miss india universe
-
'మిస్ ఎర్త్ ఇండియా'గా ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కూతురు
రాజస్థాన్‌కు చెందిన ప్రియన్ సైన్ (20)... మిస్ ఎర్త్ ఇండియా 2023గా ఎంపికైంది. దీని ద్వారా డిసెంబర్లో వియత్నాంలో జరగనున్న అంతర్జాతీయ అందాల పోటీల్లో మిస్ ఎర్త్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 'డివైన్ బ్యూటీ' పేరుతో జరిగే ఈ ఈవెంట్లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా, మిస్ ఎర్త్ ఇండియా అవార్డులను అందజేస్తారు. మిస్ రాజస్థాన్ 2022 అందాల పోటీలో ప్రియన్ సైన్ మొదటి రన్నరప్‌గా నిలిచి గుర్తింపు పొందింది. తాజాగ ఈ ఈవెంట్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మిస్ ఎర్త్ ఇండియా ఈవెంట్ జరిగింది. దీనిని దీపక్ అగర్వాల్ డివైన్ బ్యూటీ వారు ఈ పోటీని నిర్వహించారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) 16 మంది ఫైనలిస్టులలో ప్రియన్ సైన్ ఒకరు. అనేక పోటీల్లో గెలుపొందిన ఆమె ఇప్పుడు మిస్ ఎర్త్ ఇండియా 2023గా అవతరించింది. విజేతగా ప్రకటించిన వెంటనే ప్రియన్ సైన్ భావోద్వేగానికి గురయ్యారు. మిస్ రాజస్థాన్ 2022లో ప్రియన్ మొదటి రన్నరప్‌గా నిలిచిందని మిస్ రాజస్థాన్ నిర్వాహకులు, ప్రియన్ సైన్ మెంటార్ యోగేష్ మిశ్రా, నిమిషా మిశ్రా తెలిపారు. మెడిసిన్ చదువుతూనే ప్రియన్ సైన్ మిస్ ఇండియాకు కూడా సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: ధృవ సినిమాకు సీక్వెల్ రెడీ.. టీజర్ విడుదల కానీ..) ప్రియన్ తల్లి రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రియన్‌కు తల్లి మాత్రమే ఉంది, ఆమెను కొడుకులా పెంచింది. దీని గురించి ప్రియన్ సైన్ మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిపింది. 2019 మిస్ ఎర్త్ ఇండియాగా తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్ బిడ్డ డాక్టర్ తేజస్వి మనోజ్ఞ గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by 𝐌𝐢𝐬𝐬 𝐃𝐢𝐯𝐢𝐧𝐞 𝐁𝐞𝐚𝐮𝐭𝐲 (@divinegroupindia) -
నాకు మత్తు ఇచ్చి పోర్న్ వీడియో తీశారు: మాజీ మిస్ ఇండియా యూనివర్స్
శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్ర పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్‌నలో సంచలం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తమతో బలవంతంగా అశ్లీల చిత్రాలను చిత్రీకరంచి యాప్‌లో అప్లోడ్ చేశాడంటూ పలువురు అమ్మాయిలు అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసులో అతడిపై ఆరోపణలు రుజువు కావడంతో రాజ్‌కుంద్రా జైలుగా కూడా వెళ్లాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగానే తాజాగా మరో పోర్నోగ్రఫీ వ్యవహరం బాలీవుడ్లో వెలుగు చూసింది. ఇందులో బాధితురాలుగా మాజీ మిస్ ఇండియా యూనివర్స్ పరీ పాసవాన్ ఉండటం మరింత సంచలనం సృష్టిస్తోంది. చదవండి: భర్త రాజ్‌కుంద్రాకు శిల్పా విడాకులు ఇవ్వబోతోందా?! ఓ ప్రొడక్షన్ హౌజ్ తనకు మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింగ్ ఇచ్చి తనపై పోర్న్ వీడియో షూట్ చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ముంబై వచ్చిన కొత్తలో ఓ ప్రొడక్షన్ హౌజ్‌కు వెళ్లాను. అక్కడ వాళ్లు నాకు కూల్‌డ్రింగ్ ఇచ్చారు. అయితే అందులో మత్తు కలిపి నేను స్పృహా కొల్పోయేలా చేసి ఆ తర్వాత నాపై అడల్ట్ కంటెంట్ వీడియో తీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను’ అని వెల్లడించింది. అయితే ఆమె ఆ ప్రొడక్షన్ హౌజ్ పేరు మాత్రం ఆమె బయట పెట్టలేదు. చదవండి: అందుకే అబ్‌రాంకు కాజోల్ అంటే నచ్చదు: షారుక్ కాగా గతంలో పరీ పాసవాన్ తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆమె భర్త నీరజ్ పాసవాన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు. అయితే ఈ కేసులో భర్త నీరజ్ తరపు బంధువులు పరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీ పాసవాన్ ముంబయికి చెందిన ఓ ప్రొడక్షన్ హౌస్ లో పోర్న్ ఫిలింలో నటించిందని.. అమాయకులను బుట్టలో వేసుకోవడమే తన పని అని ఆరోపించారు. అంతేకాకుండా ఆమెకు 12 ఏళ్ల కూతురు ఉందని.. ఇంతకుముందే ఇద్దరితో పెళ్లి కూడా అయిందని నీరజ్ సోదరుడు చందన్ పేర్కొన్నారు. కాగా పారి పాసవాన్ 2019లో జరిగిన మిస్ ఇండియా యూనివర్స్ కంటెస్టెంట్ పాల్గొని టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు నీరజ్‌తో పరిచయం, ఆ తర్వాత పెళ్లి జరిగింది. -
భువన సుందరి
అమ్మాయి పుట్టింది.లక్ష్మీదేవి పుట్టిందనలేదెవ్వరూ..‘బ్యూటీ క్వీన్’ పుట్టిందన్నారు.అంతా సంతోషించారు.ఆ తర్వాత మర్చిపోయారు.కానీ... ఆ అమ్మాయి మర్చిపోలేదు.ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న తర్వాత పీజీకి వెళ్లేలోపు ఒక ప్రయత్నం చేసింది.ఢిల్లీలో బ్యూటీ కాంటెస్ట్‌కి వెళ్లింది.‘మిస్ ఎర్త్ ఇండియా’ కిరీటంతో తిరిగొచ్చింది. ‘‘మా అమ్మానాన్నలకు నా మీద నమ్మకం ఉంది. నేను సరైన మార్గంలోనే నడుస్తానని వాళ్లకు తెలుసు. ఆడపిల్లను అయిన కారణంగా ఏదైనా అవాంఛనీయమైన పరిస్థితి ఎదురైతే, ఆ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోగలిగిన ధైర్యం నాలో ఉందని కూడా మా అమ్మానాన్నలకు తెలుసు. అందుకే వాళ్లు నన్ను నా స్వభావానికి అనుగుణంగా నడుచుకోనిస్తున్నారు. కాబట్టి నేను నా మనసు చెప్పినట్లు అనుసరించడమే నాకు సంతోషం. నేను సంతోషంగా ఉండడమే మా అమ్మానాన్నలకు సంతోషం’’ ఇది తేజస్విని మనోజ్ఞకు ‘మిస్ ఎర్త్ ఇండియా’ కిరీటం పెట్టిన సమాధానం. ఈ ఏడాది ఆగస్టులో న్యూఢిల్లీలో జరిగిన ‘మిస్ ఎర్త్ ఇండియా’ పోటీల్లో విజయం సాధించిన ఈ 23 ఏళ్ల అమ్మాయి వచ్చే నెల (అక్టోబర్)లో జరిగే మిస్ ఎర్త్ 2019 పోటీ కోసం ఫిలిప్పీన్స్ వెళ్లడానికి సమాయత్తమవుతోంది. మిస్ ఎర్త్ ఇండియా పోటీలో అన్ని దశలనూ పూర్తి చేసుకున్న తేజస్విని మనోజ్ఞను నిర్వహకులు చివరగా ‘మీ టూ... ఉద్యమం విస్తృతమైన నేపథ్యంలో ఆ ప్రభావం మీ కుటుంబం మీద ఎలా ఉంది? ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ పోటీలో పాల్గొనడానికి మీ తల్లిదండ్రులు సమ్మతించారా’ అని అడిగినప్పుడు తేజస్విని మనోజ్ఞ పై సమాధానమిచ్చారు. ఆమె సమాధానంలో వ్యక్తమైన పరిణతి అమ్మాయిలకు మార్గదర్శనం. సమాధానమిచ్చేటప్పుడు ఆమెలో తొణికిసలాడిన ఆత్మవిశ్వాసం అమ్మానాన్నల గొప్ప పెంపకానిది. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి బ్యూటీ కాంటెస్ట్‌కు వెళ్లడమే ఓ ఆశ్చర్యం, కిరీటాన్ని గెలుచుకుని రావడం ఓ అద్భుతం. అంతర్జాతీయ వేదిక మీద భారతదేశానికి ప్రతినిధిగా మెరవడం తెలుగువాళ్లందరికీ గర్వకారణం. ఇందుకు బీజం పడింది సుస్మితాసేన్ మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్నప్పుడు. అది ఎప్పటి మాట అని... విడ్డూరంగా అనిపించినా సరే ఇదే నిజం. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నప్పటి సంగతి. అసలు 1992లో మధుసప్రే మిస్ యూనివర్స్ సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచినప్పుడే... ఈ అందాల కిరీటం సామాన్య భారతీయుల దృష్టిని ఆకర్షించింది. తర్వాత రెండేళ్లకే ఆ కలను సుస్మితా సేన్ నిజం చేసింది. ఆ కిరీటాన్ని భారతదేశం మొత్తం ఆస్వాదించింది. అప్పుడు పుట్టింది తేజస్విని మనోజ్ఞ. చూడడానికి వచ్చిన వాళ్లు పుత్తడిబొమ్మలా ఉన్న మనోజ్ఞను చేతుల్లోకి తీసుకుని ‘మీ ఇంట్లో మిస్ యూనివర్స్ పుట్టింది’ అనేవాళ్లు. పాపాయి పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఫంక్షన్లలో కలిసిన బంధువులు, స్నేహితులు ‘బ్యూటీ క్వీన్ పెద్దవుతోంది’ అని బుగ్గలు పుణికేవాళ్లు. ఈ పలకరింపులు, ప్రశంసలు పాపాయి మెదడులో నాటుకుంటున్నాయని వాళ్ల అమ్మానాన్నలు కూడా అనుకోలేదు. ఎంబీబీఎస్ తర్వాత మనోజ్ఞ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఆల్ రౌండర్. ఒక వండర్ కిడ్. యూత్ అంబాసిడర్‌గా అంతర్జాతీయ స్థాయిలో సార్క్ సమావేశాల్లో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. భరతనాట్యం కళాకారిణి, గాయని, క్రీడాకారిణి, మోటివేషనల్ స్పీకర్, యోగ ఎక్స్పర్ట్, ఎన్‌సిసిలో భారతదేశంలో బెస్ట్ క్యాడెట్‌తోపాటు బెస్ట్ షూటర్ అవార్డు గ్రహీత. రిపబ్లిక్ డే పెరేడ్లో ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మనోజ్ఞ ఎన్సిసి టీమ్‌కి కంటింజెంట్ కమాండర్‌గా వ్యవహరించింది. మనోజ్ఞ 2010లో ప్రధానమంత్రి అవార్డు అందుకున్న సందర్భంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తేజస్విని తల్లి అనితతో ‘‘దేశానికి అద్భుతమైన బిడ్డనిచ్చారు. ఇలాంటి బిడ్డల చేతిలో దేశం క్షేమంగా ఉంటుంది’’ అన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ గారైతే ‘‘తేజస్విని విద్యార్థులకు మార్గదర్శనం. ఒక కళాకారిణి డాక్టర్ అయితే... ఆ కరుణ భవిష్యత్తులో పేషెంట్లకు వైద్యం చేయడంలో ప్రతిబింబించి తీరుతుంది’’ అని వైద్య విద్యార్థుల సదస్సులో అభినందించారు. ఇన్ని సాధించిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తయి పీజీ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ కావడానికి తీసుకున్న విరామంలో ఒక రోజు ‘మిస్ ఇండియా యూనివర్స్ కాంపిటీషన్స్‌లో పాల్గొంటాను’ అని అనుమతి కోసం తల్లి ముఖంలోకి చూసింది. తొలిసారి నిరాశ అది 2017, ముంబయిలో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో తేజస్విని మనోజ్ఞ ‘మిస్ టాలెంటెడ్’ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. నిర్వహకులలో కొందరు ‘బ్యూటీ క్వీన్ కావడానికి అర్హతలన్నీ ఉన్నాయి’ అని, ‘కాదనడానికి వీల్లేని గ్రేట్ ప్రొఫైల్’ అని... కాంప్లి మెంట్స్ ఇచ్చారు. తుది ఫలితాలు వెల్లడయ్యాయి. బ్యూటీ క్వీన్ కిరీటం మాత్రం ఆమె తల మీదకు రాలేదు. తేజస్విని మనోజ్ఞను నిరాశకు గురి చేసిన తొలి క్షణాలవి. అప్పటి వరకు చదువులో, ఆటల్లో, కళల్లో మేటిగా రాణించింది. ఆటలు, కళలతో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం వికసించిన అమ్మాయి కావడంతో మానసికంగా కుంగిపోలేదు. కానీ మనసులో ఒక మూల ఆ కొరత ఉండిపోయింది అన్నది తేజస్విని అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ. ఢిల్లీ నుంచి పిలుపు... అమ్మ వద్దంది ‘‘యూనివర్స్ పోటీలను ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి. మిస్ ఎర్త్ పోటీల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడడం, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భూమిని ఇవ్వడానికి అవసరమైన పరిరక్షణ పద్ధతుల మీద పని చేయడం కూడా ప్రధానంగా ఉంటుంది. నేను అప్పటికే కొన్ని ఎన్జీవోలతో కలిసి ఎయిర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ లెవెల్ మెయింటెనెన్స్, అమ్మాయిలకు పర్సనల్ హైజీన్, టాయిలెట్ల వాడకం సెషన్స్ ఇచ్చాను. నేను ఎర్త్ ప్రొటెక్షన్, సొసైటీకి అవసరమైన పనులు చేస్తున్నాను కాబట్టి మిస్ ఎర్త్ పోటీల్లో నా సర్వీస్‌కి ప్రాధాన్యం ఉంటుందనిపించి, ఆన్లైన్లో అప్లయ్ చేశాను. దేశవ్యాప్తంగా 26 వేల అప్లికేషన్లను పరిశీలించి 30 మందిని ఎంపిక చేశారు. ఆగస్ట్ 22వ తేదీన ఢిల్లీ నుంచి ఫోన్ కాల్... ‘మిస్ ఎర్త్ పోటీలకు ఎంపికైనట్లు, ఫైనల్ పోటీల కోసం 23వ తేదీ ఢిల్లీకి రావాలని’ చెప్పారు. కానీ అమ్మ ఒప్పుకోలేదు. ముంబయి అనుభవం రిపీట్ అయితే నేను నిరాశ చెందుతానేమోనని అమ్మ బెంగ. ఫలితం ఏదైనా నేను బాధ పడను. జీవితంలో నేను ఇంత వరకు దేనినీ గివప్ చేయలేదు. దీనిని కూడా నా వైపు నుంచి వదిలిపెట్టను. ప్రయత్నం చేయకుండా వదిలేశాననే రిగ్రెట్ జీవితంలో నన్ను వెంటాడకూడదు... అని నచ్చచెప్పాను. ఢిల్లీలో వారం రోజులు పోటీలు జరిగాయి. ఆగస్ట్ 31వ తేదీన ‘కింగ్డమ్ ఆఫ్ డ్రీమ్నెస్’ ఆడిటోరియమ్‌లో నా కల నిజమైంది. గత ఏడాది మిస్ ఎర్త్ విజేత ఫంగ్ ఖాన్ నాకు మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని పెట్టారు. సాధారణంగా మిస్ ఎర్త్‌గా ఎన్నికైన వాళ్లకే గత ఏడాది విజేతలు కిరీటధారణ చేస్తారు. మనదేశంలో మిస్ ఎర్త్ ఇండియా పోటీలు జరుగుతున్న సమయంలో ఆమె మనదేశ పర్యటనలో ఉండడంతో నాకు ఆ అదృష్టం కూడా కలిసొచ్చింది’’ అని మెరుస్తున్న కళ్లతో చెప్పింది మనోజ్ఞ. నాన్నకు భారం కాలేదు ‘‘అందాల పోటీలకు ప్రిపరేషన్ చాలా ఖర్చుతో కూడినదే. మా లాంటి మధ్య తరగతి వాళ్లకు అస్సలు సాధ్యమయ్యే పని కాదు. నాన్న బ్యాంకు ఉద్యోగి. ఈ ఖర్చులను నాన్నకు బరువు కానివ్వలేదు నేను. నా అవార్డుల డబ్బు, స్టైఫండ్, డాన్స్ ప్రదర్శన రెమ్యూనరేషన్లు, యోగా క్లాసుల ఫీజులు... ఇలా నాకు నేనే సంపాదించుకున్నాను. నేను నేర్చుకున్న జీవితపాఠం హార్డ్‌వర్క్ ఒక్కటే. ఈ హార్డ్ వర్క్‌తోనే మిస్ ఎర్త్ పోటీలో భారతదేశాన్ని రిప్రజెంట్ చేయగలుగుతున్నాను’’ అన్నది ఈ తెలుగమ్మాయి. మనోజ్ఞ అమ్మానాన్నలది మహబూబ్‌నగర్, కానీ ఈ అమ్మాయి పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. 1997లో హైదరాబాద్ అమ్మాయి డయానా హైడెన్ ‘మిస్ ఇండియా వరల్డ్’ కిరీటంతో అంతర్జాతీయ పోటీలకు వెళ్లి ‘మిస్ వరల్డ్’ కిరీటంతో తిరిగొచ్చింది. ఇప్పుడు మన బ్యూటీ క్వీన్ తేజస్విని మనోజ్ఞ మిస్ ఎర్త్ విజయాన్ని హైదరాబాద్‌కి తీసుకురావాలని కోరుకుందాం. బెస్టాఫ్ లక్ తేజస్వినీ, విష్ యూ హ్యాపీ జర్నీ. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: మోహనాచారి భూమాత కోసం పని చేస్తాను మనవంతుగా ఎక్కడా రాజీ పడకుండా శ్రమిస్తుంటే... ఎప్పుడో ఒకప్పుడు అవకాశం తలుపు తడుతుంది. మిస్ ఇండియా యూనివర్స్ మిస్ అయినందుకు బాధలేదు. నా పుట్టుక ఒక సోషల్ కాజ్ కోసం అయి ఉండవచ్చు. భూమాత కోసం పని చేయాల్సిన బాధ్యత నా మీద ఉండడం వల్లనే అది మిస్ అయి నా ప్రయాణం ఇటు వైపు మళ్లిందనుకుంటున్నాను. మిస్ ఎర్త్ 2019 పోటీలు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 26 వరకు ఫిలిప్పీన్స్ దేశం, నాగ సిటీలో జరుగనున్నాయి. మొత్తం 107 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. అందరి మధ్య మనదేశానికి ప్రాతినిధ్యం వహించడం అనే భావన ఉద్వేగానికి గురి చేస్తోంది. – డాక్టర్ తేజస్విని మనోజ్ఞ, మిస్ ఎర్త్ ఇండియా -
అందమైన గెలుపు
‘‘మీ లక్ష్యం ఏంటి?’’ మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ .. ఏ బ్యూటీ కంటెస్ట్లోనైనా కామన్ క్వశ్చన్ ఇది. కంటెస్టెంట్స్ ఇచ్చే సమాధానమూ సర్వ సాధారణమే.. ‘‘అనాథలకు సేవ చేయడం’’ అంటూ! అయితే అందాల కిరీటం దక్కగానే ధ్యేయం మారిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల తలుపులు తట్టే ప్రయత్నం మొదలవుతుంది. గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ ఆ సంప్రదాయాన్ని కాదని.. సినిమా, మోడలింగ్ రంగాల్లో అవకాశాలు వచ్చినా సింపుల్‌గా ‘నో’ చెప్పి ఇతర రంగాల్లో స్థిరపడ్డ అందాల రాణులూ ఉన్నారు. వాళ్ల గురించి తెలుసుకుందాం. ఇంద్రాణి రెహ్మాన్ మన దేశంలో అందాల పోటీలు 1952లో ప్రారంభమయ్యాయి. ఆ యేటి బ్యూటీ ‘మిస్ ఇండియా యూనివర్స్’ ఇంద్రాణి రెహ్మాన్. సినిమా రంగాన్ని ఎంచుకోక.. తనకు ఇష్టమైన శాస్త్రీయ నృత్యంలోనే సాధన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. పద్మశ్రీ బిరుదూ పొందారు. హార్వర్డ్ మొదలు ఎన్నో యూనివర్శిటీల్లో బోధించారు. జూలియర్డ్ స్కూల్లో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉన్నారు. రీటా ఫారియా 1966లో ‘మిస్ వరల్డ్’గా ఎన్నికైన రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన తొలి భారతీయురాలే కాదు.. ఫస్ట్ ఏషియన్ కూడా. అలా ఆమె క్రౌన్ ధరించిందో లేదో ఇలా మోడలింగ్, సినిమా చాన్సెస్ ఆమె ఇంటి కాలింగ్ బెల్ నొక్కాయి. ‘నో చాన్స్’ అని చెప్పింది. ఆమె ఆశ, ఆశయం అంతా డాక్టర్ కావాలనే. తర్వాత డాక్టర్ డేవిడ్ పావెల్ అనే ఎండోక్రైనాలజిస్ట్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో స్థిరపడ్డారు రిటా ఫారియా. కవితా భంభాని 1969లో ‘మిస్ ఇండియా’గా ఎన్నికయ్యారు కవితా భంభాని. ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లోకి అడుగు పెట్టారు. ఇంటీరియర్ డిజైనర్‌గా ఖ్యాతి సంపాదించారు. సినిమా రంగంతో ఆమెకున్న కనెక్షనల్లా హీరో అనిల్ కపూర్ ఆమెకు మరిది కావడమే. అవును.. అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్.. కవితా భంభాని చెల్లెలు. అలమ్జీత్ కౌర్ 1978 ‘మిస్ ఇండియా యూనివర్స్’ అలమ్జీత్ కౌర్. లా చదువుతున్నప్పుడు మిస్ ఇండియా కంటెస్ట్‌లో పాల్గొన్నారు. మిస్ యూనివర్స్ కంటెస్ట్‌లో బెస్ట్ నేషనల్ కస్ట్యూమ్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఈ పోటీల తర్వాత మళ్లీ న్యాయశాస్త్ర రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీప్తీ దివాకర్ 1981లో ‘మిస్ ఇండియా వరల్డ్’గా ఎన్నికయ్యారు దీప్తీ దివాకర్. ఆమె భరతనాట్య కళాకారిణి. ప్రపంచ వ్యాప్తంగా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. రచనా వ్యాసాంగం కూడా చేస్తారు. ‘ట్రీ ఆఫ్ వర్స్’ అనే ఆధ్యాత్మిక కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఉత్తరా మాత్రే ఖేర్ 1982 ‘మిస్ ఇండియా వరల్డ్’ కిరీటాన్ని గెల్చుకున్నారు. స్వల్ప కాలమే మోడల్‌గా పనిచేసి, తర్వాత ఆ రంగానికి స్వస్తి చెప్పారు. రెస్టారెంట్ బిజినెస్‌లోకి దిగారు. ప్రస్తుతం నాసిక్‌లో భర్తతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఓ ట్రస్ట్‌నూ నిర్వహిస్తున్నారు. అన్నీ థామస్ 1998 ‘మిస్ ఇండియా వరల్డ్’ అన్నీ థామస్. డాక్టర్ కావాలనుకున్నారు. కాని ఈ బ్యూటీ కంటెస్ట్ తర్వాత మెడిసిన్ తన కప్ ఆఫ్ టీ కాదని గ్రహించి.. ఈవెంట్ మేనేజర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నారు. సారా కార్నర్స్ 2001లో ‘మిస్ ఇండియా వరల్డ్’గా కిరీటాన్ని అందుకున్నారు సారా. తొమ్మిదేళ్ల వయసు నుంచే మోడలింగ్‌లో ఉన్న ఆమె ఈ కంటెస్ట్ తర్వాత మోడలింగ్‌కు గుడ్‌బై చెప్పి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లోకి అడుగుపెట్టారు. రచయిత్రి కూడా. పిల్లల కోసం కథలు రాస్తారు. వాసుకీ సుంకవల్లి న్యూయార్క్ యూనివర్శీటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వాసుకీ 2011లో ‘మిస్ ఇండియా యూనివర్స్’గా గెలుపొందారు. రెయిన్ మేకర్ సంస్థ సహ స్థాపకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వన్యా మిశ్రా 2012 ‘మిస్ ఇండియా వరల్డ్’ వన్యా మిశ్రా. ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ అయిన ఆమె తన కాలేజ్మేట్తో కలిసి ఫ్యాషన్ అంyŠ లైఫ్ స్టయిల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. శిల్పా సింగ్ 2012 ‘మిస్ ఇండియా యూనివర్స్’ శిల్పా సింగ్. క్యూబ్ 26 అనే టెక్ స్టార్టప్‌తో బిజినెస్, మార్కెటింగ్ రంగంలో స్థిరపడ్డారు. మిస్ ఇండియా నుంచి మార్కెటింగ్ హెడ్ దాకా సాగిన తన ప్రయాణాన్ని టెడెక్స్ టాక్‌లో పంచుకున్నారు కూడా. -
సొగసిరి
అచ్చ తెలుగు చీర కట్టులో సంప్రదాయ సిరులు కురిపించారు ముద్దుగుమ్మలు. మెరిపించే పట్టు వస్త్రాలు ధరించి కొత్త పెళ్లికూతుళ్లలా మురిపించారు. సోమాజిగూడ సీఎంఆర్ ఎక్స్‌క్లూజివ్‌లో శుక్రవారం జరిగిన డిజైనర్ బ్రైడల్ కలెక్షన్ లాంచింగ్‌లో మిస్ ఇండియా యూనివర్స్ (2014) నియోనితా లోధ్ స్పెషల్ అప్పీరెన్స్‌తో అదరగొట్టింది. ఆమెతో పాటు మోడల్సూ స్రైకింగ్ కలర్ శారీస్లో వయ్యారాలు ఒలికించారు. షోరూమ్ డెరైక్టర్ సత్తిబాబు పాల్గొన్నారు.