Kanakapura
-
వేసవిలో ఈ పంటతో.. శ్రమ తక్కువ! ఆదాయం ఎక్కువ!
వేసవికాలంలో దోస పంట సాగుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడించవచ్చు. పంట సాగుకు రసాయన ఎరువులు వినియోగం ఉండదు. సాగు ఖర్చులు కూడా తక్కువే. తక్కువ శ్రమతో ఈ పంటను సాగు చేయవచ్చు. కరీంనగర్, నిర్మల్ మండలంలోని కనకాపూర్ గ్రామం దోసకాయలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. గ్రామానికి చెందిన 20 నుంచి 30 మంది రైతులు ఇతర గ్రామాల రైతులకు భిన్నంగా వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే దోసకాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మిగిలిన పంటల కంటే తక్కువ సమయంలో సాగయ్యే దోస కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. రైతులు తాము పండించిన దోసకాలను స్వయంగా జాతీయ రహదారిపై కిలోకు రూ.60 నుంచి రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం ఇతర పంటల కంటే తక్కువ పెట్టుబడితో దోస పంటను సాగు చేస్తున్నామని కనకాపూర్ రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. మధ్య దళారీలు లేకపోవడంతో రైతులు పండించిన దోస కాయలను నేరుగా తమ గ్రామంలోని బస్టాండ్‌లో అమ్ముతున్నారు. ఎకరాకు ఖర్చులు పోనూ రూ.80 వేల నుంచి లక్ష వరకు లాభాలు వస్తున్నాయని రైతులు తెలిపారు. – రాజు, యువ రైతు, కనకాపూర్ సేంద్రియ ఎరువులతో సాగు దోస పంట సాగుకు ఇక్కడి రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉంటున్నారు. అధికంగా సేంద్రియ ఎరువులను పంట సాగుకు వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. మంచి ఆదాయం.. ఎకరా విస్తీర్ణంలో దోస పంట సాగు చేశా. సాగు ఖర్చులు పోనూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట. – రఘు, యువ రైతు, కనకాపూర్ ఇవి చదవండి: Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది -
రాజకీయాల కోసం కాదు: శివకుమార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 114 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటుపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ స్పందించారు. విగ్రహ ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. స్థానికులకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. కాగా శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురలోని హరొబెళలో పదెకరాల భూమి కొని అతి ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ప్రతిష్టిస్తున్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా విగ్రహానికి పునాది వేశారు. అయితే ఆ విగ్రహాన్ని శివకుమార్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం లేదని, అది సామాజిక అవసరాలకు ఉద్దేశించిందని రెవెన్యూశాఖ మంత్రి తెలిపారు. ఈ భూమిని శివకుమార్ కొనుగోలు చేయడంపై విచారణ జరపాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విమర్శలపై శివకుమార్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో క్రీస్తు విగ్రహం లేనందున హరొబెళలో ఏసుక్రీస్తు విగ్రహం కావాలని స్థానికులు నన్ను కోరారు. నేను సహాయం చేస్తానని వాగ్దానం చేశాను. ఇచ్చిన మాట ప్రకారం నేను నా పని చేశాను. ఇది రాజకీయాలకు లేదా అధికారం కోసం కాదు. జీవితంలో ఆత్మ సంతృప్తి కోసం కొన్ని పనులు చేయడానికి’ అని అన్నారు. ‘నేను గ్రామీణ నియోజకవర్గానికి చెందినవాడిని, అక్కడ ప్రజలు నాకు ప్రేమ, బలాన్ని ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను వందలాది దేవాలయాలను నిర్మించాను. మూడు ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలకు, వివిధ సంస్థలకు విరాళంగా ఇచ్చారు’ అని తెలిపారు. -
ఏడు తలల పాముపొర చుట్టూ వివాదం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కనకపుర తాలూకా మరిగౌడనదొడ్డి గ్రామంలోని ఒక పొలంలో లభించిన ఏడు తలల పాముపొర వివాదాస్పదంగా మారింది. పాముపొర గురించి రోజుకో విధమైన భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరను పరిశీలించిన సరీసృపాల నిపుణులు ఇదంతా మానవ నిర్మితమని, ఎవరో కావాలని ఇలా గిమ్మిక్ చేస్తున్నారని తేల్చి చెబుతున్నారు. గ్రామంలోని మరిగౌడ అనే వ్యక్తికి చెందిన పొలంలో సుమారు నెల రోజుల క్రితం ఈ ఏడు తలల పాముపొర లభించింది. పురాణాల్లో కూడా అక్కడక్కడా ఏడు తలల పాముల గురించి ప్రస్తావన ఉండడంతో జనం త్వరగా ఆకర్షితులై పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే అక్కడ నాగప్రతిష్ఠ కూడా చేసారు. త్వరలో దేవాలయం నిర్మించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం బీబీఎంపీకి చెందిన వన్యప్రాణుల సంరక్షకులు మోహన్, జయరాజ్, ప్రసన్న మీడియాతో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి పాముపొరను పరీక్షించారు. అనంతరం మాట్లాడిన వారు ఇది ఏడు తలలపాము పొరకాదన్నారు. ఎవరో కావాలని కొన్ని పాముల పొరలను సేకరించి ఇలా ఏడు తలల పాముగా చిత్రీకరించారన్నారు. నిజానికి ఏడు తలలపాము అవాస్తవమని, ఒకవేళ అవి పుట్టినా బతకవన్నారు. అయితే పాముపొర లభించిన భూమి యజమానిగా చెప్పుకుంటున్న మరికెంపేగౌడ మాత్రం ఈ భూమి తనదేనని, ఏడు తలల పాము తిరగడం తన కళ్లతో చూసానని వాదిస్తున్నాడు. ఏదిఏమైనా ఏడుతలల పాముపొర వివాదం ఎక్కడకు వెళ్లి ముగుస్తుందో చూడాలి. -
సోదరిని గ ర్భవతి చేసిన అన్న అరెస్ట్
బెంగళూరు : చెల్లెలుపై అన్న వరస అయిన వ్యక్తి అత్యాచారం చేయడంతో.. ఆ బాలిక గర్భం దాల్చిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని కనకపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు శుక్రవారం తెలిపిన సమాచారం మేరకు.. కనకపురలోని శ్రీరాంపురలో ఓ వ్యక్తి (21) నివాసముంటున్నాడు. అదే గ్రామంలో నివాసముంటున్న ఓ బాలిక (15) అతనికి చెల్లెలు వరస అవుతుంది. ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారి ఇంటికి వెళ్తూ బాలికపై అత్యాచారం చేసేవాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెందిరించేవాడు. గత కొద్ది రోజులుగా ఆ బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక గర్భవతిని అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కనకపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.