ఇందూరు/బాన్సువాడ : తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ‘ఫాస్ట్’ పథ కం అమలులో జాప్యం జరగడం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యా సంవత్సరం గడిచిపోతుండడం తో కళాశాలలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఫాస్ట్ పథకానికి సంబంధించి ఇప్పటికీ దరఖాస్తు తేదీని ప్రకటించకపోవడంతో ఏం చే యాలో తెలియక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. సర్కారు తెలంగాణ విద్యార్థుల కోసం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకాన్ని తీసుకువచ్చినా, దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు.
మార్గదర్శకాలు విడుదలయ్యేలోగా రెవెన్యూ అధికారుల నుంచి కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందాలని సర్కారు నెల క్రితం సూచించింది. దరఖాస్తులూ స్వీకరించింది. తీరా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అష్టకష్టాలు పడి సర్టిఫికెట్లు పొంది నా, ప్రభుత్వం మళ్లీ ఏ నిబంధనను కొత్తగా తెరపైకి తెస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. 2014-15 ఉపకారవేతనాలు అందుతాయో లేదోనని మానసి క క్షోభకు గురవుతున్నారు. జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌నకు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ విద్యార్థులు 74 వేల మంది ఉన్నారు.
ఇందులో 38 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి చూస్తుండగా మరో 36 వేల మంది తమ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను రెన్యువల్ చేసుకోవడానికి నిరీక్షిస్తున్నారు. దర ఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఇబ్బంది పెడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. గతేడాది ‘నిధులూ’ అర కొరగానే విడుదలయ్యాయి. అవీ కళాశాలలకు చేరలేదు. ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మిగిలిన నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చె బుతున్నారు.
ఆలస్యమైతే
2014-15 విద్యా సంవత్సరానికిగాను ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసింది. మరిం త ఆలస్యం చేస్తే విద్యార్థులకు తిప్పలు తప్పవు. విద్యాసంవత్సరం ముగింపునకు కనీసం ఆరు నెలల ముందు దరఖాస్తు చేసుకుంటేనే సరైన సమయంలో స్కాలర్‌షిప్ గాని, ఫీజు రీయింబర్స్‌మెంట్ గాని అందే అవకాశం ఉంటుంది. ఆరు నెలల ముందు అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు కుల, ఆదాయ, స్థానికత, ఆధార్, తదితర సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. వాటి కోసం మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. సర్వర్ బిజీతో అవస్థలు అదనం. తర్వాత సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
అలా చేసిన తర్వాత కళాశాలల నుంచి హార్డ్ కాపీలు జిల్లా శాఖకు అందడం, అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపడం వంటి ప్రక్రియ ముగిసే సరికి నెలన్నర పడుతుంది. గతంలో ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేవారు. కొత్తగా ‘ఫాస్ట్’ పథకం వచ్చిన నేపథ్యం లో ఆ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. ప్రభుత్వం ఇప్పటికీ దరఖాస్తు తేదీలను ప్రకటించలేదు. సర్కారు దరఖాస్తు తేదీలను ఎప్పుడు ప్రకటిస్తుందో కూడా తెలియదు. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు.. నూతన ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకోసం వేచి చూస్తున్నారు.
ఫాస్ట్ వెరీ స్లో
Published Thu, Nov 27 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement
Advertisement