బెంగళూరు : చెల్లెలుపై అన్న వరస అయిన వ్యక్తి అత్యాచారం చేయడంతో.. ఆ బాలిక గర్భం దాల్చిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని కనకపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు శుక్రవారం తెలిపిన సమాచారం మేరకు.. కనకపురలోని శ్రీరాంపురలో ఓ వ్యక్తి (21) నివాసముంటున్నాడు. అదే గ్రామంలో నివాసముంటున్న ఓ బాలిక (15) అతనికి చెల్లెలు వరస అవుతుంది. ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారి ఇంటికి వెళ్తూ బాలికపై అత్యాచారం చేసేవాడు.
విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెందిరించేవాడు. గత కొద్ది రోజులుగా ఆ బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక గర్భవతిని అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కనకపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.
సోదరిని గ ర్భవతి చేసిన అన్న అరెస్ట్
Published Sat, Nov 22 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement