minister Sandeep Kumar
-
'హవ్వా.. ఏ ఎనాలసిస్‌తో ఇలాంటి వారికి టికెట్లు'
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో నేపథ్యం, వ్యక్తిగత పరిశీలన, పూర్తి విశ్లేషణను చేసి మంచి విద్యావంతులకు టికెట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పదేపదే చెప్పి ప్రజలను నమ్మించారని.. ఆయన చేసిన ఎనాలసిస్ ఇదేనా? ఎంచుకుంది ఇలాంటి వ్యక్తులనేనా? అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి ఇద్దరు మహిళతో ఉన్న అభ్యంతరకర వీడియో సీడీకి సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు గురువారం ముట్టడించారు. సీఎం కేజ్రీవాల్, పదవి కోల్పోయిన మంత్రి సందీప్ కుమార్ డౌన్ డౌన్ అంటూ నిరసన నినాదాలతో దద్దరిల్లేలా చేశారు. అయితే, సీఎం నివాసం ఇంటివద్దకు ఆందోళన నిర్వహించడానికి వెళ్లిన వారిపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు. వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేయగా అది కాస్త ఆందోళనకరంగా మారింది. ఇద్దరు మహిళలతో సందీప్ కుమార్ అసభ్యంగా అభ్యంతర పరిస్థితిలో ఉన్న ఓ సీడీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయానికి పార్సిల్ రూపంలో వెళ్లగానే అతడిని తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అతడిని మంత్రి పదవి నుంచి తప్పించారు. తమకు ప్రజలే ముఖ్యమని అవినీతిని ఏ మాత్రం సహించబోమని ప్రకటించారు. ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆప్ ప్రభుత్వాన్ని నిందిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించి కేజ్రీవాల్ నివాసాన్ని ముట్టడించారు. బీజేపీ అధికార ప్రతినిధి నలిన్ కోహ్లీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పనిచేయడం మానేశారని, ఎంతసేపు పక్కవారిపై ఆరోపణలు, కుట్రలు చేయడమే పొద్దంత పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తాము ఎంతో విశ్లేషణ చేసిన తర్వాతే తమ పార్టీలోకి నాయకులను తీసుకొచ్చామని పదేపదే కేజ్రీవాల్ చెప్పారని, వారు చేసిన ఎనాలసిస్ ఇదేనా అని సందీప్ కుమార్ విషయాన్ని ప్రశ్నించారు. -
అశ్లీల సీడీ చూసి.. మంత్రిని పీకేసిన సీఎం
-
అశ్లీల సీడీ చూసి.. మంత్రిని పీకేసిన సీఎం
అది.. రాత్రి 8 గంటల సమయం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి ఓ సీడీ పార్సిల్లో వచ్చింది. దాదపు అరగంట తర్వాత.. తన మంత్రివర్గంలోని అతి చిన్నవయసు మంత్రి సందీప్ కుమార్‌ను తొలగిస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు!! సందీప్ కుమార్ (34) ఇద్దరు మహిళలతో చాలా అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉన్నట్లుగా ఆ 9 నిమిషాల వీడియోలో ఉందని, దాంతోపాటు అందులో కొన్ని ఫొటోలు కూడా ఉన్ నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సీడీ అంతకుముందే కొన్ని టీవీ చానళ్లకు కూడా చేరింది. తక్షణ స్పందన కోసం ముఖ్యమంత్రికి కూడా దాన్ని పంపారని అంటున్నారు. ఇందులో మరో విషయం ఏమంటే, ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సందీప్ కుమార్ మాట్లాడుతూ, తాను నిద్ర లేవగానే ప్రతిరోజూ తన భార్య పాదాలు తాకుతానని చెప్పారు. అలాంటి మనిషే ఇప్పడు ఇలా దొరికిపోవడం విశేషం. మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమశాఖ మంత్రిగా ఇన్నాళ్లు వ్యవహరిస్తున్న సందీప్‌కుమార్ స్థానంలో వేరే ఎవరిని నియమించాలన్న విషయమై రాత్రి చాలా సేపటి వరకు సీఎం కార్యాలయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా మీడియాతో మాట్లాడారు. అవినీతి, స్కాంలను తమ పార్టీ ఏమాత్రం సహించదని, మంత్రులు ఎవరైనా లంచాలు తీసుకున్నట్లు తెలిస్తే వెంటనే తొలగిస్తామని, ఏ సభ్యుడైనా, ఏ స్థాయిలో ఉన్నా ఇదే తరహాలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ముగ్గురు మంత్రులను తొలగించారు. ఇంతకుముందు లంచం అడిగినట్లు ఆరోపణలు రావడంతో ఆహార శాఖ మంత్రి ఆసిమ్ అహ్మద్ ఖాన్‌ను, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు పెట్టిన న్యాయశాఖ మంత్రి జితేందర్ తోమర్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అయితే అసలు ఎన్నికలు జరగడానికి ముందే కొంతమంది అభ్యర్థుల ప్రవర్తన విషయంలో తాము అభ్యంతరాలు చెప్పామని, అయినా అప్పట్ల అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోలేదని ఆప్ మాజీ సభ్యులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్ చెబుతున్నారు. ప్రభుత్వం మొత్తం అవినీతి మయం అయిపోయినందున ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, గత ఏడాది కాలంలోనే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలపై పలు కేసులు నమోదయ్యాయని బీజేపీ నాయకుడు విజేంద్ర గుప్తా అన్నారు. Recd "objectionable" CD of minister Sandeep Kr. AAP stands for propriety in public life. That can't be compromised(1/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) 31 August 2016 Removing him from Cabinet wid immediate effect(2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) 31 August 2016 -
అశ్లీల సీడీ బహిర్గతం.. మంత్రికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన మంత్రివర్గం నుంచి సందీప్ కుమార్‌కు ఉద్వాసన పలికారు. సందీప్ కుమార్‌కు సంబంధించి ఓ 'అభ్యంతరకరమైన సీడీ' తనకు అందిందని కేజ్రివాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ సీడీలో మంత్రి అశ్లీల దృశ్యాలు, ఫోటోలు ఉన్నట్టు తేలడంతో ఆయన్ను మంత్రి వర్గం నుంచి కేజ్రివాల్ తొలగించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుందని కేజ్రీవాల్ తెలిపారు. Recd "objectionable" CD of minister Sandeep Kr. AAP stands for propriety in public life. That can't be compromised(1/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) 31 August 2016 Removing him from Cabinet wid immediate effect(2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) 31 August 2016