Minister jagadisreddy
-
సచివాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే ఎత్తయిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని జయంతి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇందుకు ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ వెనుకనున్న 36 ఎకరాల స్థలాన్ని పరిశీలించించింది. అందులోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం బుద్ధపూర్ణిమ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 14న కేసీఆర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులకు ఉత్సవ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ భవన్ స్థానంలో అంబేడ్కర్ టవర్ నిర్మాణాలకూ అదే రోజున శంకుస్థాపన చేయించాలని తీర్మానించారు. అలాగే బోరబండ వద్ద నిర్మించతలపెట్టిన దళిత్ స్డడీస్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం అదే రోజు సాయంత్రం బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి జగదీష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి వెల్లడించారు. ఘనంగా జయంతి ఉత్సవాలు అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలను ఏడాది పొడవునా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి చందూలాల్‌తో పాటు టీఎస్పీఎస్సీసీ చైర్మన్ గంటా చక్రపాణి, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆనాడు అడగలేదేం..
♦ఎస్సారెస్పీ కాలువను పొడిగిస్తే ఎందుకు ఊరుకున్నారు... ♦ ఎక్కడా లేని విధంగా ఎస్సెల్బీసీ టన్నెల్ రూపొందిస్తే మాట్లాడలేదేం.. ♦ అప్పులు తెచ్చిన పార్టీల్లోనే మీరు పనిచేయలేదా.. ♦ జానా, ఉత్తమ్, సుఖేందర్, కోమటిరెడ్డి అప్పుడేం చేశారు.. ♦ కాంగ్రెస్ దిగ్గజాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సాగునీటి ప్రాజెక్ట్‌లపై అసెంబ్లీలో సీఎం ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ వినకుండా.. దొంగల్లా పారిపోయిన కాంగ్రెస్ నేతలు చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారని, 30 ఏళ్ల పాటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన ఘనత కలిగిన ఈ నేతలు సమైక్య రాష్ట్రంలో నల్లగొండ జిల్లాకు జరిగిన అన్యా యం గురించి ఎందుకు మాట్లాడలేదని రాష్ట్ర మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నాడు పదవుల కోసం, బీ ఫారాల కోసం పెద్ద బానిసలుగా పనిచేసిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు కేసీఆర్ స్పష్టమైన అవగాహనతో తెలంగాణను బాగు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డితో కలిసి మాట్లాడారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలపై ఫైర్ అయ్యారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాడు నల్లగొండకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. సీఎం అసెంబ్లీలో చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై జిల్లా కాంగ్రెస్ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారని, అసలు వారు మాట్లాడేది వాళ్లకు అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. తామేమీ అసెంబ్లీలో వారి నోట్లో గుడ్డలు పెట్టలేదని, కళ్లకు గంతలు కట్టలేదని, తెలంగాణ ప్రజలకు నీళ్లెలా తాపాలో చెప్పామన్నారు. అయినా.. కాంగ్రెస్ నేతలు పారిపోయారని, ఓట్లేసిన ప్రజలు నిలదీస్తారనే అక్కసుతోనే చిల్లర రాజకీయాలకు కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారన్నారు. అందుకే ఓ నాయకుడు ప్రాజెక్టుల్లో కుంభకోణం జరుగుతుందంటే... మరో నేత తాను ప్రిపేర్ అయి రాలేదని, ఇంకో నాయకుడు అప్పులివ్వద్దని లేఖలు రాస్తున్నామని అంటున్నారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని గొప్పలకు పోతున్న కాంగ్రెస్ నేతలు ఒక్కరోజైనా ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. తాము కాంగ్రెస్ నాయకుల్లా డప్పాలు కొట్టలేమని.. చేసిన పనిని చూసిన తర్వాతే ఓట్లేయమని ప్రజలను అడుగుతామని.. అదే టీఆర్ఎస్, కేసీఆర్ నైజమని అన్నారు. ఆ ఆలోచన ఎందుకు రాలేదు... జిల్లా కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలను ఎందుకు మాట్లాడలేకపో5యారని, ప్రపంచంలో ఎక్కడా లేని సమస్యలు తెలంగాణ ప్రాజెక్ట్‌లకే ఎందుకు వస్తాయని, అన్ని సమస్యలూ తెలంగాణ చుట్టూనే ఎందుకు తిరుగుతాయనే ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఎందుకు రాలేదని మంత్రి జగదీశ్ నిలదీశారు. ‘నీటి సామర్థ్యంతో సంబంధం లేకుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) కాల్వలను హనుమంతుడి తోకలా పెంచుకుంటూ పోతుంటే ప్రశ్నించే దమ్ము ఈ కాంగ్రెస్ నేతలకు ఎందుకు లేదు.. ఎందుకు దద్దమ్మల్లా కూర్చున్నారు.. 10 టీఎంసీల నీటిని 16లక్షల ఎకరాలకు పారిస్తామని చెప్పి ప్రాణహిత - చేవెళ్ల ప్రారంభించినప్పుడు ఎందుకు సంకలు గుద్దుకుని కొ బ్బరికాయలు కొట్టి వచ్చారు.. ఆనాడు ఏ క్షణమైనా ఆలోచించారా.. ప్రపంచం లో ఎవరికీ అర్థం కాని విధంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్సెల్బీసీ) సొ రం గం డిజైన్ రూపొందించినప్పుడు ఏం చేశారు.. నాలుగు దశాబ్దాలైనా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ఏం చేశారు..’ అని ప్రశ్నించారు. తామేదో అప్పులు తెస్తున్నామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని... అప్పులు తేవడం నేర్పిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఎంపీ సుఖేందర్‌రెడ్డి పనిచేయలేదా అని అడిగారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నేతలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, అబ్బగోని రమేశ్‌గౌడ్, బకరం వెంకన్న పాల్గొన్నారు. -
‘మెట్రో’ నిర్మాణంలో జాప్యం లేదు
మండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్ ♦ సర్వీసుల ప్రారంభ తేదీని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం ♦ నిర్ణీత వ్యవధిలోనే పనులు పూర్తి చేస్తాం ♦ పరిశీలనలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు : మంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరి గిందనడం సత్యదూరమని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివా రం శాసనమండలిలో షబ్బీర్ అలీ (కాంగ్రెస్) ప్రభాకర్‌రావు (టీఆర్ఎస్) అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ పత్రికల్లో వచ్చిన వార్తల న్నింటినీ వాస్తవాలుగా విశ్వసించలేమన్నారు. మెట్రోరైలు ప్రాజెక్టు పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తవుతాయని, అయితే సర్వీసులు ప్రారంభించే తేదీని ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పలేమని అన్నారు. మెట్రో రెండో దశను ఐదు మార్గాల్లో మరో 83 కిలోమీటర్లు పొడిగించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల 183 గ్రామాలున్నాయని, అన్ని గ్రామాలకూ మెట్రో రైలు సౌకర్యం ఇవ్వలేకపోయినప్పటికీ వీలైనంత ఎక్కువమందికి ఈ సదుపాయం అందుబాట్లో కి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ప్రైవేటు వర్సిటీలకు పచ్చజెండా..! విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో యూనివర్సిటీలను నెలకొల్పేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. పి.సుధాకర్‌రెడ్డి (టీఆర్ఎస్) అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల స్థాపనకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో మైనారిటీలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కొత్తగా 70 ఆశ్రమ పాఠశాల లను మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. వీటిలో 67 పాఠశాలలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామన్నారు. బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న మాట్లాడు తూ.. గ్రూప్స్, సివిల్స్ పరీక్షలకు శిక్షణనివ్వడానికి మరో నాలుగు బీసీ స్టడీ సెంటర్లు నెలకొల్పుతున్నామన్నారు. రూ.10లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత కు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూ.10 లక్షల వరకు 50 నుంచి 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆయా వర్గాల అభివృద్ధికి రూ.800 కోట్లు కేటాయించగా, టీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండేళ్లలోనే రూ.800 కోట్లు కేటాయించిందన్నారు. సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. యువత అభీష్టానికి అనుగుణంగా, వారు కోరుకున్న వ్యాపారాలకు(ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ఫుడ్సెంటర్లు, రొట్టెల తయారీ, బ్యూటీ పార్లర్లు..) రుణమిచ్చేలా బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. విత్తన భాండాగారంగా.. రాష్ట్రానికి విత్తన దిగుబడి అవసరం రాకుండా.. బ్రీడర్ విత్తనం, మూల విత్తన ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మె ల్సీ భూపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చె ప్పా రు. సీడ్విలేజ్ పథకం కింద ఈ ఏడాది రూ.6 కోట్ల విలువైన 3.75 లక్షల క్వింటాళ్ల విత్తన ఉ త్పత్తి జరిగిందని, 45,875 మంది రైతులు 18,350 హెక్టార్లలో విత్తన సాగు చేశారన్నారు. ప్రైవేటు కంపెనీల్లో కొన్న విత్తనాల కారణంగా రైతులు మోసపోయినట్లు ఫిర్యాదులొస్తే ఆ కంపెనీల లెసైన్స్‌లను రద్దు చేస్తామన్నారు. త్వరలో టెక్స్టైల్ విధానం ఇతర రాష్ట్రాలకు వలసపోయిన నేత కార్మికులను వెనక్కి రప్పించి, వారికి స్థానికంగా ఉపా ధి కల్పించేందుకోసం ప్రభుత్వం త్వరలోనే నూతన టెక్స్టైల్ విధానాన్ని తీసుకు రాబోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌ను వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేయనున్నామని, ఈ పార్కు ఏర్పాటుకు అవసరమైన 2,800 ఎకరాల భూసేకరణ కూడా ప్రారంభమైందన్నారు. వడ్డీ వ్యాపారుల నియంత్రణకు బిల్లు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు ముకుతాడు వేసేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి రైతులను వేధిస్తున్న వారిని చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పేద రైతులను ఫైనాన్షియర్లు, వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని, వారిపై ఏ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాలు తెల్లరేషన్ కార్డుల గందరగోళం: ఎంఐఎం సాక్షి, హైదరాబాద్: తెల్ల రేషన్‌కార్డులు, ఆహార భద్రత కార్డుల విషయంలో గందరగోళం నెలకొందని ఎంఐఎం పేర్కొంది. కొత్త కార్డుల కోసం దరఖాస్తులను ఏ ప్రా తిపదికన తిరస్కరిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, ముంతాజ్‌ఖాన్, పాషాఖాద్రీ, బలాలాలు ప్రశ్నించారు. ఆన్లైన్లో ప్రభుత్వం పొందుపరిచిన లెక్కల కు, అసెంబ్లీలో మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన వివరాలకు పొంతన లేదన్నారు. ఆహార భద్రత కార్డులున్న వారికి ఆరోగ్యశ్రీ వర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్దిష్ట ప్రాతిపదికల ప్రకారమే దరఖాస్తులు పరిశీలించి ఆర్హులను గుర్తిస్తున్నామని మం త్రి ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రం ఉమ్మడి గా ఉన్నపుడు తెలంగాణలో 80.09 లక్షల కార్డులుండేవని, 2.24 కోట్ల మంది లబ్ధిదారులుండేవారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కార్డుల సంఖ్య 89.47 లక్ష లు, లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్లకు చేరిం దన్నారు. కేంద్ర కోటా పెంచాలని పలుమార్లు కోరినట్లు వివరించారు. పాతబస్తీలో చాలా దరఖాస్తులను తొలగించారన్న ఆరోపణను ఆయన ఖండించారు.