‘మెట్రో’ నిర్మాణంలో జాప్యం లేదు
మండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్
♦ సర్వీసుల ప్రారంభ తేదీని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం
♦ నిర్ణీత వ్యవధిలోనే పనులు పూర్తి చేస్తాం
♦ పరిశీలనలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు : మంత్రి కడియం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరి గిందనడం సత్యదూరమని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివా రం శాసనమండలిలో షబ్బీర్ అలీ (కాంగ్రెస్) ప్రభాకర్‌రావు (టీఆర్‌ఎస్) అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ పత్రికల్లో వచ్చిన వార్తల న్నింటినీ వాస్తవాలుగా విశ్వసించలేమన్నారు. మెట్రోరైలు ప్రాజెక్టు పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తవుతాయని, అయితే సర్వీసులు ప్రారంభించే తేదీని ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పలేమని అన్నారు. మెట్రో రెండో దశను ఐదు మార్గాల్లో మరో 83 కిలోమీటర్లు పొడిగించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల 183 గ్రామాలున్నాయని, అన్ని గ్రామాలకూ మెట్రో రైలు సౌకర్యం ఇవ్వలేకపోయినప్పటికీ వీలైనంత ఎక్కువమందికి ఈ సదుపాయం అందుబాట్లో కి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు.
ప్రైవేటు వర్సిటీలకు పచ్చజెండా..!
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో యూనివర్సిటీలను నెలకొల్పేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. పి.సుధాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్) అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల స్థాపనకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో మైనారిటీలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కొత్తగా 70 ఆశ్రమ పాఠశాల లను మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. వీటిలో 67 పాఠశాలలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామన్నారు. బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న మాట్లాడు తూ.. గ్రూప్స్, సివిల్స్ పరీక్షలకు శిక్షణనివ్వడానికి మరో నాలుగు బీసీ స్టడీ సెంటర్లు నెలకొల్పుతున్నామన్నారు.
రూ.10లక్షల వరకు సబ్సిడీ రుణాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత కు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూ.10 లక్షల వరకు 50 నుంచి 80 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తోందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆయా వర్గాల అభివృద్ధికి రూ.800 కోట్లు కేటాయించగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత రెండేళ్లలోనే రూ.800 కోట్లు కేటాయించిందన్నారు. సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. యువత అభీష్టానికి అనుగుణంగా, వారు కోరుకున్న వ్యాపారాలకు(ఫుడ్ కోర్టులు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లు, రొట్టెల తయారీ, బ్యూటీ పార్లర్లు..) రుణమిచ్చేలా బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు.
విత్తన భాండాగారంగా..
రాష్ట్రానికి విత్తన దిగుబడి అవసరం రాకుండా.. బ్రీడర్ విత్తనం, మూల విత్తన ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మె ల్సీ భూపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చె ప్పా రు. సీడ్‌విలేజ్ పథకం కింద ఈ ఏడాది రూ.6 కోట్ల విలువైన 3.75 లక్షల క్వింటాళ్ల విత్తన ఉ త్పత్తి జరిగిందని, 45,875 మంది రైతులు 18,350 హెక్టార్లలో విత్తన సాగు చేశారన్నారు. ప్రైవేటు కంపెనీల్లో కొన్న విత్తనాల కారణంగా రైతులు మోసపోయినట్లు ఫిర్యాదులొస్తే ఆ కంపెనీల లెసైన్స్‌లను రద్దు చేస్తామన్నారు.
త్వరలో టెక్స్‌టైల్ విధానం
ఇతర రాష్ట్రాలకు వలసపోయిన నేత కార్మికులను వెనక్కి రప్పించి, వారికి స్థానికంగా ఉపా ధి కల్పించేందుకోసం ప్రభుత్వం త్వరలోనే నూతన టెక్స్‌టైల్ విధానాన్ని తీసుకు రాబోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ను వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేయనున్నామని, ఈ పార్కు ఏర్పాటుకు అవసరమైన 2,800 ఎకరాల భూసేకరణ కూడా ప్రారంభమైందన్నారు.
వడ్డీ వ్యాపారుల నియంత్రణకు బిల్లు
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు ముకుతాడు వేసేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి రైతులను వేధిస్తున్న వారిని చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పేద రైతులను ఫైనాన్షియర్లు, వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని, వారిపై ఏ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ప్రశ్నోత్తరాలు
తెల్లరేషన్ కార్డుల గందరగోళం: ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్: తెల్ల రేషన్‌కార్డులు, ఆహార భద్రత కార్డుల విషయంలో గందరగోళం నెలకొందని ఎంఐఎం పేర్కొంది. కొత్త కార్డుల కోసం దరఖాస్తులను ఏ ప్రా తిపదికన తిరస్కరిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, ముంతాజ్‌ఖాన్, పాషాఖాద్రీ, బలాలాలు ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వం పొందుపరిచిన లెక్కల కు, అసెంబ్లీలో మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన వివరాలకు పొంతన లేదన్నారు. ఆహార భద్రత కార్డులున్న వారికి ఆరోగ్యశ్రీ వర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్దిష్ట ప్రాతిపదికల ప్రకారమే దరఖాస్తులు పరిశీలించి ఆర్హులను గుర్తిస్తున్నామని మం త్రి ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రం ఉమ్మడి గా ఉన్నపుడు తెలంగాణలో 80.09 లక్షల కార్డులుండేవని, 2.24 కోట్ల మంది లబ్ధిదారులుండేవారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కార్డుల సంఖ్య 89.47 లక్ష లు, లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్లకు చేరిం దన్నారు. కేంద్ర కోటా పెంచాలని పలుమార్లు కోరినట్లు వివరించారు. పాతబస్తీలో చాలా దరఖాస్తులను తొలగించారన్న ఆరోపణను ఆయన ఖండించారు.