గ్రామ పెద్దల సమక్షంలో రాజీ
చోడవరం టౌన్: ఒక బాలిక గర్భం తీయించుకోడానికి గ్రామ పెద్దలు రూ. 4 లక్షలు విలువ కట్టిన సంఘటన మండలంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని బీసీ కులానికి చెందిన బాలిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమెతో అదే గ్రామానికి చెందిన ఓసీ కులానికి చెందిన తాపీ మేస్త్రీ కొంత కాలంగా ప్రేమ వ్యవహారం సాగించి ఆమె గర్భం దాల్చేందుకు కారకుడయ్యాడు.
తాపీ మేస్త్రీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలిక నెల రోజులుగా పాఠశాలకు వెళ్లక పోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి బాధిత బాలికకు రూ. 3 లక్షలు, గ్రామానికి రూ.50 వేలు, ఇతర అన్ని శాఖలకు రూ.25వేలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. బాలికకు శనివారం మాడుగులలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిల్లో గర్భం కూడా తీయించినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.
బాలిక గర్భం విలువ రూ.4 లక్షలు?
Published Mon, Aug 10 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM
Advertisement
Advertisement