పాకిస్థాన్ గురివింద తీరు
న్యూఢిల్లీ: ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లో చోటుచేసుకున్న పరిణామాలపై భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రభుత్వం, ఇతర నేతలు మాట్లాడటంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజుజు మండిపడ్డారు. కశ్మీర్ ఆందోళనల అంశం భారత్ అంతర్గత విషయమని, ఇందులో పాక్ జోక్యం అవసరం లేదని అన్నారు. (చదవండి: 'ఒక్క బుర్హాన్‌ను కాల్చిచంపితే...')
'ఒక వేళ పాకిస్థాన్ బాధపడాలనుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించి, అక్కడ జరుగుతోన్న హక్కుల ఉల్లంఘన గురించి బాధపడాలే తప్ప కశ్మీర్ గురించి కాదు'అని రిజిజు వ్యాఖ్యానించారు. బుర్హానీ ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో చోటుచేసుకున్న కాల్పులు మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని, దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం చేయాలని పాక్ ప్రధాని నవాజ్ షరీప్ ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.