
టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల..డిష్యుం..డిష్యుం..
ఇల్లెందు: టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకలు, కార్యకర్తలు శనివారం ఇక్కడ నడి వీధిలో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన కొందరికి గాయూలయ్యూరుు. ఆ తరువాత, పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
అసలేమైందంటే...
ఫాస్ట్ పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్, టీడీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం జగదాంబ సెం టర్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు సీఎం దిష్టిబొమ్మతో ర్యాలీగా జగదాంబ సెంట ర్ వరకు వచ్చారు. జగదాంబ సెంటర్‌లోనే ఉన్న టీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జానీపాష తదితరులు ఉన్నారు. వారు టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుల వద్దకు వచ్చి, సీఎం దిష్టిబొమ్మను దహనం చేయవద్దని కోరారు. దీనిని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు పట్టించుకోకుండా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతి రేకంగా నినాదాలిస్తూ ముందుకు కదిలారు. వారిపై దిండిగల రాజేందర్, జానీపాష, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తరువాత, ఆ ర్యాలీకన్నా ముందే పాత బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. కొద్దిసేపటి తరువాత అక్కడకు ర్యాలీ చేరుకుంది. అక్కడ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు యత్నించారు. వారిని టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుని బ్యానర్‌ను, దిష్టిబొమ్మను తొలగించి దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఇది ఘర్షణకు దారితీసింది. దాదాపు 15 నిముషాలపాటు సాగిన ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. ఈ యుద్ధకాండతో భీతిల్లిన ర్యాలీలోని విద్యార్థులు దూరంగా పరుగెత్తారు.
తమపై టీఆర్‌ఎస్ దాడి చేసిందంటూ టీఎన్‌ఎస్‌ఎఫ్, టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కొద్దిసేపటి తరువాత, పోలీస్ స్టేష న్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ కూర్చున్నారు. ఆ తరువాత, సీఐ రమేష్‌కు వినతిపత్రమిచ్చారు. ఈ ర్యాలీలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య రమేష్ నాయక్, నాయకులు కాడారి నటరాజ్, రమేష్‌బాబు, జీవన్‌సాగర్, రత్నాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని అడ్డుకున్న వారిలో టీఆర్‌ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, జానీపాష, బానోత్ హరిప్రియ, బానోత్ హరిసింగ్ నాయక్, పరుచూరి వెంకటేశ్వర్లు, ముద్రగడ వంశీ, కావేటి రమేష్, అనిల్ పాసీ తదితరులు ఉన్నారు.
సీఎం మెప్పు కోసమే...
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య
ఇల్లెందు: టీఎన్‌ఎస్‌ఎఫ్, టీడీపీ నాయకులపై టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ గూండాలు దాడి చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య చెప్పారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిం చారు. ఆయన శనివారం సాయంత్రం ఇక్కడ డీఎస్పీ వీరేశ్వరరావును కలిశారు. టీఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా చూడాలన్నారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ దాడికి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ నాయకత్వం వహించడం దారుణమన్నారు. సీఎం మెప్పు కోసమే దిష్టిబొమ్మను దహనాన్ని దిండిగల అడ్డుకున్నారని అన్నారు.