స్థానిక ఎన్‌ఎస్‌పీ క్యాంపులోని సీతారామాంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారికి మాదిరెడ్డి జయమ్మ వారి కుటుంబసభ్యులు రాఘవరావు, సరళ, వెంకటేశ్వర్లు మూడు కేజీల వెండి ఆభరణాలు బహూకరించారు.
మూడు కేజీల వెండి ఆభరణాల బహూకరణ
Published Sat, Aug 27 2016 12:31 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM
మిర్యాలగూడ : స్థానిక ఎన్‌ఎస్‌పీ క్యాంపులోని సీతారామాంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారికి మాదిరెడ్డి జయమ్మ వారి కుటుంబసభ్యులు రాఘవరావు, సరళ, వెంకటేశ్వర్లు మూడు కేజీల వెండి ఆభరణాలు బహూకరించారు. ఈ సందర్భంగా మూల విరాట్ స్వామి వార్లకు పంచామత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్, నక్క బుచ్చయ్య, శ్రీనివాస్, విష్ణుమూర్తి, నారాయణ, లక్ష్మమ్మ, కష్ణారెడ్డి, వసంత, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement