టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు
భగ్గుమన్న రాజకీయ ఘర్షణలు
చింతకాని : మండలంలోని వందనం గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా బుధవారం అర్ధరాత్రి ఘర్షణలు జరిగి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. టీఆర్‌ఎస్ గ్రామ కమిటీని ఎంపిక చేసేందుకు మూడు రోజుల క్రితం మండల నాయకులు వందనం గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు ఒక వర్గంగా, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు మరోవర్గంగా ఉండి తమ అభ్యర్థినే గ్రామ అధ్యక్షుడిగా నియమించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఎన్నిక వారుుదా వేశారు.
మరోసారి ఘర్షణ...
ఈ విషయంపై బుధవారం మధ్యాహ్నం టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కార్యకర్త ఒకరు సీపీఎం నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి వారిని తిడుతుండగా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో సీపీఐ నాయకులు జోక్యం చేసుకోవడంతో గొడవకు దారితీసింది. ఇరువర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాల వారిని విచారించిన పోలీసులు పూచీకత్తుపై వారిని బుధ వారం రాత్రి విడిచి పెట్టారు.
అర్ధరాత్రి గ్రామంలో దాడులు..
స్టేషన్ నుంచి గ్రామానికి వెళ్లిన సీపీఐ నాయకులు ఒక వర్గం టీఆర్‌ఎస్ నాయకులు కలిసి బుధవారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని ఎస్సీ కాలనీలో టీఆర్‌ఎస్‌లోని మరోవర్గం నాయకుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నారపోగు ప్రభాకర్ ఇల్లు ధ్వంసం కావడంతో పాటు అతని భార్య వెంకమ్మ, మరో వ్యక్తి ప్రవీణ్‌లకు గాయూలయ్యూరుు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
గురువారం ఆ గ్రామాన్ని వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి సందర్శించారు. ఎటువంటి సంఘటనలు జరుకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకోవటంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వైరా సబ్‌డివిజన్ పరిధిలోని వైరా, మధిర సీఐలు సతీష్ చందర్‌రావు, నూనె వెంకటేశ్వర్లుతో పాటు కొణిజర్ల, తల్లాడ, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం, మధిర ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బందితో పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పికెటింగ్‌ను కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు.
తొమ్మిది మంది అరెస్ట్
వందనం గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన రాజకీయ ఘర్షణలో గ్రామానికి చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి గురువారం తెలిపారు. ఘర్షణలకు పాల్పడిన గ్రామానికి చెందిన ఆవుల నాగేశ్వరరావు, చినసైదులు, వెంకటప్పయ్య, మంగయ్య, రాజు, పడితం పుల్లయ్య, జోనెబోయిన గంగరాజు, షేక్ అమీన్‌సాహెబ్, కుర్రు తిరుపతిరావు లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
వందనంలో ఉద్రిక్తత
Published Fri, Apr 3 2015 1:49 AM | Last Updated on Mon, Sep 17 2018 4:52 PM
Advertisement
Advertisement