తొలిసారి హిందీలో
ఉభయసభల్లో ప్రసంగించనున్న గవర్నర్
బెంగళూరు : ఉభయ సభలనుద్దేశించి తొలిసారిగా గవర్నర్ వజుబాయ్ రుడాబాయి వాలా హిందీలో ప్రసంగించనున్నారని రాష్ర్ట న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర తెలిపారు. రాష్ర్ట చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. విధానసౌధలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు కర్ణాటక గవర్నర్లుగా పనిచేసిన వారిలో జయచామరాజ ఒడయార్ మాత్రమే కన్నడిగుడని తెలిపారు.
మిగిలిన వారందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని అన్నారు. అందువల్ల ఉభయసభలను ఉద్దేశించి ఆంగ్లంలో ఆయా గవర్నర్లు ప్రసంగించేవారిని గుర్తు చేశారు. ఫిబ్రవరి 2న జరగనున్న సమావేశాలకు గాను ఆంగ్లంతో పాటు కన్నడంలోనూ గవర్నర్ ప్రసంగపాఠాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. అయితే రాజభవన్ సూచన మేరకు ప్రసంగపాఠాన్ని హిందీలో తర్జుమా చేయనున్నట్లు చెప్పారు.