minister office
-
మంత్రి కార్యాలయం ముట్టడించిన కార్మికులు
-
మంత్రి కార్యాలయంలో అగ్ని ప్రమాదం
సాక్షి, నల్లగొండ: విద్యుత్‌శాఖ మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆఫీస్ పైన ఉన్న గదిలో మంటలు ఎగిసిపడి దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. -
ఆగస్టు 4న కార్మిక మంత్రి కార్యాలయం ముట్టడి
సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4న కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, డి.గోవిందరావులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణం ఇందిరానగర్ కాలనీలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా హామీ అమలు చేయలేదన్నారు. వేతన సవరణ గడువు పూర్తయి ఐదేళ్లు గడిచినా సవరించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్ యాజమాన్యాలు కుమ్మక్కై కార్మికుల కష్టాన్ని దోపిడీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. జిల్లాలో పరిశ్రమలు మూతపడడం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడినా కార్మిక మంత్రికి పట్టడం లేదని విమర్శించారు. మూసివేసిన పరిశ్రమలు తెరిపించకుండా అణువిద్యుత్ ప్లాంట్ వస్తే ఉపాధి కలుగుతుందని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని, వేతన అమలు సలహా బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, 65వ షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాలు పెంచాలని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, కార్మిక చట్టాలు సవరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కార్యాలయం ముట్టడికి పరిశ్రమలు, షాపులు, హోటళ్లు, ఇంటి పనివారు, జీడి, కొబ్బరి హమాలీ, మోటారు కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్ల సాధనకు సంతకాల సేకరణ చేయాలని కోరారు. ఈ మేరకు గోడ పత్రికను ఆవిష్కరించారు. -
మంత్రి కార్యాలయం ముట్టడి
రాజాం రూరల్, న్యూస్‌లైన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో కొందరు అంగన్వాడీ కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లో పని చేస్తున్న కార్యకర్తలు, ఆయాలు బుధవారం ఉదయం రాజాంలోని సామాజిక ఆస్పత్రి ఆవరణలో సమావేశమయ్యారు. అనంతరం సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తినాయుడు ఆధ్వర్యంలో అంగన్వాడీలంతా ర్యాలీగా వెళ్లి పాలకొండ రోడ్డులోని మంత్రి కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అప్పటికే సీఐ అంబేద్కర్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. కార్యాల యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మహిళా పోలీసులు అడ్డుకున్నారు. మహిళా పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఆ సంఘ అధ్యక్షురాలు పి.ఉమ సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికుల ఉపచారాలతో ఆమె ఉపశమనం పొందారు. దీంతో మంత్రి, పోలీసులకు వ్యతిరేకంగా ఆం దోళనకారులు నినాదాలు చేశారు. స్థానిక నాయకుల మాటలు నమ్మి కోండ్రుకు ఓట్లు వేసి తప్పు చేశామని, సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో తరి మికొడతామని హెచ్చరించారు. పోలీసు ల తీరును నిరసిస్తూ రాజాం-పాలకొం డ ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ దేవానంద్‌శాంతో సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులను వారించారు. ట్రాఫిక్ స్తంభించిపోవడం తో శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ స్టీవెన్సన్ హామీ మేరకు ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వరలక్ష్మి, పుణ్యవతి, మంగమాంబ, ఉమాకుమారి, వేణుకుమారి పాల్గొన్నారు.