minor accident
-
యూపీలో హిట్ అండ్ రన్.. మైనర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు మహిళ బలి
ఉత్తర ప్రదేశ్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగుచూసింది. మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఓ స్కూటర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్పైనున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె కూతురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది.ఈ ఘటన కాన్పూర్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై శుక్రవారం చోటుచేసుకుంది. మైనర్ అయిన డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై ఉన్న మహిళ, చిన్నారి గాల్లోకి ఎగిరి దూరం పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మహిళ మృతిచెందినట్లు ప్రకటించారు. చిన్నారి గాయాలతో చికిత్స పొందుతుంది.Woman dies, her daughter survives many fractures after their two-wheeler was hit by a speeding car in Uttar Pradesh's Kanpur.The car was being driven by a minor boy who had bunked his school. He was accompanied by another boy and two girls, all his classmates and minors. All… pic.twitter.com/5VIXUbEbgu— Vani Mehrotra (@vani_mehrotra) August 3, 2024 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. 17 ఏళ్ల మైనర్ బాలుడు కారు నడిపినట్లు తెలిపారు. రోడ్డుపై స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
విచ్చలవిడిగా.. బైక్ డ్రైవింగ్ చేస్తూ.. చివరికి..
జోగులాంబ: వింత పోకడలు ఎక్కువైపోయాయి. సరదా వ్యసనాలపై మోజు పడుతూ రోడ్డుపై బైక్‌లను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. పిల్లలపై నిఘా పెట్టకపోవడంతో పలువురు మైనర్లు మద్యానికి అలవాటు పడుతూ వారి జీవితాన్ని చేజేతులా అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. జిల్లాలోని మైనర్ల చేతిలో బైక్ ఉంటే.. వారి స్పీడ్‌కు కళ్లెం వేయలేని దుస్థితి ఏర్పడింది. ఇదే వారి జీవితంలో రాంగ్ రూట్‌గా మారింది. చెడు వ్యసనాలకు అలవాటు పడి కటకటాలపాలైన సంఘటనలు ఉన్నాయి. వక్రమార్గంలో వెళ్లకుండా.. స్నేహితుల్లో ఎవరిదైనా పుట్టిన రోజు ఉంటే చాలు పట్టణ శివారు ప్రాంతాల్లో అర్ధారాత్రి 12 గంటలు దాటగానే నడిరోడ్డుపైకి వచ్చి కేక్ కట్ చేసి హంగామా చేస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద చిన్నారులకు మద్యం విక్రయించబోమనే నిబంధన ఉన్నా.. అమలు కావడం లేదు. రాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్ సమయంలో పోలీసులకు దొరికిన సంఘటనలు ఉన్నాయి. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారింది. తల్లిదండ్రులు ఇప్పటికై న మేల్కొని తమ పిల్లలపై నిఘా పెట్టి వక్రమార్గంలో వెళ్లకుండా చూసుకోవాలి. ఇళ్లలో చొరబడి విలువైన వస్తువులు, సామగ్రి చోరీ చేయడం వాటిని తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించి వచ్చిన నగదుతో మద్యం, పొగాకు, పాన్‌మసాల, జర్ధ తదితర వాటిని తీసుకుంటున్నారు. పరోక్షంగా ప్రోత్సాహం.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు బైక్ నేర్పిస్తుంటారు. అయితే వారి చేతికి బైక్ ఇవ్వడం తప్పని తెలిసినా.. ఏదైనా పని ఉంటే ఆసరా అవుతారనే భావనతో తల్లిదండ్రులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలేమో సరదాగా ఇద్దరు, ముగ్గురు స్నేహితులను ఎక్కించుకుని బైక్‌లపై దూసుకెళ్తున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి కిందపడిన సంఘటనలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు వారిని నిలువరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పోలీసుల తనిఖీల్లో మైనర్లు బైక్ డ్రైవింగ్ చేస్తూ.. పట్టుబడుతున్నారు. ఈ ఏడాది 60కు పైగా కేసులు నమోదయ్యాయి. జరిమానా రూపంలో రూ.26 వేలు విధించారు. ఆగస్టు 15న మైనర్లు రోడ్డుపై బైక్‌లతో చేసిన హంగామా అంతా ఇంత కాదు. వారిని నిలువరించే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐకి గాయాలయ్యాయి. వ్యసనాలకు అలవాటు పడిన ముగ్గురు మైనర్లు డబ్బులు సంపాదించేందుకు అడ్డదారి తొక్కారు. చోరీల దారిని వెతుకున్నారు. నూతన నిర్మాణంలోని ఇళ్లలో కాపర్ వైర్, ఇనుప కడ్డీలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న క్రమంలో పట్టుబడి కటకటాలపాలయ్యారు. 17 ఏళ్ల బాలుడు ప్రేమ పేరిట పదో తరగతి చదువుతున్న విద్యార్థిని వేంధిపులకు గురిచేశాడు. బాలికను బయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి జువైనెల్ హోంకు తరలించారు. యుక్త వయస్సులోనే చెడు అలవాట్లకు గురవుతున్నారు. మరోవైపు నిత్యం రోడ్డుపై మైనర్లు బైక్‌లను పరిమితికి మించిన వేగం, శబ్ధ కాలుష్యం, విన్యాసాలు, సినిమా తరహాలో బైక్ చేజింగ్లతో పోటీ పడుతున్నారు. -
రణ్వీర్ కారుకు చిన్న ప్రమాదం
-
రణ్వీర్ కారుకు ప్రమాదం
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ముంబైలోని ఓ స్టూడియోలో గురువారం డబ్బింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ సంఘన చోటు చేసుకుంది. రణ్వీర్ మెర్సిడిస్ కారును వెనక నుంచి ఓ బైక్ గుద్దడంతో వెంటనే హీరో గాబరాగా దిగి ఏమైనా డ్యామేజ్ అయిందేమోనని పరిశీలించారు. అదృష్టవశాత్తూ కారుకు కూడా ఎలాంటి నష్టం చోటు చేసుకోలేదు. దీంతో అంతా బాగానే ఉంది అని నిర్ధారించుకున్నాక తిరిగి కారెక్కి అక్కడనుంచి వెళ్లిపోయారు. (చదవండి: అక్షయ్ సినిమాను బాయ్‌కాట్ చేయాలి: కేఆర్కే) దీన్నంతటినీ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. రణ్వీర్ క్షేమంగానే ఉన్నారని పేర్కొంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే రణ్వీర్ '83' అనే క్రీడా నేపథ్యం గల చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే తెలుగు మాస్ మసాలా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' హిందీ రీమేక్‌లో కూడా ఆయన కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. (చదవండి: ఆడిషన్స్‌కి రణ్‌వీర్‌సింగ్ ఎలా వెళ్లాడో చూడండి) -
'చిన్న'తప్పే.. పెద్దశిక్ష!
వారికి పట్టుమని పదేళ్లు లేకుంటాయ్.. కానీ బైక్‌ను మాత్రం రయ్.. రయ్‌మని గిరిగిరా తిప్పేస్తుంటారు.. మరోదిక్కు వెనక ఓ తండ్రి తాపీగా కూర్చొని.. తమ పిల్లాడికి బండి ఇచ్చి నడిపిస్తుంటాడు.. ఇలా చిన్న పిల్లలు ద్విచక్రవాహనాలను తీసుకుని ఇష్టానుసారంగా నడిపిస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్నిసార్లు వారే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. ఫలితంగా కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంటుంది. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరిగిపోయాయి.. వీటిపై దృష్టిసారించిన పోలీస్ యంత్రాంగం బాలురు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైనా.. పోలీసులకు పట్టుబడినా సంబంధిత బండి యజమానులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు.. గద్వాల క్రైం: పాలబుగ్గలా పసి మొగ్గలు హద్దులు దాటుతున్నారు. బడిలో పాఠ్యపుస్తకాలతో.. ఆటలతో హుషారుగా చదువుకోవాల్సిన సమయంలో.. ఆకతాయి చేష్టలతో రోడ్లపై ద్విచక్రవాహనాలు నడుపుతూ పాదచారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులే స్వయంగా వారి చేతికి వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఆకతాయి చేష్టలతో వాహనాన్ని అత్యంత వేగంతో నడిపి దానిని అదుపు చేసే సామర్థ్యం లేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో అటు వాహనదారులు, ఇటు పాదచారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. అతి గారాబంతో.. పిల్లలను అదుపు చేయాల్సిన పెద్దలు సైతం వారిపై పెంచుకున్న ప్రేమతో వారిని దండించడంలో వెనకడుగు వేస్తున్నారు. అతిగారాబం చూపుతూ.. పిల్లలు వాహనాలు నడపడం ఓ స్టేటస్ భావిస్తూ.. పిల్లలు చేసే పనులకు అడ్డు చెప్పడం లేదు. మరి కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్తున్న పిల్లలకు వాహనాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు. పోలీసుల తనిఖీలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడిన సందర్భంలో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నా ఫలితం లేకపోతుంది. గద్వాల జిల్లాకేంద్రంలో ఇప్పటి వరకు 200 మంది బాలురకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ పోలీసులు ఇచ్చారు. అయినా వారిలో మార్పు కనిపించడం లేదు. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ట్రాఫిక్ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ వీటిని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం.. సాధరణంగా వాహనాలు నడపాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. రోడ్డు నియమ, నిబంధనలు పాటించాలి. కానీ బాలురకు ఇందులో ఏ ఒక్క దానిపైనా అవగాహన ఉండదు. అయినా వాహనాలపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ నింబధనలపై విస్తృత ప్రచారం కల్పిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. వివరాలు వెల్లడిస్తున్న పట్టణ ఎస్ఐ ఇదిగో సాక్ష్యం.. గద్వాలలోఆదివారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా ఈగలపెంటకు చెందిన ఓ బాలుడు(15) గద్వాలకు చెందిన కాపు శ్రీనివాస్‌రెడ్డి ద్విచక్రవాహనాని ఇప్పించుకొని పట్టణంలోని సుంకులమ్మమెట్ ప్రాంతంలో వాయువేగంతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన పబ్బతి లక్ష్మీనారాయణ(60) ఆ దారి వెంట నడుస్తూ వెళ్తుండగా బాలుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ మృతిచెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ప్రమాదం చేసింది బాలుడని గుర్తించారు.దీంతో పోలీసులు ప్రమాదానికి కారణమైన బాలుడిని బాల నేరస్థుడిగా గుర్తించి బాలసదన్‌కు తరలించారు. బాలుడికి వాహనం ఇచ్చిన శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కఠిన చర్యలు.. బాలురు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ఎవరైనా అతిక్రమించి ప్రమాదాలకు కారణమైనా, పోలీసులకు చిక్కినా తల్లిదండ్రులు, వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో వీటిపై ప్రత్యేక నిఘా ఉంచాం. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. తప్పు చేస్తూ దొరికిపోతే ఎంతవారిపైనైనా కఠిన చర్యలు తప్పవు. -
సూపర్ స్టార్ కుమార్తె కారుకు ప్రమాదం
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం చెన్నైలోని అల్వార్పేట్ ప్రాంతంలో ఆమె కారు ఓ ఆటో రిక్షాను ఢీకొట్టింది. ఈ ఘటనలో సౌందర్యకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. ఆటో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కాగా సౌందర్య భావ, హీరో ధనుష్ జోక్యంతో విరమించుకున్నట్టు సమాచారం. ప్రమాద వార్త తెలియగానే ధనుష్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. వైద్యానికయ్యే ఖర్చులు భరిస్తామని, పరిహారం ఇస్తామని, కేసు లేకుండా రాజీ చేసుకుందామని చెప్పి ధనుష్.. ఆటో డ్రైవర్‌ను ఒప్పించాడు. సౌందర్యపై కేసు నమోదు కాకుండా కాపాడాడు. ప్రమాదం జరిగిన సమయంలో సౌందర్య కారును స్వయంగా నడిపారా లేక డ్రైవర్ ఉన్నాడా అన్న విషయం తెలియరాలేదు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రజనీ రెండో కుమార్తె సౌందర్య ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాలో ధనుష్, కాజోల్, అమలాపాల్ తదితరులు నటిస్తున్నారు.