న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో నేపథ్యం, వ్యక్తిగత పరిశీలన, పూర్తి విశ్లేషణను చేసి మంచి విద్యావంతులకు టికెట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పదేపదే చెప్పి ప్రజలను నమ్మించారని.. ఆయన చేసిన ఎనాలసిస్ ఇదేనా? ఎంచుకుంది ఇలాంటి వ్యక్తులనేనా? అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి ఇద్దరు మహిళతో ఉన్న అభ్యంతరకర వీడియో సీడీకి సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు గురువారం ముట్టడించారు.
సీఎం కేజ్రీవాల్, పదవి కోల్పోయిన మంత్రి సందీప్ కుమార్ డౌన్ డౌన్ అంటూ నిరసన నినాదాలతో దద్దరిల్లేలా చేశారు. అయితే, సీఎం నివాసం ఇంటివద్దకు ఆందోళన నిర్వహించడానికి వెళ్లిన వారిపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు. వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేయగా అది కాస్త ఆందోళనకరంగా మారింది. ఇద్దరు మహిళలతో సందీప్ కుమార్ అసభ్యంగా అభ్యంతర పరిస్థితిలో ఉన్న ఓ సీడీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయానికి పార్సిల్ రూపంలో వెళ్లగానే అతడిని తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అతడిని మంత్రి పదవి నుంచి తప్పించారు. తమకు ప్రజలే ముఖ్యమని అవినీతిని ఏ మాత్రం సహించబోమని ప్రకటించారు.
ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆప్ ప్రభుత్వాన్ని నిందిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించి కేజ్రీవాల్ నివాసాన్ని ముట్టడించారు. బీజేపీ అధికార ప్రతినిధి నలిన్ కోహ్లీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పనిచేయడం మానేశారని, ఎంతసేపు పక్కవారిపై ఆరోపణలు, కుట్రలు చేయడమే పొద్దంత పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తాము ఎంతో విశ్లేషణ చేసిన తర్వాతే తమ పార్టీలోకి నాయకులను తీసుకొచ్చామని పదేపదే కేజ్రీవాల్ చెప్పారని, వారు చేసిన ఎనాలసిస్ ఇదేనా అని సందీప్ కుమార్ విషయాన్ని ప్రశ్నించారు.
'హవ్వా.. ఏ ఎనాలసిస్తో ఇలాంటి వారికి టికెట్లు'
Published Thu, Sep 1 2016 1:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement