మంత్రి మాటాలు అబద్ధాలే..
మిషన్‌కాకతీయలో ఎమ్మెల్యేకు 2 శాతం కమీషన్
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
సుల్తానాబాద్ : పెద్దపల్లి నియోజకవర్గంలోని డీ-83, 86 కాల్వలకు రూ.200 కోట్లు కేటారుుంచామన్న మంత్రి ఈటల రాజేందర్ మాటలు అబద్ధాలేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు అన్నారు. కాకతీయకు కాలువకు కేటారుుస్తే డీ-86 ఎలా చెబుతారని ప్రశ్నించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గతేడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరున్నా పెద్దపల్లికి ఇవ్వకుండా మంత్రి తన నియోజకవర్గానికి తరలించుకుపోయూరని ఆరోపించారు.
పూసాలలో తానే పైపులైన్ నుంచి నీరు విడుదల చేస్తే.. స్థానిక నాయకులపై కేసు పెట్టడాన్ని తప్పు పట్టారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మిషన్‌కాకతీయ పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద రెండు శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. డీసీఎంఎస్ జిల్లా డెరైక్టర్ కల్లెపల్లి జాని, మాజీ ఎంపీపీలు పాల రామారావు, గంట రాములు, కొత్తూరు జగన్, మండల కార్యదర్శి అబ్బయ్యగౌడ్, కిశోర్ పాల్గొన్నారు.