misankakatiya
-
మంత్రి మాటాలు అబద్ధాలే..
మిషన్‌కాకతీయలో ఎమ్మెల్యేకు 2 శాతం కమీషన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు సుల్తానాబాద్ : పెద్దపల్లి నియోజకవర్గంలోని డీ-83, 86 కాల్వలకు రూ.200 కోట్లు కేటారుుంచామన్న మంత్రి ఈటల రాజేందర్ మాటలు అబద్ధాలేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు అన్నారు. కాకతీయకు కాలువకు కేటారుుస్తే డీ-86 ఎలా చెబుతారని ప్రశ్నించారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గతేడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరున్నా పెద్దపల్లికి ఇవ్వకుండా మంత్రి తన నియోజకవర్గానికి తరలించుకుపోయూరని ఆరోపించారు. పూసాలలో తానే పైపులైన్ నుంచి నీరు విడుదల చేస్తే.. స్థానిక నాయకులపై కేసు పెట్టడాన్ని తప్పు పట్టారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మిషన్‌కాకతీయ పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద రెండు శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. డీసీఎంఎస్ జిల్లా డెరైక్టర్ కల్లెపల్లి జాని, మాజీ ఎంపీపీలు పాల రామారావు, గంట రాములు, కొత్తూరు జగన్, మండల కార్యదర్శి అబ్బయ్యగౌడ్, కిశోర్ పాల్గొన్నారు. -
పుష్కరిణిలో పురాతన బావి ఆనవాళ్లు
♦ బావిలోంచి సన్నటి ఊటగా నీటి ధార ♦ మిషన్‌కాకతీయలో భాగంగా సుందరీకరణ ♦ జేసీబీతో పని చేస్తుండగా బయటపడ్డ వైనం చేవెళ్ల: మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఆం జనేయస్వామి దేవాలయ ఆవరణలో శనివారం పుష్కరిణి (గుండం) సుందరీ కరణ పనులు చేపడుతుండగా పురాతనమైన బావి ఆనవాళ్లు కనిపించాయి. ఈ పుష్కరిణి అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా రూ.32లక్షలు మం జూరుచేసింది. ఈ పనులను ఇటీవల మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభిం చారు. అప్పటి నుంచి కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా జేసీబీతో లోతు తీసే పని చేస్తుండగా పక్కనే ఉంచిన టిప్పర్ మట్టిలో కుంగడం కనిపించింది. వెంటనే అప్రమత్తమై టిప్పర్‌ను పక్కకు తొలగిం చారు. జేసీబీతో అదే స్థలంలో లోతుగా తవ్వగా బావి ఆనవాళ్లు కనిపించాయి. సన్నగా నీటిధార వస్తుండడం ఈ వాదనకు బలాన్ని చేకూర్చింది. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ బావి ఉండేదని, కాలక్రమంలో వర్షాలకు మట్టి కూరుకుపోయి మూసుకుపోయి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారుగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడం, పుష్కరిణి అతి పురాతనమైనది కావడంతో బావి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ఆలయ పూజారి పి.రాఘవేంద్రాచారిని అడగ్గా అప్పట్లో బావి ఉన్నట్లు పెద్దలు చెబుతుండేవార న్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పురావస్తు శాఖకు ఈ విషయాన్ని విన్నవించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.