అమెరికాలో లక్షల ఉద్యోగాల కోత..! సీబీఓ సంచలన రిపోర్ట్ | Millions Of Americans Will Lose Their Job In 2024: CBO Report - Sakshi
Sakshi News home page

అమెరికాలో లక్షల ఉద్యోగాల కోత..! సీబీఓ సంచలన రిపోర్ట్

Published Sun, Dec 17 2023 8:51 PM | Last Updated on Sun, Dec 17 2023 9:32 PM

Millions Of Americans Lose Their Jobs 2024 - Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది నిరుద్యోగిత రేటు పెరుగుతుందని 'కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్' (CBO) రిపోర్ట్ విడుదల చేసింది. 2024లో యూఎస్ఏలో ఎంత శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది? దీనికి ప్రధాన కారణం ఏంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) డిసెంబర్ 15న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఉన్న 3.9 శాతం నిరుద్యోగిత రేటు 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని అంచనా. అంటే వచ్చే ఏడాదికి మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

వచ్చే సంవత్సరం అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూడాల్సి వస్తుందని సీబీఓ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఎగుమతులు తగ్గే అవకాశం ఉందని, పెట్టుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయని, NRIల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయని సీబీఓ అంచనా వేసింది. ఈ కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 18.70 లక్షల మంది నిరుద్యోగ ప్రయోజనాలను పొందుతున్నట్లు, రానున్న రోజుల్లో 2.02 లక్షల మంది అదనంగా ఇలాంటి ప్రయోజనాలను పొందటానికి అప్లై చేసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్‌ చరిత్రలో గూగుల్‌ శకం

2024లో అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు సుమారు 2.1 శాతానికి తగ్గుతుందని యూఎస్ కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఫెడ్ లక్ష్యం కూడా 2 శాతానికి చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగానే 2024లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే.. ఆర్ధిక వ్యవస్థ పెద్దగా దెబ్బతినే అవకాశం లేదని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజా నిజాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement