Minister Manohar parikar
-
ఎక్కువ మంది పిల్లల్ని కనండి: సీఎం
లబ్బీపేట (విజయవాడతూర్పు): రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుటుంబ నియంత్రణ పాటించాలనేది ఒకప్పటి విధానమన్నారు. గురువారం విజయవాడలో రామినేని ఫౌండేషన్ 18వ వార్షిక అవార్డు ప్రదానోత్సవానికి సీఎం చంద్రబాబు, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరికి విశిష్ట సేవా పురస్కారం ప్రదానం చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ వేముగంటి గీత, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, పాపులర్ తెలుగు డ్రామా యాక్టర్ ఆర్.నాగేశ్వరరావు (సురభి బాబ్జి)లకు విశేష పురస్కారాలు అందచేశారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ రామినేని అయ్యన్న చౌదరి ఆశయాల సాధన కోసం ఆయన కుటుంబం కృషి చేయడం అభినందనీయమని సీఎం ప్రశంసించారు. సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న వారిని గుర్తించి అవార్డులు అందచేయడం ఆనందకరమని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, డీజీపీ సాంబశివరావు, ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ జీఎన్ రావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం, ఛైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, సభ్యులు శారదాదేవి, సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, హరిశ్చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరు రావడం చిరకాల కోరిక
కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): భారతీ య జనతాపార్టీతో సుదీర్ఘ అనుబంధంగల నెల్లూరుకు రావడం చిరకాల కోరికని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గురువారం స్థానిక రేబాల లక్ష్మీనరసారెడ్డి పురమందిరంలో ఎలైట్‌మీట్‌లో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం మంది కాంట్రాక్టర్లు, 70 శాతం మంది ఇంజనీర్లు దక్షిణ ప్రాంతం వారని ఆయన ప్రశంసించారు. ఐఐటీ చదివే రోజుల్లో తన మిత్రుడు చేసిన వ్యాఖ్యలను వివరించారు. ప్రధాన మంత్రి మోదీ విదేశీ పర్యటన వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి సూపర్‌పవర్‌గా గుర్తింపు వచ్చిందన్నారు. సామర్థ్యానికి గుర్తింపు వస్తే అదే అభివృద్ధి అని పేర్కొన్నారు. గోవాలో గాయకులు గోవాకే పరిమితమై పాడుతుంటే గుర్తింపు, అభివృద్ధి లేదన్నారు. అదే వ్యక్తులు లతామంగేష్కర్, ఆశ బోంస్లేలు ముంబయికి వెళ్లి వ్యక్తిగతంగా అభివృద్ధి, దేశవ్యాప్త ఖ్యాతిని సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మోదీ పాలన ముఖ్యాంశాలను వివరించారు. అనంతరం ప్రజల ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లోనే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితులను, నైపుణ్య పని సామర్థ్యాలతో ఎదుర్కోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. న్యాయపరమైన అంశాల జోలికి వెళ్లకుండా తనవంతు సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. నెల్లూరులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థల ఏర్పాటును వివరించారు. రాష్ట్రంలో డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. సుదీర్ఘమైన కోస్తా తీరంలోని మత్స్యకారులతో సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటుచేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అవినీతి నిర్మూలన చర్యలు నిదానంగా సాగడం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. దానిపై న్యాయవ్యవస్థ తన పాత్రను పోషిస్తుందన్నారు. పెట్రోల్ ధరల పెంపుపై స్పందిస్తూ తక్కువ స్థాయిలోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. కృష్ణుడు, శివాజీ స్ఫూర్తి పురాణాల్లో కృష్ణుడు, చరిత్రలో శివాజీ స్ఫూర్తి అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే రాజకీయాల్లో ప్రవేశించడానికి కారణానికి వరదనీటి ప్రవాహంలో కొట్టుకోపోతున్న వ్యక్తిని కాపాడేందుకు కథను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కె.హరిబాబు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేష్‌శర్మ, బీజేపీ నాయకులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఐటీకి కేంద్రమంత్రి అభినందన
ఐటీ మంత్రి కేటీఆర్ కు లేఖరాసిన రక్షణ శాఖ మంత్రి పారికర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రశంసించారు. ఈ మేర కు రాష్ట్ర ఐటీ శాఖను నిర్వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు కృషిని అభినందిస్తూ తాజాగా లేఖ రాశారు. ప్రధానంగా టీ-హబ్ ద్వారా స్టార్టప్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించడాన్ని లేఖలో కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్రం కలసి పనిచేస్తుందని మనోహర్ పారికర్ పేర్కొన్నారు. టీ-హబ్‌తో రక్షణ శాఖ భాగస్వామ్యం ద్వారా డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్ ఇకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని, ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఆర్డీవోను ఆదేశించినట్లు కేంద్రమంత్రి ఆ లేఖలో వివరించారు. కాగా, ఐటీశాఖ పనితీరును ప్రశంసిస్తూ రక్షణ మంత్రి లేఖరాయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో డిఫెన్స్/ ఏరోస్పేస్ ఇంక్యుబేటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు కేటీఆర్ తెలిపారు. మలేషియా మంత్రి నుంచి మరో లేఖ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మలేషియా ప్రభుత్వం తరఫున పరిశ్రమల మంత్రి ముస్తఫా మహమ్మద్ నుంచి మరోలేఖ అందింది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఆయన మలేషియన్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖరాశారు. భవిష్యత్‌లోనూ మలేషియా, తెలంగాణ మధ్య ఇదేరకమైన సుహృద్భావ సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. మరిన్ని వ్యాపార సంబంధాలను పెంపొందించుకునేందుకు మలేషియాకు రావాల్సిందిగా, మంత్రి కేటీఆర్‌ను ముస్తఫా ఆహ్వానించారు. -
కలాం విజన్ సాధనే అసలు నివాళి
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో అత్యంత కీలకపాత్ర పోషించే క్షిపణి వ్యవస్థల రూపకల్పనలో భారత్ సాధించిన ప్రగతి మొత్తం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దార్శనికత ఫలితమేనని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై యువతలో ఆసక్తి రేకెత్తించిన వ్యక్తి కలాం అని కొనియాడారు. అబ్దుల్ కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ శివార్లలో డీఆర్డీవో మిసైల్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమానికి పారికర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) మిసైల్ కాంప్లెక్స్ పేరును ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్’గా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం శాస్త్రవేత్తలు, ఆర్సీఐ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ, డీఆర్డీవో పరిశోధనశాలలు డీఆర్డీఎల్, ఆర్సీఐ, ఏఎస్ఎల్లతో కూడిన మిసైల్ కాంప్లెక్స్‌కు కలాం పేరు పెట్టడం ఆయనకు అర్పించిన అతి చిన్న నివాళి మాత్రమేనని అన్నారు. కలాం స్ఫూర్తితో ఐదేళ్లలో మిసైల్ టెక్నాలజీలో పూర్తిస్థాయిలో స్వావలంబన సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. డీఆర్డీవో సామర్థ్యం, లోటుపాట్లన్నింటినీ బేరీజు వేసిన తరువాత కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని చెప్పారు. అనంతరం ఆరెంజ్, కౌటిల్య పేర్లతో ఏర్పాటు చేసిన రెండు కీలకమైన వ్యవస్థలను పారికర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్సీఐ డెరైక్టర్, రక్షణ మం త్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కె.విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చొరబాట్లను అణచివేస్తాం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాట్లను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చొరబాట్లు గణనీయంగా తగ్గాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆర్సీఐ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైమానిక దళంతోపాటు నావికా, పదాతిదళాల్లో మహిళా సైనికుల సేవలు మౌలిక సదుపాయాల లేమి ఉన్నచోట మినహా అన్ని విభాగాల్లోనూ వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు ఎయిర్‌షో మునుపటి మాదిరి అక్కడే కొనసాగుతుందని, మరోచోటికి మార్చే ఆలోచన లేదని స్పష్టంచేశారు. -
డిఫెన్స్‌లో ‘ప్రైవేట్’తో భాగస్వామ్యం
న్యూఢిల్లీ: రక్షణ రంగంలోని ఆరు కీలక విభాగాల్లో పరికరాల కొనుగోలుకు సంబంధించి అత్యంత తక్కువ కోట్ చేసిన బిడ్డరుకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా దేశీ ప్రైవేట్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆయా సంస్థల ఎంపిక లో పాటించాల్సిన మార్గదర్శకాలను సూచించేందుకు డీఆర్డీవో మాజీ చీఫ్ వీకే ఆత్రే కమిటీని ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. కమిటీ 3 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని ఫిక్కీ సదస్సులో తెలిపారు. ఆరు కీలక విభాగాల్లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు మొదలైనవి ఉంటాయి.