టూరిస్టు బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు
గీసుకొండ(వరంగల్): వరంగల్-నర్సంపేట రహదారిపై గంగదేవిపల్లి గ్రామ సమీపంలో బుధవారం బెంగళూరు వాసులు ప్రయాణిస్తున్న మినీ టూరిస్ట్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గీసుకొండ ఎస్ఐ అంజన్‌రావు కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన 16 మంది టూరిస్ట్ బస్సులో భద్రాచలం వెళ్లి వస్తున్నారు. గంగదేవిపల్లి సమీపంలోకి రాగానే వెనుక టైర్ పగిలి అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బెంగుళూరు యాలంక ప్రాంతానికి చెందిన వెరుముడి తులశమ్మ, జానకమ్మ, మమత, రష్మి, సుబ్రహ్మణి, డ్రైవర్ జాఫర్ అలీతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గీసుకొండ ఎస్ఐలు అంజన్‌రావు, నవీన్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.