miraj
-
గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ..
కొద్దిరోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఆశలు రేకెత్తిస్తూ.. 2024 మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆనందాన్ని అందించబోతోంది. అయితే 2023 దేశ ప్రజలకు కొన్ని మంచి, కొన్ని చెడు జ్ఞాపకాలను అందించింది. 2023 జనవరి 28న గగనతలంలో ఊహకందని ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్-2000 ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్‌లోని మహారాజ్‌పురా ఎయిర్‌బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలోని పహర్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మన్పూర్ మహాదేవ్ అడవిలో మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయింది. సుఖోయ్‌కు చెందిన రెక్కలు మోరెనాలోని పహర్‌ఘర్ ప్రాంతంలో పడిపోయాయి. మిగిలిన విమానం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని ఉచైన్ పోలీస్ స్టేషన్‌లోని నాగ్లా బిజా గ్రామ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మిరాజ్ పైలట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి మృతి చెందగా, సుఖోయ్ పైలట్లిద్దరూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిరాజ్-2000 చాలా కాలంగా భారత వైమానిక దళంలో భాగంగా ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించారు. భారత వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాలు.. విమాన శిక్షణ మిషన్‌లో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, ఇద్దరు పెలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం! -
కార్గిల్ యుద్ధ హీరోకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ : భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్ యుద్ధ హీరో ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్‌ను.. ఐఏఎఫ్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్(డబ్ల్యూఏసీ) చీఫ్‌గా నియమించింది. ఇన్నాళ్లుగా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పనిచేసిన నంబియార్ శుక్రవారం నుంచి పశ్చిమ వాయుదళంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా భారత వైమానిక దళంలోని దాదాపు 40 ఎయిర్‌బేస్‌లు డబ్ల్యూఏసీ నియంత్రణలోనే ఉంటాయి. తద్వారా రాజస్తాన్‌లోని బికనీర్ నుంచి సియాచిన్ గ్లేసియర్ వరకు గల గగనతలాన్ని డబ్ల్యూఏసీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇక కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై తన విమానం ద్వారా ఐదు లేసర్ గైడెడ్ బాంబులను విసిరిన నంబియార్.. భారత్ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా ఎయిర్ మార్షల్‌గా మిరాజ్-2000లో సుమారు 2300 గంటల పాటు ప్రయాణించిన ఘనత ఆయన సొంతం. అదేవిధంగా ఐఏఎఫ్ నంబర్ స్క్వాడ్రాన్‌కు నంబియార్ నేతృత్వం వహించారు. మిరాజ్‌తో పాటు తొలి రాఫెల్ ఫైటర్ జెట్‌ను కూడా నడిపిన ఆయన సీనియర్ టెస్టు పైలట్, కమాండింగ్ ఆఫీసర్‌గా కీర్తి గడించారు. లైట్ కమంబాట్ ఎయిర్‌క్రాఫ్టులను పరీక్షించినందుకు గానూ 2002లో వాయుసేన మెడల్ పొందారు. -
రోడ్లపైనే ల్యాండింగ్...
హైదరాబాద్: అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా ఉపయోగించుకునే ప్రయత్నంలో భాగంగా గురువారం మథుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మిరాజ్ 2000 రకం యుద్ధవిమానాన్ని ల్యాండ్చేస్తున్న దృశ్యం. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధవిమానాన్ని ఇలా రహదారిపై విజయవంతంగా ల్యాండ్ చేయడం ఇదే తొలిసారి.