Mind Blank
-
ఇవి చదవడంతో మీకు ఏం జరుగుతుందో తెలుసా..!
వార్తలు వినడం, చదవడం, చూడడం ద్వారా మనచుట్టూ ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందే. సామాజిక, రాజకీయ, మానవీయ కథనాల ద్వారా ప్రపంచంతో సంబంధం కలిగి ఉండాలి కూడా. అయితే మానవీయ కథనాలకంటే మనసును గాయపరిచే కథనాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మంచికంటే చెడు ఎక్కువగా ఉంటుంది. అలాంటి సంఘటనలను ఒక వార్తగా తెలుసుకోవడం వరకే పరిమితం చేయాలి. నేరకథనాలను చూసేటప్పుడు మనసు ఉద్వేగానికి లోనవుతుంది, ఆ మేరకు దేహంలో రక్తప్రసరణ వేగం పెరగడం, హార్మోన్లు ప్రభావితం కావడం వంటి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రైమ్ వార్తల ఆధారంగా అల్లుతున్న సుదీర్థ కథనాలకు మన రోజులో ఎక్కువగా చోటివ్వకూడదని చెప్తున్నారు యూఎస్ ఆధారిత మేయో క్లినిక్ హెల్త్ సిస్టమ్ ప్రతినిధులు. పిల్లలు, వయసు మీరినవాళ్లు ఇంట్లో ఉన్న సమయంలో క్రైమ్ థిల్లర్ సినిమాలను పెట్టకూడదు. వీటివల్ల పిల్లలు తరచూ మానసిక ఆందోళనలకు లోనవుతుంటారు. పెద్దవాళ్లలో గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. ఇలా రోజూ జరుగుతుంటే ఈ పరిస్థితి గుండె సమస్యలకు దారి తీస్తుంది. అందుకే లైఫ్ వెల్‌బీయింగ్‌కి క్రైమ్ స్టోరీలకు దూరంగా ఉండడం కూడా ప్రధానమే. ఇవి చదవండి: మీకు తెలుసా..! మీ ఆరోగ్యం మీ ఆలోచనలతోనేనని.. -
తెలంగాణలో కరువు, కర్ఫ్యూ లేదు
హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా): బీఆర్ఎస్ పాలనలో కరువు, కర్ఫ్యూ అనే మాటే ఎప్పుడూ రాలేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకప్పుడు తిండిలేని తెలంగాణ ఈరోజు దక్షిణాది ధాన్య భాండాగారంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న బీఆర్ఎస్ మేనిఫేస్టోను అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారని, ఆ మేనిఫేస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. నవంబర్ 3న నోటిఫికేషన్, నవంబర్ 30న పోలింగ్, డిశంబర్ 3న ఫలితాలు కలిసోచ్చే 3 అనే సంఖ్య రావడంతో బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 3వ సారి గెలిచి హ్యా ట్రిక్ సాధించడం ఖాయమన్నారు. అవినీతి సొమ్ముతో కాంగ్రెస్... మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మత కల్లోలాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ... మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటోందని మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు, గ్లోబల్ ప్రచారాలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. కర్ణాటకలో సంపాదించిన అవినీతి సొమ్ముతో తెలంగాణలో గెలవాలని ఆ పార్టీ చూ స్తోందని దుయ్యబట్టారు. ముఠా రాజకీయాలతో ఢిల్లీలో టికెట్ల పంచాయితీ చేస్తోందని మండిపడ్డారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)తో పొత్తు పొట్టుకొని అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని, పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని చూసిందని ఆరోపించారు. మూడు గంటల కరెంట్ రైతులకు చాలన్న కాంగ్రెస్ మంచిదా, రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్న బీజేపీ మంచిదా, మూడు పంటలకు సరిపడా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ మంచోడా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తే అందరూ సంతోషిస్తారని, కానీ ప్రతిపక్షాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ తదితరులు ఉన్నారు. హుస్నాబాద్‌లో కేసీఆర్‌కు తొలి ‘ఆశీర్వాదం’ హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రజలపై ఉన్న నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావానికి మరోసారి హుస్నాబాద్ వేదిక కాబోతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 15న నిర్వహించే కేసీఆర్ ఎన్నికల శంఖారావ బహిరంగ సభ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌లతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌కు ఈశాన్యంలో ఉండే హుస్నాబాద్‌ను కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేశారని పేర్కొన్నారు. -
ఊహించని ట్విస్ట్‌తో మైండ్‌బ్లాక్ ఖాయం
ఒక్క క్షణం తర్వాత ఏం జరగబోతుందనేది ఎవరైనా ఊహించగలరా.. సరదాగా ఒక పామును ఆటపట్టిద్దామనుకున్న వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైతే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు గాని.. వీడియో చివర్లో మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. (చదవండి : వైరల్ ఫొటో: అమ్మకు సలాం!) ఇక వీడియో విషయానికి వస్తే.. ఒక వ్యక్తి కొలనులో ఒక పామును చూస్తాడు. ఆ పాము అతన్ని చూసి నీటిలోకి జారుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ఆ పామును నీటి నుంచి బయటికి తీస్తాడు. దానితో అది బుసలు కొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇలా సరదాగా ఆ పాముతో కలిసి వ్యక్తి ఆటలాడుతుంటాడు. సరిగ్గా అప్పుడే ఒక ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని ఒక పెద్ద కొండచిలువ పైనుంచి ఆ వ్యక్తి మీదకు వేగంగా దూసుకువస్తుంది. అంతే ! మైండ్ బ్లాక్ అయిన ఆ వ్యక్తి చేతిలో ఉన్న పామును వదిలేసి నీటిలోకి పడిపోతాడు. ఆ వెంటే కొండచిలువతో పాటు మరొక పాము కూడా నీటిలోకి వెళ్లిపోతాయి. ఈ థ్రిల్లింగ్ సీన్లో ఇంతకు ఆ వ్యక్తి బయటపడ్డాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇది పాత వీడియోనే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. WTF is going on here pic.twitter.com/bWy1ro8833 — The Unexplained (@Unexplained) September 24, 2020 -
‘సర్వే ఫలితాలతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో భారీగా పెరిగిన ఆదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. సర్వేలలో టీఆర్ఎస్ పాలనకు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు