సూర్యాపేట: ఓ వ్యక్తి గన్ను భుజాన వేసుకొని మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వస్తుండగా రహదారి వెంబడి గమనించిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురువారం సూ ర్యాపేట పట్టణ శివారులోని కుసుమవారిగూడెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడెం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఉపేందర్‌రెడ్డి విధి నిర్వహణలో భాగంగా తన గన్నుతీసుకుని గ్లామర్ బైక్‌పై సూర్యాపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు పనినిమిత్తం వస్తున్నాడు. అతడిని గమనించిన ప్రజలు సూర్యాపేట రూరల్ సీఐకి సమాచారమందించారు.
దీంతో వెంటనే సూర్యాపేట రూరల్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డిలు కుసుమవారిగూడెం గ్రామ సమీపంలోకి చేరుకుని గన్నుతో బైక్‌పై సూర్యాపేట పట్టణానికి వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని విచారించగా తాను మిర్యాలగూడెం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు గుర్తింపు కార్డుతో పాటు గన్నుకు సంబంధించిన లెసైన్స్‌ను తదితర వివరాలను పోలీసులకు చూపించడంతో వదిలేశారు. ఏదీ ఏమైనా ఈ ఘటన మిర్యాలగూడెం నుంచి సూర్యాపేట వరకు ప్రజలను వణికిం చింది. ఉపేందర్‌రెడ్డి హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ గార్డు అని తేలడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
గన్ను కలకలం.. పోలీసులకు ఫిర్యాదు
Published Fri, Apr 10 2015 4:11 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM
Advertisement
Advertisement