మంత్రి ఇంటి ముట్టడికి యత్నం
* పలువురి అరెస్టు.. పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
* నేడు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపు
సిద్దిపేట అర్బన్ : ఫాస్ట్ పథకం పేరుతో ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, మరో నెల రోజులు గడిస్తే విద్యార్థులకు పరీక్షలు రానున్నాయని, ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను చెల్లించకపోవడంతో పలు విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి శుక్రవారం పట్టణంలోని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా మంత్రి నివాసం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను చేశారు.
ఈ క్రమంలో విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి మంత్రి ఇంటి వద్దకు చేరుకుని విద్యార్థి సంఘాల నేతలతో అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారని, వెంటనే ఆందోళనను విరమించి వెళ్లిపోవాలని సూచించా రు. విద్యార్థి జేఏసీ నాయకులు తమకు స్పష్టమెన హామీ మంత్రి నుంచి అంది తేనే ఆందోళనను విరమిస్తామని భీష్మిం చారు. దీంతో సీఐ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థి నాయకులపై లాఠీ చార్జీ చేశారు.
అనంతరం పలువురు విద్యార్థి సంఘ నేతలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.ఈ విషయంపై వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. అనుమతి లేకుండా మంత్రి ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు తాటికొండ రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు దబ్బేట ఆనంద్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.