Miryalagudem
-
మూడు కేజీల వెండి ఆభరణాల బహూకరణ
మిర్యాలగూడ : స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని సీతారామాంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారికి మాదిరెడ్డి జయమ్మ వారి కుటుంబసభ్యులు రాఘవరావు, సరళ, వెంకటేశ్వర్లు మూడు కేజీల వెండి ఆభరణాలు బహూకరించారు. ఈ సందర్భంగా మూల విరాట్ స్వామి వార్లకు పంచామత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్, నక్క బుచ్చయ్య, శ్రీనివాస్, విష్ణుమూర్తి, నారాయణ, లక్ష్మమ్మ, కష్ణారెడ్డి, వసంత, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
గన్ను కలకలం.. పోలీసులకు ఫిర్యాదు
సూర్యాపేట: ఓ వ్యక్తి గన్ను భుజాన వేసుకొని మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వస్తుండగా రహదారి వెంబడి గమనించిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురువారం సూ ర్యాపేట పట్టణ శివారులోని కుసుమవారిగూడెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడెం హెచ్డీఎఫ్సీ బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఉపేందర్‌రెడ్డి విధి నిర్వహణలో భాగంగా తన గన్నుతీసుకుని గ్లామర్ బైక్‌పై సూర్యాపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు పనినిమిత్తం వస్తున్నాడు. అతడిని గమనించిన ప్రజలు సూర్యాపేట రూరల్ సీఐకి సమాచారమందించారు. దీంతో వెంటనే సూర్యాపేట రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ పవన్‌కుమార్‌రెడ్డిలు కుసుమవారిగూడెం గ్రామ సమీపంలోకి చేరుకుని గన్నుతో బైక్‌పై సూర్యాపేట పట్టణానికి వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని విచారించగా తాను మిర్యాలగూడెం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు గుర్తింపు కార్డుతో పాటు గన్నుకు సంబంధించిన లెసైన్స్‌ను తదితర వివరాలను పోలీసులకు చూపించడంతో వదిలేశారు. ఏదీ ఏమైనా ఈ ఘటన మిర్యాలగూడెం నుంచి సూర్యాపేట వరకు ప్రజలను వణికిం చింది. ఉపేందర్‌రెడ్డి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ గార్డు అని తేలడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.