సాక్షి, హైదరాబాద్: స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫాస్ట్ పథకం విధివిధానాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు (మంగళవారం) తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి జమాల్‌పూర్ నిరంజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
14 లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన రూ.1,250 కోట్లకుగాను కేవలం రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. మిగతా రూ.750 కోట్లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
నేడు ఏబీవీపీ రాస్తారోకో
Published Tue, Dec 9 2014 6:12 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement