ministrey
-
కథలు అల్లకండి.. డీకే శివకుమార్ వార్నింగ్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఊహించని షాక్ తగిలింది. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో డీకే శివకుమార్‌పై విమర్శలు రావడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని అనవసర కథనాలు సృష్టించకూడదని వార్నింగ్ ఇచ్చారు.కొత్తగా కొలువుదీరిన శివకుమార్ ప్రభుత్వానికి ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో ముఖ్యమంత్రి తనకు బెంగళూరు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రమాణ స్వీకారం తర్వాత నీటిపారుదల మంత్రిత్వ శాఖను కేటాయించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట తప్పినందుకు గానూ తన మంత్రిత్వ శాఖకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు.దీంతో శివకుమార్ డ్యామేజ్ కంట్రోల్ పనులు చేపట్టారు. ఆయన రాజీనామాపై స్పందిస్తూ "రామలింగారెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు తన అత్యంత సన్నిహితుడు సమస్యలన్నీత్వరలోనే పరిష్కారమవుతాయి. అనవసరమైన కథలు సృష్టించకండి అవన్నీ నిరాధారమవుతాయి.ఇప్పుడు సమస్యలన్నీ సర్ధుకున్నాయి" అన్నారు. అతను వాట్సాప్‌లో రాజీనామా పంపాడని పేర్కొన్నారు.కాగా నిన్న (శుక్రవారం) రాత్రి, రామలింగారెడ్డి రాజీనామా అనంతరం శివకుమార్ ఆయనతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు.ఆయనతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విధంగా మాట్లాడారు. కాగా డీకే శివకూమార్ క్యాబినేట్ బెర్తులపై మరో మంత్రి కేఎం మునియప్ప సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనకు మరింత మెరుగైన క్యాబినేట్ దక్కాల్సిందన్నారు. ప్రస్తుతం ఆయనకు సివిల్ సప్లైస్ మంత్రిత్వశాఖ కేటాయించారు. -
అమెరికాలో అక్రమ వలసదారులు.. భారత్ కీలక ప్రకటన
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఎట్టి పరిస్థితుల్లో వారు దేశంలోకి ఉండనిచ్చేది లేదంటూ ఎన్నో కఠిన నిబంధనలు తీసుకవచ్చి వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనేఅమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు భారత్ ప్రకటించింది. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు ప్రకటించారు. "2026లో ఇప్పటివరకూ 1,076 మంది బహిష్కరణకు గురయ్యారు. అదే గతేడాది మెుత్తంగా 3,567 మంది బహిష్కరణకు గురయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇది అధికమే" అని జైశ్వాల్ అన్నారు. దేశ బహిష్కరణకు గురైన వారిలో సరైన పత్రాలు లేకపోవడంతో పాటు వీసా ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఉన్నారని పేర్కొన్నారు.అక్రమ వలసల విషయమై భారత్, అమెరికా దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని అక్రమ వలసలను ఎలా అరికట్టాలి, అదే సమయంలో ఇది చట్టబద్ధమైన వలసలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా చూసుకోవాలి అనే దానిపై ఇరుదేశాలు దృష్టి సారించాయనిపేర్కొన్నారు. కాగా ఈ వారంలోనే భారత్‌కు చెందిన సుమారు 30 మంది వ్యక్తులు వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తూ అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తించారు . వీరిని త్వరలోనే దేశ బహిష్కరణకు గురిచేసే అవకాశం ఉంది. -
డాక్టర్ తంగరాజ్కు విజ్ఞానశ్రీ పురస్కారం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డాక్టర్. కె తంగరాజ్ విజ్ఞాన శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నత సేవలు అందించినందుకు గానూ కేంద్రం ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. మానవ జన్యుశాస్త్రంతో పాటు తదితర అంశాలపై డా.తంగరాజ్ విశేష పరిశోధనలు జరిపారు.డాక్టర్. తంగరాజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింటింగ్- అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ విభాగం డైరెక్టర్‌గా ఉన్నారు. ఈయన భారత జనాభాలోని జన్యు వైవిధ్యం అనే అంశంపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. వాటితో పాటు భారత ఉపఖండానికి సంబంధించిన పూర్వీకుల మూలాలు, వలసలు గురించి శాస్త్రీయంగా సమాకూర్చారు.అండమాన్ గిరిజన తెగలపై ఈయన చేసిన అధ్యయనాలు మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. వీటితో పాటు డాక్టర్ తంగరాజ్ దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే జన్యు వ్యాధులు గురించి పరిశోధనలు జరిపి వాటి నిర్ధారణ పద్ధతులు తదితర అంశాలపై కృషిచేశారు. దీంతో ఈయన సేవలకు మెచ్చిన కేంద్రప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ విజ్ఞాన శ్రీ పురస్కారానికి ఈయనను ఎంపిక చేసింది.విజ్ఞాన్ శ్రీ పురస్కారంవిజ్ఞాన్ శ్రీ పురస్కారాన్ని కేంద్రప్రభుత్వం 2024లో ప్రవేశ పెట్టింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచేవారి గౌరవార్థం ఈ వార్డును అందజేస్తారు. దీనిని నాలుగు విభాగాలుగా అందజేస్తారు.విజ్ఞాన రత్న- అత్యున్నత గౌరవం జీవిత కాల కృషికి విజ్ఞాన్ శ్రీ- మధ్యస్థాయి శాస్త్రవేత్తలకు విజ్ఞాన్ యువ- యువ శాస్త్రవేత్తలకు విజ్ఞాన్ బృందం- శాస్త్రవేత్తల బృందానికి ఇలా నాలుగు విభాగాలలో ఈ అవార్డుని అందజేస్తారు. ఈ పురస్కార ప్రధానం రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. గతంలో ఈ అవార్డును శాంతిస్వరూప్ భట్నాగర్ పేరుతో ప్రధానం చేసేవారు. -
రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఆయుధాల అప్‌గ్రేడ్
భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. భారత రక్షణ వ్యవస్థను మరింత బలపరిచేందుకు ఆధునాతన ఆయుధాల కొనుగోలుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన భేటీలో రూ.79 వేల కోట్ల విలువగల ఆయుధాల కొనుగోలుకు అనుమతులిచ్చారు.ఈ నిధులతో ఇండియన్ ఆర్మీకి సంబంధించి నాగ్ మిసైల్ సిస్టమ్ . నేవీకి సంబంధించి ల్యాండింగ్ ప్లాట్ఫార్మ్ డాక్స్ నిర్మాణం, నావల్ సర్పేస్ గన్, అడ్వాన్స్ లైట్ వెయిట్ టార్పెడో తదితర యుద్ధ సామాగ్రి కొనుగోలుచేయనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. నాగ్ క్షిపణి వ్యవస్థను ఆర్మీ వాహనాలపై మోహరిస్తారు.ఈ క్షిపణులుశత్రు ట్యాంకులు, బంకర్లు మరియు ఇతర బలవర్థకమైన గోడలను నాశనం చేయగలవు. నేవీకి సంబంధించి ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్ నిర్మించనున్నారు. సముద్రం నుండి భూమి మీద చేసే దాడులను ఇవి సులభతరం చేస్తాయి. అంతేకాకుండా ఇవి శాంతి పరిరక్షణ కార్యక్రమాలు, ఇతర సహాయం విపత్తు నిర్వహణకు ఉపయోగపడతాయి. వీటితో పాటు నావల్ సర్ఫేస్ గన్ మరియు అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పెడోలను కొనుగోలు చేయనున్నారు. ఇవి ఇది అణు మరియు తేలికపాటి జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోని దాడి చేయగలవు.ఎయిర్‌ఫోర్స్‌ని ఆధునీకరించడానికి కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్‌ను కొనుగోలు చేయనున్నారు. ఈ వ్యవస్థ విమానం టేకాఫ్, ల్యాండ్, నావిగేట్, లక్ష్యాలను గుర్తించడంతో పాటు మరియు పైలట్ లేకుండా దాడి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఆయుధాల ఆదునీకరణ కేవలం యుద్ధ సమయంలోనే కాకుండా రక్షణ, సహాయక చర్యలు, శాంతి మిషన్లు, విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొన్నారు.అంతేకాకుండా వీటిలో చాలా మట్టుకు భారత్‌లోనే తయారవుతున్నాయని దీనివల్ల మేకిన్ ఇండియాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. -
ఒంటరైన అమర్ నాథ్ రెడ్డి
చిత్తూరు: జిల్లాలోని ఏకైక ఫిరాయింపు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి మంత్రి పదవిపై ఆశలు వదులుకున్నారా? టీడీపీలో ఆయన ఒంటరి అయ్యారా? అధికారులు కూడా ఆయన వినతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా? 2019 జరిగే ఎన్నికల్లో కూడా ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదా? ఒకవేళ ఇచ్చినా గెలిచే అవకాశాలు సన్నగిల్లినట్లేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది టీడీపీలోని కొన్ని వర్గాల నుంచి. దీంతోనే దాదాపుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా పలమనేరు ఇన్చార్జ్ సుభాస్ చంద్రబోస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై సందేహ పడుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వైఎస్సార్సీపీ నుంచి ఆయనతో టీడీపీలో చేరిన కార్యకర్తలు కూడా రెండోరోజు నుంచే ఒక్కొక్కరు ఆయనను వదలి సొంత గూటికే చేరుతున్నారు. అధికారులు కూడా ఆయన చెప్పిన పనులను పక్కన పెడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోస్‌కే ప్రాధాన్యం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్్షకు తెరలేపింది. ఈ వలలో అమర్నాథ్రెడ్డి తేలికగా పడ్డారు. వైఎస్సార్ సీపీ విప్‌గా ఉంటూనే పార్టీ ఫిరాయించారు. మంత్రిపదవి ఆశ, జిల్లాను మొత్తం శాసించవచ్చనే ఒక కోరికతో ఆయన తెలుగుదేశం గూటికి జంప్ అయ్యారు. పార్టీలో చేరిన కొన్నాళ్లకే అమర్‌కు అసలు తత్వం బోధపడింది. టీడీపీ కేడర్ మొత్తం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బోస్‌కే అండగా నిలుస్తోంది. అధికారులు కూడా బోస్ చెప్పిన పనులకే ‘ఊ ’ కొడుతుండటం కూడా అమర్‌కు మింగుడు పడటం లేదు. తొలిరోజుల్లో ఇలాంటి పరిస్థితులు చూసి తనకు మంత్రి పదవి వస్తే అధికారులు, పార్టీ నాయకులు సరెండర్ అవుతారని అనుచరులతో చెప్పుకునేవారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదని వార్తలు వస్తుండటంతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఈ పరిస్థితిని జిల్లా నాయకులకు చెప్పుకుంటే అవహేళన చేస్తారనే ఉద్దేశంతో ఆయన గుంభనంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టే అమర్ పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. కష్టకాలంలో పార్టీని వదలి వెళ్లిన అమర్‌ను ఎంత మాత్రం ప్రోత్సహించమని వారు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. టీడీపీలో చూపించిన బుద్ధే వైఎస్సార్సీపీలోనూ చూపించారని, ఆయన వైఖరే అంత అని పార్టీ అధిష్టానానికి కూడా చేరవేశారని తెలుస్తోంది. తన మనుగడ, స్వప్రయోజాల కోసం పార్టీలోకి తిరిగి వచ్చిన అవకాశవాది అమర్నా«థ్‌రెడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని టీడీపీ అధిష్టానానికి పలమనేరు కేడర్ కుండబద్ధలు కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం.


