
మంత్రి కార్యాలయంలో అగ్ని ప్రమాదం
సాక్షి, నల్లగొండ: విద్యుత్‌శాఖ మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆఫీస్ పైన ఉన్న గదిలో మంటలు ఎగిసిపడి దట్టమైన పొగలు అలుముకున్నాయి.
అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.