! పొడవంటే పొడువు కాదు..) ఇక అసలు విషయంలోకి వెళితే.. కిమ్ రిచర్డ్సన్ తనకు కావాల్సిన వస్తువులను కొట్టేయడంలో ఆరితేరిన వ్యక్తి. ఒకషాపులోకి వెళ్లిందంటే ఎదుట ఎలాంటి సీసీ కెమెరాలు ఉన్నా వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకొని తనకు కావాల్సిన వస్తువులను కొట్టేసేది. 44 ఏళ్ల వయసులో దొంగతనాలు చేయడం ప్రారంభించిన రిచర్డ్సన్ 2000 ఆగష్టు నుంచి 2019 వరకు 19 ఏళ్లపాటు అమెరికాలోని అనేక స్టోర్స్ లోని వస్తువులను కొట్టేసింది. ఒకటి,రెండు సంవత్సరాలు కాదు.. ఏకంగా 19 ఏళ్లలో 3.8 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొట్టేసింది. అలా కొట్టేసిన వస్తువులను ఈబేలో అమ్మకానికి పెట్టి దానికి రెట్టింపు సంపాదించేది. (చదవండి : అక్కడ 36 వేల మందికి ప్రాణాపాయం!) అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. ఇటీవలే రిచర్డ్సన్ చేసిన దొంగతనాలను పోలీసులు పసిగట్టారు. పెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వస్టిగేషన్తో రిచర్డ్సన్పై సీక్రెట్‌గా విచారణ చేయించగా ఆమె చేసిన పనులు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. కాగా రిచర్డ్సన్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిచర్డ్సన్కు 54 నెలల పాటు జైలు శిక్ష విధించడంతో పాటు 3.8 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.27 కోట్ల ) జరిమానా వేసింది. -
బాలిక గర్భం విలువ రూ.4 లక్షలు?
గ్రామ పెద్దల సమక్షంలో రాజీ చోడవరం టౌన్: ఒక బాలిక గర్భం తీయించుకోడానికి గ్రామ పెద్దలు రూ. 4 లక్షలు విలువ కట్టిన సంఘటన మండలంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని బీసీ కులానికి చెందిన బాలిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమెతో అదే గ్రామానికి చెందిన ఓసీ కులానికి చెందిన తాపీ మేస్త్రీ కొంత కాలంగా ప్రేమ వ్యవహారం సాగించి ఆమె గర్భం దాల్చేందుకు కారకుడయ్యాడు. తాపీ మేస్త్రీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలిక నెల రోజులుగా పాఠశాలకు వెళ్లక పోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి బాధిత బాలికకు రూ. 3 లక్షలు, గ్రామానికి రూ.50 వేలు, ఇతర అన్ని శాఖలకు రూ.25వేలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. బాలికకు శనివారం మాడుగులలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిల్లో గర్భం కూడా తీయించినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.