ఎంతందంగా ఉన్నావే.. ఎవరే నీవు
నన్ను చూడు.. నా అందం చూడు అంటున్నట్టు ఉంది కదూ ఈ పిచ్చుక. అద్దంలో తన అందచందాలను చూసుకుంటున్నట్టు ఉంది ఇది. పిచ్చుకలు కూడా అంతరించిపోతున్న పక్షు జాతుల్లో చేరాయి. తరువాతి తరాలకు పిచ్చుక కనిపిస్తే ఎంతందంగానే ఉన్నావే.. ఎవరే నీవు అనుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. జంగారెడ్డిగూడెంలో వీరా మహేష్ ఇంటి బయట ఉన్న అద్దంలో పిచ్చుక తనను తాను చూసుకుంటున్న దృశ్యమిది. – జంగారెడ్డిగూడెం రూరల్