నియామకాలకు సమయం ఆసన్నమైంది
మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు చేపట్టడానికి సమ యం ఆసన్నమైందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం రాత్రి మిర్యాలగూడలోని టీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు, పట్టభద్రుల సమావేశంలో మాట్లాడారు. తెలం గాణలో నిధులు, నీళ్లు, నియామకాలను కూడా చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు అడ్డుకోవాలని చూస్తున్నార న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణ తెస్తే రాత్రికి రాత్రి బీజేపీ నాయకులు ఏడు మండలాలను ఆంధ్రా లో కలిపారని విమర్శించారు. ఇప్పడు కూడా వారిని గెలిపిస్తే మరో రెండు మం డలాలు కూడా ఆంధ్రాలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వని విధంగా ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ కేసీఆర్ ఇచ్చారని గుర్తుచేశారు. మేధావులు ఆలోచించి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిని తర్వాత ఒప్పందంలో భాగంగా 54 శాతం విద్యుత్ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకుండా చంద్రబాబు కుట్రలు చేశాడని, అందుకు కేసీఆర్ అనువైన చోట విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దామరచర్ల మండలంలో ఆరు వేల మెగావాట్లతో విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నాడని అన్నారు. నసాగర్ జలాశయంలో అడ్డుగోడ పెడతామని బాబు మాట్లాడితే కనీసం ఏ పార్టీ నాయకులు నోరు మెదపలేదన్నారు. తెలంగాణకు ద్రోహం చేయాలని ఇంకా కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పి కొట్టడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి తగిన బుద్ది చెప్పాలని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ 8నెలలుగా దేశం లో ఏ రాష్ట్రంలో కూడా చేపట్టని పాలన ను కేసీఆర్ అందిస్తున్నాడని అన్నారు.
సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పంటలకు నీరందుతుందని చెప్పారు. చంద్రబాబు హయాంలో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో పంటలు ఎండిపోయాయని అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవిందర్, టీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, నోముల నర్సింహ్మయ్య, అన్నభీమోజు నాగార్జునచారి, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, గార్లపాటి నిరంజన్‌రెడ్డి, మందుల సామ్యేల్, గాయం ఉపేందర్‌రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, మాలి ధర్మపాల్‌రెడ్డి, రాంచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.