millions jobs
-
అమెరికాలో లక్షల ఉద్యోగాల కోత..! సీబీఓ సంచలన రిపోర్ట్
అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది నిరుద్యోగిత రేటు పెరుగుతుందని 'కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్' (CBO) రిపోర్ట్ విడుదల చేసింది. 2024లో యూఎస్ఏలో ఎంత శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది? దీనికి ప్రధాన కారణం ఏంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) డిసెంబర్ 15న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఉన్న 3.9 శాతం నిరుద్యోగిత రేటు 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని అంచనా. అంటే వచ్చే ఏడాదికి మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూడాల్సి వస్తుందని సీబీఓ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఎగుమతులు తగ్గే అవకాశం ఉందని, పెట్టుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయని, NRIల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయని సీబీఓ అంచనా వేసింది. ఈ కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 18.70 లక్షల మంది నిరుద్యోగ ప్రయోజనాలను పొందుతున్నట్లు, రానున్న రోజుల్లో 2.02 లక్షల మంది అదనంగా ఇలాంటి ప్రయోజనాలను పొందటానికి అప్లై చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం 2024లో అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు సుమారు 2.1 శాతానికి తగ్గుతుందని యూఎస్ కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఫెడ్ లక్ష్యం కూడా 2 శాతానికి చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగానే 2024లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే.. ఆర్ధిక వ్యవస్థ పెద్దగా దెబ్బతినే అవకాశం లేదని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజా నిజాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి. -
టెలికాం రంగంలో 20 మిలియన్ల ఉద్యోగాలు
గచ్చిబౌలి, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో 2025 నాటికల్లా 20 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని టీఎస్ఎస్సీ (టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్) సీఈఓ లెఫ్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఎస్కీ(ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)లో ‘ఓకేషనల్ స్కిల్ ట్రైనింగ్ విత్ ఇండస్ట్రీ కనెక్ట్’ శిక్షణ కార్యక్రమంపై ఎస్కీ, టీఎస్ఎస్సీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా కొచర్ మాట్లాడుతూ టెలికాం రంగంలో రూ.80 కోట్ల వ్యయంతో 80 వేల మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. ఎస్కీ డెరైక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 10వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీయువకులకు ఉచితంగా శిక్షణ, మెటీరియల్ అందజేస్తామన్నారు. శిక్షణ అనంతరం నైపుణ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ ధర్మరాజ్, టాటా టెలీ సర్వీసెస్ సీఓఓ రామకృష్ణ, జియోస్టార్ట్ మేనేజింగ్ పార్టనర్ వివేక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.