Minister of Mines
-
బాధ్యతలు చేపట్టిన మ్రంతులు
జంగారెడ్డిగూడెం మహిళా శిశు సంక్షేమ, గనుల శాఖల మంత్రి పీతల సుజాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆదివారం సచివాలయంలో వారికి కేటాయించిన ఛాంబర్లలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, వేదపండితులు హాజరయ్యారు. వారు బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో వేదపండితుల వేదాశీర్వచనం ఇచ్చారు. -
గనుల కేటాయింపులో పారదర్శకత: తోమర్
న్యూఢిల్లీ: దేశంలోని ఖనిజ నిక్షేపాల హేతుబద్ధ వినియోగం, గనుల కేటాయింపులో పారదర్శకత, అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్రాలతో మెరుగైన సమన్వయం.. తన ప్రాథమ్యాలని కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. గనుల కేటాయింపు సందర్భంగా పర్యావరణ పరిరక్షణను కూడా దృష్టిలో పెట్టుకుంటామన్నారు. కేంద్ర మంత్రి బాధ్యతలను శుక్రవారం ఆయన స్వీకరించారు. తోమర్‌కు ఉక్కు, గనులు, ఉపాధి, కార్మిక శాఖ లను కేటాయించిన విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న గనుల లెసైన్సుల జారీలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.