Fast scheme
-
'ఫాస్ట్' పథకంపై విచారణ 15 రోజులు వాయిదా
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫాస్ట్ పథకంపై విచారణను హైకోర్టు 15 రోజుల పాటు వాయిదా వేసింది. ఈ పిల్ పై కోర్టు ప్రభుత్వ వివరణ కోరగా.. తాము ఫాస్ట్ పథకంపై పునరాలోచిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. -
‘ఫాస్ట్’గా వాపస్
పాత పద్ధతిలోనే విద్యార్థుల ఫీజు చెల్లింపు ఫాస్ట్ పథకాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగింపు విడతలవారీగా నిధులు చెల్లిస్తాం: ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికత నిర్ధారణకు ‘371డి’ పాటిస్తామని వెల్లడి ఛాతీ ఆస్పత్రి స్థలంలో 150 కోట్లతో కొత్త సచివాలయం, ఏడాదిలో నిర్మాణాలు పూర్తి వెంకన్నసహా దేవుళ్లకు తెలంగాణ మొక్కులు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణలో వెసులుబాటు ఏడు గంటల సుదీర్ఘ కేబినెట్ భేటీలో నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు కోసం తీసుకొచ్చిన ‘ఫాస్ట్’ పథకాన్ని రాష్ర్ట ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్నే కొనసాగిస్తామని ప్రకటించింది. పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఉదారంగా వ్యవహరించాలని భావించి.. కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజులను విడతలవారీగా విడుదల చేస్తామని, త్వరలోనే కొన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన పని లేదని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ‘గత ప్రభుత్వం నాలుగేళ్ల బకాయిలను మా నెత్తిన పెట్టి వెళ్లిపోయింది. దాదాపు రూ. 1800 కోట్ల బకాయిలున్నాయి. ఇప్పటికే కొంత చెల్లించాం. ఇప్పటికే రూ. 862 కోట్ల బకాయిలున్నాయి. వాటిని వెంటనే విడుదల చేస్తున్నాం. పాత బకాయిలన్నీ కడిగేసినం’ అని కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఏడు గంటలకుపైగా ఈ భేటీ జరిగింది. అనంతరం కేబినేట్లో తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. వివాదాలకు తావులేకుండా చూసేందుకే ‘ఫాస్ట్’ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో విద్యార్థుల స్థానికత నిర్థారణ కోసం 371డీ నిబంధనను మాత్రం పాటిస్తామన్నారు. అందులో ఎలాంటి వివాదం లేదన్నారు. మరింత చేరువగా క్రమబద్ధీకరణ ‘నిరుపేదలతో పాటు మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ విషయంలో మరింత వెసులుబాటు ఇచ్చాం. 125 గజాల వరకు ఉచితంగా పట్టాలిచ్చేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 58 కింద దాదాపు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జీవో 59 కింద తక్కువ సంఖ్యలో వచ్చాయి. దాదాపు రూ. 60 కోట్ల ఆదాయం వచ్చింది. 125 గజాల కంటే కొంత విస్తీర్ణం ఎక్కువగా ఉన్న నిరుపేదలు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఐదు, పది గజాలు ఎక్కువ ఉన్నంత మాత్రాన వారేం ధనవంతులైపోరు. ఈ పరిధిని 150 గజాల వరకు పెంచాం. 125 గజాల వరకు ఉచితంగానే పట్టాలిస్తాం. అంతకు మించి ఉన్న స్థలానికి మాత్రమే మురికివాడల్లో అయితే 10 శాతం, లేకపోతే 25 శాతం విలువ చెల్లించాలి. దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. కానీ మరో రెండు మూడు రోజులు అవకాశమిస్తాం. ఫిబ్రవరి 20 నుంచి పట్టాల పంపిణీ ప్రారంభిస్తాం. మార్చి 10లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. జీవో 59కు సంబంధించి రేటు ఎక్కువగా ఉందని మధ్యతరగతి వర్గాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. అందుకే ఈ రాయితీలో వెసులుబాటు ఇచ్చాం. కొత్త మార్పుల ప్రకారం 250 గజాల వరకు 25 శాతం, 500 గజాల వరకు 50 శాతం, అంతకుమించి 75 శాతం భూముల విలువ చెల్లించాల్సి ఉంటుంది. వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఇచ్చాం. ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులకు గడువు ఉంది. ఏప్రిల్ నెలాఖరులోగా వాయిదాలన్నీ చెల్లించాల్సి ఉంటుంది’ అని కేసీఆర్ వెల్లడించారు. దేవుళ్లకు తెలంగాణ మొక్కులు ‘తెలంగాణ రాష్ట్ర సాధనకు మేం ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు మొక్కులు మొక్కుకున్నాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి రూ.5 కోట్లతో ఆభరణాలు చేయిస్తామని మొక్కినం. వాటిని చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. వాటిని నేనే స్వయంగా వెళ్లి స్వామి వారికి సమర్పిస్తాం. అజ్మీర్ షరీఫ్ దర్గాలో కూడా మొక్కినం. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే అజ్మీర్ యూత్రికులకు రూ.5 కోట్లతో వసతి గృహం ఏర్పాటు చేస్తామన్నాం. అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించగానే అక్కడ హైదరాబాద్ భవన్‌ను నిర్మిస్తాం. వక్ఫ్‌బోర్డు ద్వారా రూ.2.50 కోట్లతో ఛాదర్ తయారు చేయిస్తున్నాం. నేనే స్వయంగా అక్కడికి తీసుకెళ్తా. వీటితో పాటు వరంగల్‌లో భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం, కొరివి వీరభద్రస్వామికి బంగారు మీసాలు, విజయవాడ కనక దుర్గమ్మకు ముక్కుపుడక, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక సమర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ప్రభుత్వం తరఫున అధికారికంగా సమర్పిస్తాం’ అని సీఎం చెప్పారు. మార్కెట్లను తీర్చిదిద్దుతాం ‘రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో రూ.100 కోట్లతో కొత్తగా ఆరోగ్యకర వాతావరణంలో శాఖాహార(కూరగాయల), మాంసాహార(మాంసం, చేపల) మార్కెట్లు నిర్మిస్తాం. శాస్త్రీయ విధానంలో కనీసం 3 అడుగుల ఎత్తులో వీటిని ఉంచితే సూక్ష్మ జీవుల వ్యాప్తిని నిరోధించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో సురక్షిత ఆహార పదార్థాల విక్రయాల కేంద్రాలుగా రాష్ట్రంలోని రైతు బజార్లు, మార్కెట్లను తీర్చిదిద్దుతాం. నిజాం నవాబులు నిర్మించిన మోండా మార్కెట్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పటికీ మాంసాహార పదార్థాలపై ఈగ సైతం వాలకుండా అప్పుడు వాడిన జాలీలే ఉన్నాయి. శనివారం నగరంలోని మంత్రులతో పాటు అధికారులతో కలిసి నేనే మోండా మార్కెట్‌ను పరిశీలిస్తా. అనంతరం సచివాలయంలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. మెహదీపట్నం రైతు బజార్‌తో పాటు ఇతర మార్కెట్ల అభివృద్ధిపై చర్చిస్తాం. ఇక వరంగల్ కార్పొరేషన్‌కు గ్రేటర్ హోదా కల్పించడంతోపాటు కొత్త పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు నిర్ణయించాం. తెలంగాణ సంసృ్కతికి ప్రచారం కల్పించేందుకు తెలంగాణ సాంసృ్కతిక సారథి విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 558 మంది కళాకారులను నియమిస్తాం. ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలకు గురై పని చేసిన వాళ్లున్నారు. అవసరమైతే అర్హతలపై కొన్ని మినహాయింపులు ఇచ్చి ఈ నియామకాలు చేపడుతాం’ అని కేసీఆర్ వెల్లడించారు. సచివాలయానికి వాస్తుదోషం తెలంగాణకు రూ. 150 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని సీఎం ప్రకటిం చారు. సనత్‌నగర్‌లోని ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించి.. అక్కడ నూతన సచివాలయం నిర్మిస్తామన్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. పది ఇరవై రోజుల్లోనే ఆసుపత్రిని తరలిస్తామన్నారు. అనంతరం సచివాలయ నిర్మాణాలకు సర్వ మత ప్రార్థనలు చేయించి.. భూమి పూజ చేస్తామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే అన్ని విభాగాల కార్యాలయాలను ఒకే చోటకు తేవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న సచివాలయాన్ని ఏం చేయాలనే విషయంపై తదుపరి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. కాగా, ఇంతకాలం లేని అవసరం ఇప్పుడెందుకు వచ్చిందని విలేకరులు ప్రశ్నించడంతో స్పందించిన సీఎం.. ‘నిజంగా చెప్పాలంటే సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషం ఉంది. దీని చరిత్ర కూడా గలీజ్‌గా ఉంది. ఇక్కడున్నోళ్లు ఎవరూ ముందరపడలేదు. తెలంగాణకు అథోగతి పట్టకుండా ఉండాలనే ఈ ఆలోచన చేశాం. ఇప్పటికే ఛాతీ ఆసుపత్రిని మార్చాలని నిర్ణయించాం. స్వచ్ఛమైన గాలి.. కాలుష్యంలేని వాతావరణంలో ఉండాల్సిన క్షయ రోగులకు ఇప్పుడున్న స్థలం శ్రేయస్కరం కాదు. వికారాబాద్‌లో ఉన్న టీబీ శానిటోరియం పరిస్థితి మరో తీరు. అక్కడ 8 మంది రోగులుంటే... 296 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. అందుకే అక్కడికి ఈ ఆసుపత్రిని తరలించాలని నిర్ణయం తీసుకున్నాం. టీబీ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందికి ఇబ్బంది తలెత్తకుండా.. పీజీ సీట్లు నష్టపోకుండా వారిని ఇక్కడే సర్దుబాటు చేస్తాం. వికారాబాద్‌లో ఉన్న టీబీ శానిటోరియంను అభివృద్ధి చేసేందుకు రూ.7 కోట్లు మంజూరు చేశాం. సెక్రెటరీయట్కు స్థలాల పరిశీలన అంశం వచ్చినప్పుడు ఈ ఆసుపత్రి స్థలం అనువుగా ఉంటుందని భావించాం’ అని వివరించారు. ఫీజులకు 4 వేల కోట్లు! ఇప్పటివరకూ అమల్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాన్ని యథాతథంగా అమలుచేస్తే... ఈ ఏడాదికి దాదాపు రూ. 4 వేల కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. కానీ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు రూ. 2,700 కోట్లే. అందులోనూ పాత బకాయిల కిందే సగానికిపైగా నిధులు చెల్లించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి వచ్చే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగుల విద్యార్థులు మొత్తం 15,67,000 మంది వరకు ఉన్నారు. -
కేబినెట్ నిర్ణయాలపై సీఎం కేసీఆర్
-
ఇకపై ఫాస్ట్ పథకం ఉండదు : కేసీఆర్
-
ఫాస్ట్ పథకం ఇక లేదు: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఫాస్ట్ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజు బకాయిలకు రూ 862 కోట్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులో 371డి నిబంధన పాటిస్తామన్నారు. ఫీజు బకాయిలు గత ప్రభుత్వం తమ నెత్తిన రుద్దిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెస్ట్ ఆస్పత్రి స్థలంలో సచివాలయం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అన్ని కార్యాలయన్నీ ఒకచోట ఉండాలన్న ఉద్దేశంతోనే కొత్తగా సచివాలయం కట్టాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉందన్నారు. అక్రమ భూముల క్రమబద్దీకరణలో మార్పులు చేశామన్నారు. 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్దీరిస్తామని చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేసీఆర్ చెప్పారు. సాంస్కృతిక సారథి ద్వారా 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. -
ఫీజు కట్టకుంటే అంతే!
పరీక్షలకు హాల్‌టికెట్లు ఇవ్వబోమంటున్న కాలేజీలు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఖరారు కాని ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు మరో నెలలో తుది పరీక్షలున్నా ఫీజులపై కొరవడిన స్పష్టత తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్న విద్యార్థి సంఘాలు సాక్షి, హైదరాబాద్: వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపు విషయం ఇప్పటికీ తేలకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పథకాన్ని టీ సర్కార్ ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం (ఫాస్ట్)’గా మార్చినప్పటికీ దాని మార్గదర్శకాలను విద్యాసంవత్సరం చివరి దాకా విడుదల చేయకపోవడం సమస్యలకు దారి తీస్తోంది. విద్యార్థుల స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యార్థులకే ఫీజులు, స్కాలర్షిప్లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం, దానిపై వివాదాలు రేగి విషయం కోర్టుకు వెళ్లడం తెలిసిందే. దీనిపై హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణలో భాగంగా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ కౌంటర్‌ను దాఖలు చేయాలి. ఈ కౌంటర్‌పై కూడా ఇంకా తేల్చకపోవడంతో విద్యార్థి లోకంతో పాటు కాలేజీల యాజమాన్యాలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రాక్టికల్స్‌కు హాల్ టికెట్ల నిలిపివేత! ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ త్వరలోనే జరగాల్సి ఉండగా ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజు కట్టకపోతే హాల్‌టికెట్ ఇవ్వబోమని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోతే తామే చెల్లిస్తామంటూ విద్యార్థులతో కొన్ని యాజమాన్యాలు ప్రామిసరీ నోట్లు కూడా రాయించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పథకం అమలుపై ఏర్పడిన గందరగోళంతో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు. అలాగే స్కాలర్షిప్ బకాయిలు కూడా అందకపోవడం చాలా మంది విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వీటిపైనే ఆధారపడి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు చేస్తున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులకు, పాత విద్యార్థుల రెన్యూవల్స్‌కు 2,600 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని అధికారవర్గాల అంచనా. పాతబకాయిలను కూడా కలిపితే ఈ మొత్తం రూ. 3,200 కోట్లకు చేరుతుంది. గత ఏడాది కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వారి సర్టిఫికెట్లను యాజమాన్యాలు తమ వద్దనే పెట్టుకున్నాయి. తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం ఫీజుల రీయింబర్స్మెంట్ -రాష్ట్ర ప్రభు త్వవైఖరిపై త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీన్ని దశలవారీగా రద్దు చేసేందుకు చూస్తోంది. తన విధానమేంటో కోర్టుకు కూడా తెలపడం లేదంటే దీనిపై ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉన్నట్లు స్పష్టమవుతోంది. - జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేత ఫాస్ట్ మార్గదర్శకాలేవి? ఫాస్ట్ పథకం మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులు సక్రమంగా పరీక్షలకు సిద్ధమయ్యేలా చూడాలి. ఫీజులు కట్టకపోతే హాల్‌టికెట్లు ఇవ్వమని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతేఉద్యమిస్తాం. - శోభన్ మూడ్, ఎస్ఎఫ్ఐ రాష్ర్ట అధ్యక్షుడు -
‘ఫాస్ట్’ను ఎలా సమర్థిస్తారు?
- 1956 కటాఫ్ రాజ్యాంగబద్ధమేనా? - తెలంగాణ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పేరుతో రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీనికి సంబంధించిన జీవో 36లోని అంశాల సహేతుకతను ప్రశ్నించింది. 1956 సంవత్సరాన్ని కటాఫ్‌గా నిర్ణయించడాన్ని ఎలా సమర్థించుకుంటారంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని నిలదీసింది. 1956 నవంబర్ 1 నాటికి తెలంగాణలో స్థిరపడిన కుటుంబాల విద్యార్థులకే ఫాస్ట్ పథకాన్ని వర్తింపజేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కోర్టు సోమవారం తీవ్రంగా స్పందించింది. ‘బిహార్‌కు చెందిన దంపతులు రాష్ట్రానికి వచ్చి స్థిరపడితే, వారి బిడ్డకు ఫాస్ట్ కింద సాయం చేయరా? అతను రాజ్యాంగ పరిధిలోకి రాడా? జాతి సమగ్రత కింద అతనికి చదవుకునే అవకాశం లేదా?’ అంటూ ప్రశ్నలు సంధించింది. ఈ మొత్తం వ్యవహారంలో కోర్టుకు పూర్తి స్పష్టతనివ్వాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ విధానాలు రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటివరకూ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానంతో ఆటలాడుకోబోదని ఆశిస్తున్నామంటూ ఏజీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, ఈ విషయంలో మీ మోహం చూసి మరో అవకాశం ఇస్తున్నామంటూ ఏజీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్ట్ జీవోను సవాలు చేస్తూ ఆచంట టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ఇవి సోమవారం మరోసారి ధర్మాసనం ముందుకు వచ్చాయి. పితాని సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఫాస్ట్ జీవోకు సంబంధించి విధివిధానాలను, మార్గదర్శకాలను రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏజీ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి విధానం రూపొందించనందున ఈ వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఓ విధానం రూపొందించి, మార్గదర్శకాలను అమలు చేసినప్పుడు పిటిషనర్లు కోర్టుకు రావచ్చునని సూచించారు. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా మార్గదర్శకాలు రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఈ దశలోనే కోర్టును ఆశ్రయించడం సరికాదని వివరించారు. అడ్వొకేట్ జనరల్‌గా తన వాదనను రికార్డ్ చేసుకుని, ఈ వ్యాజ్యాలను మూసివేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ సమయంలోనే జీవోలోని ఓ భాగాన్ని ఆయన చదవి వినిపించారు. ఇదే సమయంలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుంబాలకే ఫాస్ట్‌ను వర్తించే నిబంధనను పిటిషనర్ తరఫు లాయర్ లేవనెత్తారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు గతంలో ఆదేశించినా తెలంగాణ సర్కారు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. దీనిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఏజీని నిలదీసింది. ఆర్థిక సాయానికి కటాఫ్ తేదీ పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో నాలుగు వారాల గడువునివ్వాలని రామకృష్ణారెడ్డి కోరారు. అయితే రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తేల్చి చెబుతూ విచారణను కోర్టు వాయిదా వేసింది. -
మంత్రి ఇంటి ముట్టడికి యత్నం
* పలువురి అరెస్టు.. పోలీస్‌స్టేషన్‌కు తరలింపు * నేడు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపు సిద్దిపేట అర్బన్ : ఫాస్ట్ పథకం పేరుతో ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, మరో నెల రోజులు గడిస్తే విద్యార్థులకు పరీక్షలు రానున్నాయని, ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకపోవడంతో పలు విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి శుక్రవారం పట్టణంలోని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా మంత్రి నివాసం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలను చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి మంత్రి ఇంటి వద్దకు చేరుకుని విద్యార్థి సంఘాల నేతలతో అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారని, వెంటనే ఆందోళనను విరమించి వెళ్లిపోవాలని సూచించా రు. విద్యార్థి జేఏసీ నాయకులు తమకు స్పష్టమెన హామీ మంత్రి నుంచి అంది తేనే ఆందోళనను విరమిస్తామని భీష్మిం చారు. దీంతో సీఐ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థి నాయకులపై లాఠీ చార్జీ చేశారు. అనంతరం పలువురు విద్యార్థి సంఘ నేతలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.ఈ విషయంపై వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. అనుమతి లేకుండా మంత్రి ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తాటికొండ రమేష్, ఎస్ఎఫ్ఐ నాయకుడు దబ్బేట ఆనంద్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
‘ఉపకారం’ కోసం ఉద్యమం
కోదాడటౌన్: ఉపకార వేతనాల కోసం విద్యార్థులు ఉద్యమ బాట పడుతున్నారు. విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన ‘ఫాస్ట్’ పథకం గైడ్‌లైన్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇటు విద్యార్థుల్లో, అటు ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకుల్లో అలజడి మొదలైంది. ఈ నెల 7వ తేదీతో డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీగా జిల్లాలోని మహాత్మాగాంధీ వర్శిటీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉపకార వేతనాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయనందున విద్యార్థులు కళాశాల ఫీజులను చెల్లిస్తేనే పరీక్ష ఫీజును తీసుకుంటామని చెపుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 40 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఇప్పటి వరకు ఎదురుచూస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. రోజు వా రి నిర్వహణ ఖర్చులు కూడా లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నెలల తరబడి అధ్యాపకులకు జీతాలు ఇవ్వకపోవడంతో పాఠాలు చెప్పడానికి వారు ముందుకు రావడం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. తీవ్రమవుతున్న సమస్య జిల్లాలో వివిధ కోర్సులు చదువుతూ గత సంవత్సరం ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకున్న 90, 413 మందితో పాటు ఈ విద్యాసంవత్సరం మరో 50 వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 41 ఇంజనీరింగ్, 116 డిగ్రీ, 242 జూనియర్ కళాశాలల విద్యార్థులతో పాటు డిప్లోమా, బీఫార్మసీ, ఐటీఐ, నర్సింగ్, డీఎడ్, బీఈడీ, పీజీ కోర్సులు చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 90 శాతానికి పైగా కళాశాలలు ప్రభుత్వం నుంచి వచ్చే ఉపకార వేతనాల మీద ఆధారపడి నడుస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడంతో పలు కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అదే విధంగా ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనాలతోనే చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు దాదాపు 90 శాతానికి పైగా ఉన్నారు. కాలేజీకి రావడం మానేస్తున్న విద్యార్థులు ప్రభుత్వం ఉపకార వేతనాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో కళాశాలలు ఫీజు కట్టాలని ఒత్తిడి తెస్తుండడంతో ఇపుడు వీరంతా కళాశాలలకు రావడం మానేస్తున్నారు. గతంలో విద్యార్ధులకు వచ్చే ఉపకార వేతనాలను కళాశాల ఫీజు కింద తీసుకొని తరగతులకు అనుమతించే వారు. కొన్ని కళాశాల లు పరీక్ష ఫీజు కూడా వారే చెల్లించేవారు. ప్రస్తుతం ఉపకార వేతనాలు రావపోవడంతో కళాశాల ఫీజు, పరీక్ష ఫీజు కలిపి దాదాపు 7 నుంచి 10 వేల రూపాయలు వరకు చెల్లించాల్సి వస్తుంది. కళాశాలలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తుండడంతో విద్యార్థులు కళాశాలలకు రావడమే మానేస్తున్నారు. 7వ తే దీ వరకు మాత్రమే సమయం ఉండడంతో డిగ్రీ విద్యార్థు లు ఉద్యమబాట పడుతున్నారు. వీరికి ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా తోడు కావడంతో ఈ సమస్య రానున్నరోజుల్లో తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలేజీలు మూసివేయడమే మిగిలింది : పి. నాగిరెడ్డి, సాయివికాస్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, కోదాడ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఉపకార వేతనాలను ఇవ్వకపోవడంతో కళాశాలలను నడపలేకపోతున్నాం. కళాశాలల నిర్వాహకులు భవనాల అద్దెలు, కరెంటు బిల్లులు, అధ్యాపకుల జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఉపకార వేతనాలు విడుదల చేయాలి. లేని పక్షంలో కళాశాలలను మూసి వేయడమే శరణ్యం. -
టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల..డిష్యుం..డిష్యుం..
ఇల్లెందు: టీడీపీ, టీఆర్ఎస్ నాయకలు, కార్యకర్తలు శనివారం ఇక్కడ నడి వీధిలో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన కొందరికి గాయూలయ్యూరుు. ఆ తరువాత, పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అసలేమైందంటే... ఫాస్ట్ పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం జగదాంబ సెం టర్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు సీఎం దిష్టిబొమ్మతో ర్యాలీగా జగదాంబ సెంట ర్ వరకు వచ్చారు. జగదాంబ సెంటర్లోనే ఉన్న టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జానీపాష తదితరులు ఉన్నారు. వారు టీఎన్ఎస్ఎఫ్ నాయకుల వద్దకు వచ్చి, సీఎం దిష్టిబొమ్మను దహనం చేయవద్దని కోరారు. దీనిని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పట్టించుకోకుండా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతి రేకంగా నినాదాలిస్తూ ముందుకు కదిలారు. వారిపై దిండిగల రాజేందర్, జానీపాష, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత, ఆ ర్యాలీకన్నా ముందే పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత అక్కడకు ర్యాలీ చేరుకుంది. అక్కడ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు యత్నించారు. వారిని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని బ్యానర్‌ను, దిష్టిబొమ్మను తొలగించి దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఇది ఘర్షణకు దారితీసింది. దాదాపు 15 నిముషాలపాటు సాగిన ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. ఈ యుద్ధకాండతో భీతిల్లిన ర్యాలీలోని విద్యార్థులు దూరంగా పరుగెత్తారు. తమపై టీఆర్ఎస్ దాడి చేసిందంటూ టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కొద్దిసేపటి తరువాత, పోలీస్ స్టేష న్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ కూర్చున్నారు. ఆ తరువాత, సీఐ రమేష్‌కు వినతిపత్రమిచ్చారు. ఈ ర్యాలీలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య రమేష్ నాయక్, నాయకులు కాడారి నటరాజ్, రమేష్‌బాబు, జీవన్‌సాగర్, రత్నాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని అడ్డుకున్న వారిలో టీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, జానీపాష, బానోత్ హరిప్రియ, బానోత్ హరిసింగ్ నాయక్, పరుచూరి వెంకటేశ్వర్లు, ముద్రగడ వంశీ, కావేటి రమేష్, అనిల్ పాసీ తదితరులు ఉన్నారు. సీఎం మెప్పు కోసమే... టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య ఇల్లెందు: టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ నాయకులపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ గూండాలు దాడి చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య చెప్పారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిం చారు. ఆయన శనివారం సాయంత్రం ఇక్కడ డీఎస్పీ వీరేశ్వరరావును కలిశారు. టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా చూడాలన్నారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ దాడికి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ నాయకత్వం వహించడం దారుణమన్నారు. సీఎం మెప్పు కోసమే దిష్టిబొమ్మను దహనాన్ని దిండిగల అడ్డుకున్నారని అన్నారు. -
నేడు ఏబీవీపీ రాస్తారోకో
సాక్షి, హైదరాబాద్: స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫాస్ట్ పథకం విధివిధానాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు (మంగళవారం) తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి జమాల్పూర్ నిరంజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన రూ.1,250 కోట్లకుగాను కేవలం రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. మిగతా రూ.750 కోట్లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. -
వివాదాల సుడిగుండాలు
తెలంగాణలో స్థానికత 1956కు ముందు నుంచి తెలంగాణలో నివసిస్తున్న వారిని వూత్రమే స్థానికులుగా పరిగణిస్తామని, వారి కుటుంబాల పిల్లలకు మాత్రమే ఫీజుల చెల్లింపు పథకాన్ని (ఫాస్ట్) వర్తింపజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చట్ట విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికతను నిర్ధారించి ఫాస్ట్‌ను వర్తింపజేయాలంటోంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంలేదు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి 1956 తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ కుటుంబాలకు చెందిన పేద విద్యార్థుల పరిస్థితి రెండు ప్రభుత్వాల వ్యవహారశైలి వల్ల ఇబ్బందికరంగా మారింది. 1956 స్థానికత అంశంపై తెలంగాణ ప్రభుత్వం అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఉత్తర్వులపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో చేరినా ఫీజు చెల్లించే స్తోమత లేక చాలామంది చదువుకు స్వస్తి చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారుల పంపిణీ అఖిల భారత సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియ కూడా ఆరు నెలల సుదీర్ఘ కాలంలో పూర్తికాలేదు. ఐఏఎస్‌లు చాలనందునే అభివృద్ధి పనుల విషయంలోనూ, విధాన నిర్ణయాల అమల్లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఈ సమస్య లేకపోతే రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేవారమని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అధికారుల పంపిణీ విషయంలో ప్రత్యూష్‌సిన్హా చేసిన కసరత్తుపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునఃపరిశీలించాలని ఫైలును వెనక్కు పంపినట్లు ఢిల్లీ అధికార వర్గాలు అంటున్నాయి. ఎన్జీ రంగా వర్సిటీ పేరు మార్పు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని విభజించకముందే తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టి ఉన్నతాధికారిని కూడా నియమించడం వివాదాస్పదంగా మారింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ద్రవిడ యూనివర్సిటీల విభజన విషయంలో ఇరు ప్రభుత్వాలు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లే వ్యవసాయ విశ్వవిద్యాలయం విషయంలోనూ తీసుకుంటే సమస్యే ఉండేది కాదనే అభిప్రాయం రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల్లో ఉంది. నాక్‌పై సీఎంల బెట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ విషయంలోనూ ఇరు రాష్ట్రాలు బెట్టుకుపోతున్నాయి. సహకార సంస్థ కింద ఏర్పాటైన నాక్‌లో డెరైక్టర్‌గా భిక్షమయ్యను నియమించి ఆ సంస్థను తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకునే యత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి శాంబాబ్‌ను డెరైక్టర్ జనరల్‌గా నియమించడం, ఆయన బాధ్యతలు తీసుకోవడానికి వెళ్లడంతో అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాక్ పాలక మండలిని పునర్వ్యవస్థీకరిస్తూ.. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం అధ్యక్షతన పాలక మండలిని నియమించింది. తరచుగా సీఎం కేసీఆర్ నాక్లోనే కూర్చుని వ్యూహాలు రచిస్తుండడం గమనార్హం. రాష్ట్ర ఉద్యోగుల విభజన రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి కమల్‌నాథన్ కమిటీ గత ఆరు నెలల కాలంలో ఎన్నిసార్లు సమావేశమైనా ఇంకా ఈ కసరత్తు పూర్తికాలేదు. వచ్చే మార్చి నాటికి గాని పూర్తి చేయలేమని స్వయంగా కమల్‌నాథన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వ రంగ సంస్థలపై వైరం రాష్ట్ర పునర్వ్యవస్థీరణ చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో వాటాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు అకౌంట్ల ఫ్రీజ్ వల్ల అనేక సవుస్యలు ఎదుర్కొంటున్నాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిదో షెడ్యూలులో ఉన్న సంస్థల ఆస్తుల వాటాల విషయంలోనూ, విభజన పూర్తయ్యే వరకూ సమన్వయంతో నడుపుకునే అంశంలోనూ రెండు రాష్ట్రాలు సరైన విధంగా వ్యవహరించలేకపోయాయి. కార్మిక సంక్షేమ నిధికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లలో రూ. 428 కోట్ల మొత్తాన్ని, ఇరు రాష్ట్రాలకు చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి చెందిన రూ. 28 కోట్లను హైదరాబాద్ బ్యాంకు నుంచి తమకు తెలపకుండా విజయవాడలోని బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించిందంటూ తెలంగాణ ప్రభుత్వం ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందంటే రెండు రాష్ట్రాల మధ్య వైరం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. దీని ప్రభావం తొమ్మిదో షెడ్యూలులోని ప్రభుత్వ రంగ సంస్థలపై పడింది. నిథిమ్పై పంతాలు నిథిమ్ సంస్థ విషయంలో ఇరు రాష్ట్రాలు పంతాలకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి చందనాఖన్ నిథిమ్‌లో బాధ్యతలు నిర్వహించడానికి వెళ్లడంతో ఆమెను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకోవడం, ఆమె అక్కడే ధర్నా చేయడం వంటి వివాదాలు తలెత్తాయి. గవర్నర్ అధికారాలపైనా రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండటం, ఆయనకు విశేషాధికారాలు కల్పించడంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఏకంగా పార్లమెంట్‌లోనే తన నిరసన తెలియజేసింది. టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పైనా తాజాగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిస్థితి ప్రస్తుతం ఉభయ రాష్ట్రాలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒకటే పనిచేస్తోంది. ఇప్పటికే దీన్ని విభజించాలని తెలంగాణ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరో రెండు మాసాల్లో ఈ విభజన జరగొచ్చు. అయితే పేషెంట్లకు రోగనిర్ధారణ, ఆస్పత్రులకు ఆర్థిక అనుమతులు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ విడిపోతే ట్రస్ట్ కార్యాలయ భవనం తెలంగాణకు వెళుతుంది. ఆ తర్వాత ఇలాంటి సాంకేతిక సంపత్తిని ఏర్పాటు చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. -
ఫాస్ట్ వెరీ స్లో
ఇందూరు/బాన్సువాడ : తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ‘ఫాస్ట్’ పథ కం అమలులో జాప్యం జరగడం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యా సంవత్సరం గడిచిపోతుండడం తో కళాశాలలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఫాస్ట్ పథకానికి సంబంధించి ఇప్పటికీ దరఖాస్తు తేదీని ప్రకటించకపోవడంతో ఏం చే యాలో తెలియక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. సర్కారు తెలంగాణ విద్యార్థుల కోసం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకాన్ని తీసుకువచ్చినా, దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. మార్గదర్శకాలు విడుదలయ్యేలోగా రెవెన్యూ అధికారుల నుంచి కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందాలని సర్కారు నెల క్రితం సూచించింది. దరఖాస్తులూ స్వీకరించింది. తీరా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అష్టకష్టాలు పడి సర్టిఫికెట్లు పొంది నా, ప్రభుత్వం మళ్లీ ఏ నిబంధనను కొత్తగా తెరపైకి తెస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. 2014-15 ఉపకారవేతనాలు అందుతాయో లేదోనని మానసి క క్షోభకు గురవుతున్నారు. జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌నకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 74 వేల మంది ఉన్నారు. ఇందులో 38 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి చూస్తుండగా మరో 36 వేల మంది తమ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లను రెన్యువల్ చేసుకోవడానికి నిరీక్షిస్తున్నారు. దర ఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఇబ్బంది పెడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. గతేడాది ‘నిధులూ’ అర కొరగానే విడుదలయ్యాయి. అవీ కళాశాలలకు చేరలేదు. ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మిగిలిన నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చె బుతున్నారు. ఆలస్యమైతే 2014-15 విద్యా సంవత్సరానికిగాను ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసింది. మరిం త ఆలస్యం చేస్తే విద్యార్థులకు తిప్పలు తప్పవు. విద్యాసంవత్సరం ముగింపునకు కనీసం ఆరు నెలల ముందు దరఖాస్తు చేసుకుంటేనే సరైన సమయంలో స్కాలర్షిప్ గాని, ఫీజు రీయింబర్స్మెంట్ గాని అందే అవకాశం ఉంటుంది. ఆరు నెలల ముందు అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు కుల, ఆదాయ, స్థానికత, ఆధార్, తదితర సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. వాటి కోసం మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. సర్వర్ బిజీతో అవస్థలు అదనం. తర్వాత సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అలా చేసిన తర్వాత కళాశాలల నుంచి హార్డ్ కాపీలు జిల్లా శాఖకు అందడం, అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపడం వంటి ప్రక్రియ ముగిసే సరికి నెలన్నర పడుతుంది. గతంలో ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేవారు. కొత్తగా ‘ఫాస్ట్’ పథకం వచ్చిన నేపథ్యం లో ఆ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. ప్రభుత్వం ఇప్పటికీ దరఖాస్తు తేదీలను ప్రకటించలేదు. సర్కారు దరఖాస్తు తేదీలను ఎప్పుడు ప్రకటిస్తుందో కూడా తెలియదు. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు.. నూతన ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకోసం వేచి చూస్తున్నారు. -
‘ఫాస్ట్’ను పక్కన పెట్టేశారు..!
ఘట్కేసర్ టౌన్: ‘ఫాస్ట్’ పథకంలో భాగంగా విద్యార్థులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన నేటికీ ప్రారంభం కాలేదు. ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) కార్యక్రమంలో భా గంగా విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సూచించింది. మం డలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఫాస్ట్ పత్రాల కోసం మండలంలోని విద్యార్థు ల నుంచి 15,479 దరఖాస్తులందాయి. పింఛన్ల పంపిణీలో అధికారులు బిజీ తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లు, రేషన్‌కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అక్టోబర్ 5 నుంచి 30వరకు గడువునిచ్చింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో లక్షల సంఖ్యలో దరఖాస్తులందాయి. మొదటగా పింఛన్ల అర్హులను తేల్చలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఆ పనిమొదలుపెట్టారు. పింఛన్లకు మండలంలో 11,894 దరఖాస్తులందగా అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపి అర్హుల జాబితా సిద్ధం చేశారు. వారికి పింఛన్లు అందజేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అనంతరం ఆహార భద్రతా కార్డులకు సంబంధించి అధికారులు విచారణ జరపాల్సి ఉంది. ఆహార భద్రతా కార్డుల కోసం మండలంలో 45,402 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను తేల్చిన తర్వాతే అధికారయంత్రాంగం ‘ఫాస్ట్’ దరఖాస్తులను విచారించే అవకాశం కనబడుతోంది. ఆందోళనలో విద్యార్థులు ఫాస్ట్ దరఖాస్తులు ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో మూలుగుతున్నాయి. ప్రస్తుతం పలు కోర్సులకు సంబంధించి విద్యార్థులకు కౌన్సిలింగ్ కొనసాగుతోంది. దీనికోసం విద్యార్థులకు నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. తమ దరఖాస్తులను పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేయాలని అధికారులను విద్యార్థులు సంప్రదిస్తే ఆహార భద్రత కార్డులు, పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో తాము బిజీగా ఉన్నామని, ఇప్పట్లో ‘ఫాస్ట్’ దరఖాస్తుల పరిశీలన సాధ్యం కాదని అధికారులు తేల్చిచెబుతున్నారు. కౌన్సిలింగ్‌కు అవసరమైన పత్రాలు లేకపోతే తము సీటు దక్కుతుందో లేదో, ఉపకార వేతనాలను కోల్పోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలో విద్యార్థులున్నారు. ఫాస్ట్ పథకంలో భాగంగా ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ఆదేశాలు అందిన అనంతరం పత్రాలను జారీచేస్తామని తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. -
బో‘ధనం’ వచ్చిందోచ్..
ఆదిలాబాద్ రూరల్ : పేద విద్యార్థుల చదువులకు లైన్ క్లియర్ అయింది. ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్‌ల విడుదలతో కొంత ఊరట లభించింది. తెలంగాణ విద్యార్థులకు ఫాస్ట్ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పి ఇన్నాళ్లు సందిగ్ధంలో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేసింది. దీంతో ఇన్ని రోజులుగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. విద్యార్థులతోపాటు కాళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 15రోజుల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు నిధులను కేటాయిస్తూ శని వారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కలిపి మొత్తం జిల్లాకు రూ. 8.23 కోట్లు మంజూరు చేశారు. జిల్లాకు ఎస్సీ, బీసీ, ఈబీ సీ విద్యార్థులకు సంబంధించి 28 కోట్లు అవసరం ఉండగా మొదటి దశగా 30 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగితావి ఒకటి లేదా రెండవ దశల్లో వచ్చే అవకాశాలున్నాయాని అధికారులు చెబుతున్నారు. 5వేల మంది ఎస్సీ విద్యార్థులకు రూ.8.02 కోట్లు అవసరం ఉండగా, ప్రస్తుతం ఆర్టీఎఫ్ కింద రూ.1.05 కోట్లు, ఎంటీఎఫ్ కింద రూ. 67లక్షలు మొత్తం 1.72 కోట్లు విడుదలయ్యాయి. 9వేల మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు 28.21 కోట్లు అవసరం ఉండగా, వారికి ప్రస్తుతం ఆర్టీఎఫ్ కింద రూ.17.31 కోట్లు అవసరం కాగా రూ.3.81 కోట్లు, ఎంటీఎఫ్ కింద రూ.10.90 కోట్లు అవసరం ఉండగా రూ. 2.70 కోట్లు విడుదల చేశారు. మొత్తం 6.51 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ నిధులను జిల్లా సంక్షేమ అధికారులు మొదటగా స్వీకరించి. తర్వాత బిల్లులను ట్రెజరీకి అందజేస్తారు. వారు బిల్లులను పాస్ చేసి బ్యాంకులలో వేస్తారు. బ్యాంకు నుంచి విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల ఖాతాలలో జమ అవుతాయి. ఇదంతా జరగడానికి వారం, పది రోజులు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 15 రోజుల్లోగా విద్యార్థుల ఖాతాల్లోకి.. - అంకం శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ పథకం కింద విద్యార్థులకు విడుదల చేసిన నిధులను వారి ఖాతాల్లో జమ చేయడానికి 15 రోజుల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం కొంత వరకు మాత్రమే నిధులు వచ్చాయి. వచ్చిన డబ్బులను వారివారి ఖాతాల్లో జమ చేస్తాం. -
ఫీజులు వచ్చాయోచ్
* జిల్లాకు రూ. 11.93 కోట్లు * రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు * వారం రోజులలో విద్యార్థుల ఖాతాలలోకి * 30 శాతం మాత్రమే విడుదల * మిగతావి రెండో దశలో! ఇందూరు : పేద విద్యార్థుల చదువులకు లైన్ క్లియరైంది. తెలంగాణ విద్యార్థులకే ఫాస్ట్ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పి ఇన్నాళ్లు స ందిగ్ధంలో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేసింది. దీంతో ఇన్ని రోజులుగా విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 15 రోజుల క్రితమే రాష్ర్టవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా నిధు లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు నిధులను కేటాయిస్తూ శనివారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కలిపి మొత్తంగా జిల్లాకు రూ.11.93 కోట్లను మంజూరు చేశారు. అయితే, జిల్లాకు రూ. 30.50 కోట్లు అవసరం ఉం డగా మొదటి దశగా 30 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగతావి ఒకటి లేదా రెండు దశలలో వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 1400 మంది ఎస్సీ విద్యార్థులకు రూ. 3 కోట్లు అవసరం ఉండగా, రూ.1. 28 కోట్లు విడుదలయ్యాయి. 7,500 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.3.50 కోట్లు అవసరం కాగా, రూ.1.65 కోట్లు, బీసీ, ఈబీసీలలో 51వేల మంది విద్యార్థులకు రూ.24 కోట్లు అవసరం ఉండగా రూ. 9 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను జిల్లా సంక్షేమాధికారులు మొదటగా స్వీకరించి, తరువాత బిల్లులను ట్రెజరీకి అందజేస్తారు. వారు బిల్లులను పాస్ చేసి బ్యాంకులలో వేస్తారు. బ్యాంకు నుంచి విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల ఖాతాలలో జమ అవుతాయి. ఇందతా జరగడానికి వారం, పది రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. -
‘ఫాస్ట్’..స్లో
ఖమ్మం హవేలి: ఫీజుల చెల్లింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పథకం అమలు కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. గత విద్యా సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న ఫీజుల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ‘ఫాస్ట్’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్‌కమిటీని వేసింది. ఈ కమిటీ నిర్ణయం కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మార్గదర్శకాలు వస్తేనే ఈ విద్యా సంవత్సరం ఫీజులు మంజూరయ్యే అవకాశం ఉంది. పైగా గత విద్యా సంవత్సరం ఫీజులు కూడా పెండింగ్ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. యుటిలైజేషన్ సర్టిఫికెట్ల సమర్పణలో నిర్లక్ష్యం జిల్లాలోని 410 కళాశాలలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల వివరాలు పొందుపరిచిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఆన్లైన్ ద్వారా కూడా వివరాలు పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినా పెద్దగా స్పందనలేదు. కళాశాలలు ఆన్లైన్లో డేటా ఇచ్చి అందుకు సంబంధించిన కాపీలు తీయాలి. ప్రిన్సిపాల్ సంతకం పెట్టించి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ సంక్షేమశాఖలకు వీటిని అందజేయాలి. కానీ జిల్లాలో ఉన్న పలు కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇందులో ప్రభుత్వ కళాశాలలు కూడా ఉండటం గమనార్హం. సర్టిఫికెట్ల జారీలో వివిధ శాఖల జాప్యం 2007-08 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.277కోట్ల ఫీజులను ప్రభుత్వం రీయింబర్స్ చేసింది. దీనిలో రూ.212 కోట్లకు మాత్రమే కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చాయి. మరో రూ.65 కోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు బీసీ సంక్షేమశాఖకు అందాల్సి ఉంది. మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా విద్యార్థులకు రూ.6 కోట్ల వరకు ఫీజులు వచ్చాయి. ఇందులో రూ.1.2 కోట్లకు మాత్రమే కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.220 కోట్ల ఫీజులు వచ్చా యి. రూ.40కోట్లకు కళాశాలల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఈ శాఖకు అందాల్సి ఉంది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు నిర్లక్ష్యం వీడితే గత విద్యాసంవత్సరం పెండింగ్‌లో ఉన్న ఫీజులు ప్రభుత్వం నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరం ఎస్సీ విద్యార్థులకు రూ.36 కోట్లకు గాను రూ.26 కోట్లు రాగా మరో రూ.10 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మైనారిటీ విద్యార్థులకు రూ.1.33కోట్లకు రూ.1.13కోట్లు వచ్చాయి. ఇంకా రూ.20 లక్షలు రావాల్సి ఉంది. బీసీ విద్యార్థులకు రూ.17 కోట్లు, ఈబీసీ విద్యార్థులకు రూ.6 కోట్లు రావాల్సి ఉంది. గత విద్యా సంవత్సరానికి పెండింగ్‌లో ఉన్న ఫీజులను వెంటనే విడుదల చేయడంతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకం అమలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థుల పాట్లు.. ఫాస్ట్ పథకానికి రేషన్‌కార్డుతో లింక్ తొలగించి విద్యార్థులకు కొత్తగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ధ్రువపత్రాల కోసం విద్యార్థులు అనేక పాట్లు పడుతున్నారు. పాత ధ్రువీకరణపత్రాల స్థానంలో కొత్త పత్రాలు పొందాలని సూచించడంతో విద్యార్థులు తరగతులు మానుకొని తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ధ్రువీకరణ పత్రాల జారీలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం పూర్తయినా ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు జాప్యమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
..ఇలా దరఖాస్తు చేసుకోండి
పింఛన్లు, ఆహార భద్రత కార్డులు, ఫాస్ట్ పథకం కోసం అర్హులైన ప్రజలందరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, దరఖాస్తుల స్వీకరణ బాధ్యతలను గ్రామస్థాయిలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులు, అర్బన్ పరిధిలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ సిబ్బందికి అప్పగించారు. అయితే దరఖాస్తులను తెల్లకాగితంపై మాత్రమే రాసి ఇవ్వాలని అధికారులు చెబుతుండడంతో ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు. అర్జీలు ఇచ్చే విషయంపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించకపోవడంతో కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. అసలు దరఖాస్తులు వేటికోసం చేయాలి... ఎవరు చేయాలి... ఎలా చేయాలి.. అనే విషయాలను ఓసారి పరిశీలిస్తే.. నల్లగొండ అర్జీలు ఎందుకోసం... ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లు, ఆహార భద్రతకార్డులు, నిరుపేద విద్యార్థులు ‘ఫాస్ట్’ పథకం కింద ఆర్థికసాయం పొందేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిలో ప్రతి పథకం కోసం కుటుంబయజమాని స్వయ ంగా.. లేకుంటే కుటుంబసభ్యుల ద్వారా ద రఖాస్తులు అందజేయవచ్చు. ఒక్కో పథకానికి కుటుంబసభ్యులు వేర్వేరుగా అర్జీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక కుటుంబానికి ఆహార భద్రతకార్డు, ఇంట్లో ఒకరికి పింఛన్ కావాలంటే రెండింటి కోసం వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాలి. అలాగే ఫాస్ట్ పథకం కోసం కులం, నివాసం సర్టిఫికెట్‌కు ఒకటి, ఆదాయం ధ్రువీకరణ పత్రంకోసం మరొకటి ఇవ్వాలి. తెల్లకాగితం... ఆధార్ నంబర్ పింఛన్లు, ఆహార భద్రతకార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రత్యేకంగా నమూనా అవసరంలేదు. తెల్లకాగితంపై య జమాని కుటుంబవివరాలు రాసి దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. అయితే కుటుంబంలో ఎంతమందికి ఆహార భద్రతకార్డు కావా లో.. వారి పేర్లు, ఆధార్ నంబర్లు దరఖాస్తులో రాయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ విషయంలో ఈ- ఆధార్ నంబర్ కాకుండా శాశ్వత ఆధార్ నంబర్ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఫొటోలు, ఇతర జిరాక్స్‌లు అవసరంలేదు. ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం.. ఫాస్ట్ పథకం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందాలనుకునే విద్యార్థులు ప్రత్యేకంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్-5 ప్రకారం తయారుచేసిన నూతన నమూనా పత్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫారాలు ప్రస్తుతం అన్ని జిరాక్స్ సెంటర్లలో అందుబాటులో ఉంచినట్లు హన్మకొండ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. అలాగే రేషన్‌కార్డు జిరాక్స్ కాపీని కూడా దరఖాస్తుకు జతచేయాలని సూచించారు. వీరు అనర్హులు... సంక్షేమ పథకాలకు అర్హులను ఎలా గుర్తించాలనే విషయానికి సంబంధించిన నియమ నిబంధనలను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. ఇందులో 5ఎకరాలకంటే ఎక్కువగా సాగుభూములున్న రైతులు, ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్, అవుట్సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధి పొందుతున్నవారు, రైస్‌మిల్లులు, పెట్రోల్ పంపులు, ఇతర షాపులు ఉన్నవారు ప్రభుత్వ పథకాలకు అనర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. అలాగే ఫోర్‌వీలర్ వాహనాలు ఉన్నవారు కూడా అనర్హులు. పథకాల వర్తింపు ఇదీ.. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ వృద్ధాప్యంలో ఉంటే భార్యకు మాత్రమే పింఛన్ ఇవ్వనున్నారు. వీరితోపాటు వికలాంగులు, వితంతువులు ఉంటే వారికి కూడా పింఛన్ ఇస్తారు. 60 ఏళ్లు దాటిన వారు మాత్రమే వృద్ధాప్య పింఛన్ కు అర్హులు. వయస్సు నిర్ధారణ విషయంలో విచారణ అధికారిదే తుది నిర్ణయం. వికలాంగులు పింఛన్ల కోసం సదరం సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ఇవ్వాలి. పైవిషయాలు అన్నింటితోపాటు కుటుంబ స్థితిగతుల ఆదారంగా అర్హతను నిర్ధారించే అధికారం విచారణ అధికారి, పర్యవేక్షణ అధికారులకు మాత్రమే ఉంటుంది. దరఖాస్తు చేసే విధానం.. తెల్లకాగితంపై కుటుంబ వివరాలు తెలియజేయాలి. ఆధార్ నంబర్ తప్పనిసరిగా రాయాలి. ఇంటి చిరునామా, సెల్ నంబర్ ఇవ్వాలి. ప్రతి పథకం కోసం వే ర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఆదాయం సర్టిఫికెట్ కోసం అధికారులు చెప్పిన నమూనా పత్రంలో వివరాలు ఇవ్వాలి. అలాగే దానివెంట రేషన్‌కార్డు జిరాక్స్ కాపీని జతచేయాలి. సర్వే సమాచారంతో లింకు.. ప్రస్తుతం తీసుకుంటున్న దరఖాస్తులు గతంలో సమగ్ర కుటుంబ సర్వే(ఎస్కేఎస్) సమయంలో సేకరించిన వివరాల ఆధారంగా పరిశీలిస్తారు. వాటిలోని వివరా లు పరిశీలించి లబ్ధిదారుల అర్హతను నిర్ధారిస్తారు. -
'ఫాస్ట్' పథకంపై హైకోర్టులో విచారణ
-
‘ఫాస్ట్’ కోసం నిరీక్షణ
ఖమ్మం హవేలి: తెలంగాణ విద్యార్థుల ఫీజులు చెల్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫాస్ట్’ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం అమలుకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు కాలేదు. పైగా గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా పెండింగ్‌లో ఉన్న ఫీజులు ప్రభుత్వం నుంచి రాలేదు. విద్యార్థుల స్థానికతకు సంబంధించి ఇంకా కచ్చితమైన నిర్ణయం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 410 కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మార్గదర్శకాలు వెలువడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల వివరాలు పొందుపరిచిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఆన్లైన్ ద్వారా వివరాలు పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కళాశాలలు ఆన్లైన్లో డేటా ఇచ్చి అందుకు సంబంధించిన కాపీలు తీయాలి. ప్రిన్సిపాల్ సంతకం పెట్టి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ సంక్షేమశాఖలకు వీటిని అందజేయాలి. కానీ జిల్లాలో ఉన్న కళాశాలల్లో సుమారు 100 కాలేజీలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇందులో ప్రభుత్వ కళాశాలలు కూడా ఉండటం గమనార్హం. 2007-08 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు బీసీ సంక్షేమశాఖ ద్వారా బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.277 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం చెల్లించింది. రూ.212 కోట్లకు సంబంధించి కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చాయి. మరో రూ.65 కోట్లకు సంబంధించి బీసీ సంక్షేమశాఖకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కళాశాలల నుంచి రావాల్సి ఉంది. మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా మైనారిటీ విద్యార్థులకు రూ.6 కోట్ల వరకు ఫీజులు వచ్చాయి. ఇందులో రూ.1.2 కోట్లకు సంబంధించి కళాశాలలు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.220 కోట్ల ఫీజులు వచ్చాయి. వీటిలో రూ.40 కోట్లకు కళాశాలల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఈ శాఖకు అందాల్సి ఉంది. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు నిర్లక్ష్యం వీడితే గత విద్యాసంవత్సరం పెండింగ్‌లో ఉన్న ఫీజులు విడుదల అయ్యే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులకు రూ.36 కోట్లకు గాను రూ.26 కోట్లు రాగా మరో రూ.10 కోట్లు రావాల్సి ఉంది. మైనారిటీ విద్యార్థులకు రూ.1.33 కోట్లకు రూ.1.13 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.20 లక్షలు రావాల్సి ఉంది. బీసీ విద్యార్థులకు రూ.17కోట్లు, ఈబీసీ విద్యార్థులకు రూ.6 కోట్లు రావాల్సి ఉంది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజులతో పాటు కొత్త పథకం వేగంగా అమలు కావాలంటే కళాశాలలు వెంటనే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందజేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.