Reimbursement fees
-
విద్య, సామాజిక న్యాయానికే పోరు యాత్ర
మన్సూరాబాద్: చదువు, సామాజిక న్యాయ సాధన కోసం బీసీ విద్యార్థి, యువజనుల పోరుయాత్రను నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పాలమూరు నుంచి పట్నం వరకు చేపడుతున్న పోరుయాత్రను శుక్రవారం ఎల్బీనగర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, కాసోజు శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మళ్లీ రోడ్డు ఎక్కి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు తెలంగాణ సర్కార్ భరోసా కల్పించడంలో విఫలమైందని, బీసీ విద్యార్థులపై కక్షగట్టి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు ఇతర వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేసి, బీసీ విద్యార్థులకు మూడేళ్లయినా విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులను పెంచిందని, కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచకుండా బీసీ విద్యార్థులపై భారం వేసిందని విమర్శించారు. అన్ని జిల్లాల్లో జనవరి 8 వరకు యాత్ర సాగుతుందని జాజుల పేర్కొన్నారు. -
జగనన్న విదేశీ విద్యాదీవెన.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
నెల్లూరు(వేదాయపాళెం): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురువారం జిల్లా బీసీ సంక్షేమశాఖ సాధికారత అధికారి వై.వెంకటయ్య తెలిపారు. విద్యార్థులను అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదవండి: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం వరంగా మారింది. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి ఈ పథకంతో మేలు చేకూర్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు రూపొందించింది. వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్ ర్యాంకింగ్‌లో ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. క్యూస్ వరల్డ్ ర్యాకింగ్ ప్రకారం టాప్ 100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. టాప్ 100 నుంచి 200 ర్యాకింగ్‌లో ఉన్న యూనివర్సిటీల్లో సీటు పొందిన వారికి రూ.50 లక్షల వరకు ఫీజురీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తుంది. తద్వారా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతోపాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా ఫీజురీయింబర్స్‌మెంట్ వర్తింపజేయనున్నారు. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్లో 60 శాతం మార్కులు, తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సులకు నీట్లో అర్హత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ఈ ఆర్థికసాయం ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజురీయింబర్స్‌మెంట్ జమ చేస్తారు. దరఖాస్తుకు నేడు ఆఖరు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ప్రభుత్వం గుర్తించిన 200 యూనివర్సిటీల్లో సీటు సాధించి ఉండాలి. కులం, ఆదాయ సర్టిఫికెట్లు, మార్కులిస్టు తదితర వివరాలతో ఈ నెల 30వ తేదీ లోపు http:// jnanabhumi.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఈ పథకం వర్తింపజేస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలి. – వై.వెంకటయ్య, జిల్లా బీసీ సంక్షేమశాఖ, సాధికారత అధికారి -
విద్యార్థులపై టీఆర్ఎస్ శ్రేణుల పిడిగుద్దులు
సిరిసిల్ల: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో మంత్రుల పర్యటనలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై టీఆర్ఎస్ శ్రేణులు పిడిగుద్దులు కురిపించారు. పోలీసుల సాక్షిగా విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్ వద్ద మంగళవారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల శంకుస్థాపనకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు కొందరు మంత్రుల ఎదుటకు వెళ్లి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు వారిపై పిడిగుద్దులు కురి పిస్తూ, కిందపడేసి తొక్కారు. పోలీసులు అడ్డుకుంటున్నా పట్టించుకోకుండా దాడి చేశారు. వెంట పడి మరీ చితకబాదారు. కొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిపై సైతం టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో అనిల్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, 30 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ తెలిపారు. కేసులు వద్దన్న మంత్రి: నిరసన తెలిపిన ఏబీవీపీ కార్యకర్తలపై కేసులు వద్దని మంత్రి కేటీఆర్ సభాముఖంగా సిరిసిల్ల డీఎస్పీని కోరారు. ఫీజు రీయిం బర్స్మెంట్ బకాయిలు రూ.1,575 కోట్లలో ఇప్పటికే సీఎం రూ.500 కోట్లు విడుదల చేశారన్నారు. -
ఫాస్ట్ వెరీ స్లో
ఇందూరు/బాన్సువాడ : తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ‘ఫాస్ట్’ పథ కం అమలులో జాప్యం జరగడం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యా సంవత్సరం గడిచిపోతుండడం తో కళాశాలలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఫాస్ట్ పథకానికి సంబంధించి ఇప్పటికీ దరఖాస్తు తేదీని ప్రకటించకపోవడంతో ఏం చే యాలో తెలియక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. సర్కారు తెలంగాణ విద్యార్థుల కోసం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకాన్ని తీసుకువచ్చినా, దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. మార్గదర్శకాలు విడుదలయ్యేలోగా రెవెన్యూ అధికారుల నుంచి కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందాలని సర్కారు నెల క్రితం సూచించింది. దరఖాస్తులూ స్వీకరించింది. తీరా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అష్టకష్టాలు పడి సర్టిఫికెట్లు పొంది నా, ప్రభుత్వం మళ్లీ ఏ నిబంధనను కొత్తగా తెరపైకి తెస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. 2014-15 ఉపకారవేతనాలు అందుతాయో లేదోనని మానసి క క్షోభకు గురవుతున్నారు. జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌నకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 74 వేల మంది ఉన్నారు. ఇందులో 38 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి చూస్తుండగా మరో 36 వేల మంది తమ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లను రెన్యువల్ చేసుకోవడానికి నిరీక్షిస్తున్నారు. దర ఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఇబ్బంది పెడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. గతేడాది ‘నిధులూ’ అర కొరగానే విడుదలయ్యాయి. అవీ కళాశాలలకు చేరలేదు. ‘ఫాస్ట్’ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మిగిలిన నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చె బుతున్నారు. ఆలస్యమైతే 2014-15 విద్యా సంవత్సరానికిగాను ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసింది. మరిం త ఆలస్యం చేస్తే విద్యార్థులకు తిప్పలు తప్పవు. విద్యాసంవత్సరం ముగింపునకు కనీసం ఆరు నెలల ముందు దరఖాస్తు చేసుకుంటేనే సరైన సమయంలో స్కాలర్షిప్ గాని, ఫీజు రీయింబర్స్మెంట్ గాని అందే అవకాశం ఉంటుంది. ఆరు నెలల ముందు అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు కుల, ఆదాయ, స్థానికత, ఆధార్, తదితర సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. వాటి కోసం మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. సర్వర్ బిజీతో అవస్థలు అదనం. తర్వాత సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అలా చేసిన తర్వాత కళాశాలల నుంచి హార్డ్ కాపీలు జిల్లా శాఖకు అందడం, అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపడం వంటి ప్రక్రియ ముగిసే సరికి నెలన్నర పడుతుంది. గతంలో ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేవారు. కొత్తగా ‘ఫాస్ట్’ పథకం వచ్చిన నేపథ్యం లో ఆ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. ప్రభుత్వం ఇప్పటికీ దరఖాస్తు తేదీలను ప్రకటించలేదు. సర్కారు దరఖాస్తు తేదీలను ఎప్పుడు ప్రకటిస్తుందో కూడా తెలియదు. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు.. నూతన ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకోసం వేచి చూస్తున్నారు.