Girl pregnancy
-
30 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు అనుమతి
ముంబై: పదకొండేళ్ల రేప్ బాధితురాలు తన 30 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. 11 ఏళ్ల చిన్నారి అబార్షన్‌కు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉందని వైద్య నిపుణుల బృందం చెప్పడాన్ని పరిగణలోకి తీసుకొని 30 వారాల గర్భవిచ్ఛిత్తికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా చిన్నారి పొత్తికడుపు గట్టిపడిందని భావించామని, థానే ఆసుపత్రిలోనూ డాక్టర్లు అలాగే భావించి మందులు రాసిచ్చారని తండ్రి కోర్టుకు తెలిపారు. అయినా బాలిక పరిస్థితిలో మార్పేమీ రాకపోవడంతో అక్టోబరు 24న ముంబై ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ బాలిక గర్భం దాల్చిందనే విషయాన్ని డాక్టర్లు ధ్రువీకరించారని ఆమె తండ్రి కోర్టుకు విన్నవించారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోర్టును కోరడంతో 30 వారాల గర్భాన్ని తొలగించడానికి అనుమతిస్తూ జస్టిస్ షర్మిల దేశ్‌ముఖ్, జస్టిస్ జితేంద్ర జైన్ల ధర్మాసనం తీర్పునిచ్చింది. -
గురుకుల పాఠశాల విద్యార్థినికి గర్భం.. ఆలస్యంగా వెలుగులోకి
ప్రకాశం, పుల్లలచెరువు: పుల్లలచెరువు మండలంలోని గారపెంట గిరిజన గూడెంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి బాలిక గర్భం దాల్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఉలిక్కిపడ్డ ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బాలికకు గర్భం వచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయగా బుధవారం వై పాలెంలోని సహాయ గిరిజన సంక్షేమాధికారి దస్తగిరి సదరు బాలిక తల్లిదండ్రులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి తల్లిదండ్రులు, గూడెం పెద్దలను పిలిపించి పాఠశాల సిబ్బంది సమక్షంలో సుదీర్ఘ విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థినికి ఇదే గూడెంకు చెందిన యాకసిరి చిరంజీవి అనే యువకుడితో కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తమ విచారణలో తెలసిందన్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా బాలిక పాఠశాలకు రాకపోవడంతో సిబ్బంది ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి కారణాలు అడిగారు. తమ కుమార్తె గర్భం దాల్సిన విషయం తెలిసిందని, దానిపై తమ కుల పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిందందని తల్లిదండ్రులు చెప్పారన్నారు. మైనారిటీ తీరగానే కట్టుబాట్లు ప్రకారం వివాహం జరిగేలా కులపెద్దల పంచాయతీ చేశారని చెప్తున్నారు. ఈ విషయంలో పాఠశాల సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదని, మా బిడ్డను పదో తరగతి పరీక్షల కోసమే పాఠశాలకు పంపుతున్నట్లుగా తల్లిదండ్రులు చెప్పినట్లు దస్తగిరి తెలిపారు. గూడెం పెద్దలు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఇచ్చిన పూర్తి విచారణ నివేదికల వివరాలను జిల్లా అధికారులకు తెలియచేసి, వారి ఆదేశాలను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆజాగ్రత్తగా ఉండే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరగా 2016లో జరిగిన ఘటన తర్వాత పాఠశాలలో రాత్రివేళ బాలికలు ఎవరినీ ఉండనీయకుండా తల్లిదండ్రుల అనుమతితో ఇంటికి పంపిస్తున్నామన్నారు. ఈ విషయం అధికారులకు కూడా తెలిపినట్లుగా చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, సిబ్బంది వెళ్లి గూడెంలోని పాఠశాల సిబ్బందిని, బాలిక, యువకుడి తల్లిదండ్రులను విచారించి నివేదికను అధికారులకు తెలియచేస్తామన్నారు. -
బాలిక గర్భం విలువ రూ.4 లక్షలు?
గ్రామ పెద్దల సమక్షంలో రాజీ చోడవరం టౌన్: ఒక బాలిక గర్భం తీయించుకోడానికి గ్రామ పెద్దలు రూ. 4 లక్షలు విలువ కట్టిన సంఘటన మండలంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని బీసీ కులానికి చెందిన బాలిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమెతో అదే గ్రామానికి చెందిన ఓసీ కులానికి చెందిన తాపీ మేస్త్రీ కొంత కాలంగా ప్రేమ వ్యవహారం సాగించి ఆమె గర్భం దాల్చేందుకు కారకుడయ్యాడు. తాపీ మేస్త్రీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలిక నెల రోజులుగా పాఠశాలకు వెళ్లక పోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి బాధిత బాలికకు రూ. 3 లక్షలు, గ్రామానికి రూ.50 వేలు, ఇతర అన్ని శాఖలకు రూ.25వేలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. బాలికకు శనివారం మాడుగులలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిల్లో గర్భం కూడా తీయించినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
సోదరిని గ ర్భవతి చేసిన అన్న అరెస్ట్
బెంగళూరు : చెల్లెలుపై అన్న వరస అయిన వ్యక్తి అత్యాచారం చేయడంతో.. ఆ బాలిక గర్భం దాల్చిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని కనకపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు శుక్రవారం తెలిపిన సమాచారం మేరకు.. కనకపురలోని శ్రీరాంపురలో ఓ వ్యక్తి (21) నివాసముంటున్నాడు. అదే గ్రామంలో నివాసముంటున్న ఓ బాలిక (15) అతనికి చెల్లెలు వరస అవుతుంది. ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారి ఇంటికి వెళ్తూ బాలికపై అత్యాచారం చేసేవాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెందిరించేవాడు. గత కొద్ది రోజులుగా ఆ బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక గర్భవతిని అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కనకపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.